Champions Movie Trailer: 'ఛాంపియన్' కోసం చరణ్... ఏటీఎమ్ తనయుడి కోసం శంకర్‌దాదా కుమారుడు!
Ram Charan For Roshan Meka: శ్రీకాంత్ తనయుడు రోషన్ మేక హీరోగా నటించిన సినిమా 'ఛాంపియన్'. ఈ 18న ట్రైలర్ విడుదల కానుంది. ఆ కార్యక్రమానికి మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ రానున్నారు.

మెగాస్టార్ చిరంజీవి, శతాధిక చిత్ర కథానాయకుడు శ్రీకాంత్ మధ్య స్నేహం గురించి తెలుగు ప్రజలు, ప్రేక్షకులు అందరికీ తెలుసు. తనకున్న కోట్లాది మంది తమ్ముళ్లలో శ్రీకాంత్ మూడోవాడు అని చిరు పలు సందర్భాల్లో చెప్పారు. మెగాస్టార్ మీద అంతే అభిమానం శ్రీకాంత్ చూపిస్తూ వచ్చారు. వాళ్లిద్దరూ కలిసి 'శంకర్ దాదా ఎంబీబీఎస్', 'శంకర్ దాదా జిందాబాద్' చేశారు. ఆ సినిమాల్లో చిరంజీవి టైటిల్ రోల్ చేస్తే... ఆయన వెన్నంటి ఉండే ఏటీఎమ్ పాత్రలో శ్రీకాంత్ నటించారు. ఇప్పుడు శ్రీకాంత్ తనయుడి కోసం చిరు కుమారుడు వస్తున్నారు.
'ఛాంపియన్' కోసం రామ్ చరణ్!
శ్రీకాంత్ తనయుడు రోషన్ మేక (Roshan Meka) కథానాయకుడిగా నటించిన సినిమా 'ఛాంపియన్' (Champion Telugu Movie). క్రిస్మస్ సందర్భంగా డిసెంబర్ 25న థియేటర్లలోకి వస్తుందీ సినిమా. ఈ గురువారం... అంటే డిసెంబర్ 18న ట్రైలర్ విడుదల చేస్తున్నారు.
'ఛాంపియన్' ట్రైలర్ విడుదల కార్యక్రమానికి మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ (Ram Charan) ముఖ్య అతిథిగా హాజరు కానున్నారు. 'ఛాంపియన్' చిత్ర నిర్మాణ సంస్థ (వైజయంతి మూవీస్ అధినేత సి అశ్వినీదత్) కుమార్తెలు 'స్వప్న సినిమా' ప్రియాంక, స్వప్నలతో సైతం చిరు తనయుడికి మంచి అనుబంధం ఉంది. రామ్ చరణ్ మొదటి సినిమా 'చిరుత'ను ప్రొడ్యూస్ చేసింది వాళ్ళే. ఇటు నిర్మాతలు, అటు హీరో కోసం 'ఛాంపియన్' ట్రైలర్ లాంచ్‌కు చరణ్ వస్తున్నారు.
View this post on Instagram
'ఛాంపియన్'లో రోషన్ మేక సరసన మలయాళీ అమ్మాయి అనస్వర రాజన్ కథానాయికగా నటించారు. తెలుగులో ఆమెకు తొలి చిత్రమిది. దీనిని జీ స్టూడియోస్ సమర్పణలో ఆనంది ఆర్ట్ క్రియేషన్స్, కాన్సెప్ట్ ఫిల్మ్స్‌తో కలిసి స్వప్న సినిమా నిర్మిస్తోంది. ప్రదీప్ అద్వైతం దర్శకత్వం వహించారు. నందమూరి కళ్యాణ్ చక్రవర్తి, అర్చన కీలక పాత్రల్లో నటించారు. ఆల్రెడీ విడుదలైన 'గిరిగిర...', 'సల్లం గుండాలే' పాటలు చార్ట్ బస్టర్ అయ్యాయి. ఈ చిత్రానికి మిక్కీ జే మేయర్ సంగీత దర్శకుడు.





















