News
News
వీడియోలు ఆటలు
X

Ram Charan - Yentamma Song : సల్మాన్, వెంకీతో రామ్ చరణ్ లుంగీ డ్యాన్స్ - కుమ్మేశారంతే!

సల్మాన్ ఖాన్, పూజా హెగ్డే జంటగా రూపొందిన సినిమా 'కిసీ కా భాయ్ కిసీ కా జాన్'. హీరోయిన్ అన్నయ్యగా వెంకటేష్ నటించారు. ఇందులో 'ఏంటమ్మా' సాంగ్ ఈ రోజు రిలీజ్ చేశారు. రామ్ చరణ్ స్పెషల్ అట్రాక్షన్ అయ్యారు.

FOLLOW US: 
Share:

లుంగీ డ్యాన్స్ అంటే బాలీవుడ్ ప్రేక్షకులకు 'చెన్నై ఎక్స్‌ప్రెస్' సినిమాలో షారుఖ్ ఖాన్, దీపికా పదుకోన్ వేసిన స్టెప్పులు గుర్తు వస్తాయి. అది ఈ రోజు వరకు! ఇప్పటి నుంచి సల్మాన్ ఖాన్ (Salman Khan), మన విక్టరీ వెంకటేష్ (Venkatesh)తో కలిసి మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ (Ram Charan) వేసిన స్టెప్పులు గుర్తుకు వస్తాయని చెబితే అతిశయోక్తి కాదు!

బాలీవుడ్ స్టార్, కండల వీరుడు సల్మాన్ ఖాన్ కథానాయకుడిగా నటించిన తాజా సినిమా 'కిసీ కా భాయ్ కిసీ కి జాన్' (Kisi Ka Bhai Kisi Ki Jaan Movie). ఇందులో పూజా హెగ్డే (Pooja Hegde) కథానాయిక. సినిమాలో కథానాయికకు అన్నయ్యగా విక్టరీ వెంకటేష్ ఓ ప్రత్యేక పాత్ర చేశారు. ఏప్రిల్ 21న థియేటర్లలోకి సినిమా రానుంది. హిందీ ప్రేక్షకులతో పాటు తెలుగు ప్రేక్షకులు కూడా సినిమాపై ఆసక్తి చూపిస్తున్నారు. అందుకు కారణం రామ్ చరణ్ అని చెప్పాలి.

'ఏంటమ్మా...'లో చరణ్ స్టైలిష్ ఎంట్రీ! 
'కిసీ కా భాయ్ కిసీ కి జాన్' సినిమా నుంచి ఈ రోజు 'ఏంటమ్మా...' అంటూ సాగే పాటను విడుదల చేశారు. ఆ సాంగ్ స్పెషాలిటీ ఏంటంటే... రామ్ చరణ్ స్పెషల్ అప్పియరెన్స్! 'ఏంటమ్మా...' సాంగ్ పూర్తిగా సౌత్ స్టయిల్ లో సాగింది. సల్మాన్ ఖాన్, వెంకీ లుంగీ కట్టుకుని డ్యాన్స్ చేశారు. అయితే... రామ్ చరణ్ ఎంట్రీ తర్వాత కంప్లీట్ వైబ్ మారింది. 

జానీ మాస్టర్ ఈ పాటకు కొరియోగ్రఫీ అందించారు. 'రంగస్థలం' సినిమాలో 'జిల్ జిల్ జిగేలు రాణి...' పాటకూ ఆయనే కొరియోగ్రాఫర్. రామ్ చరణ్ సాంగ్స్ చాలా చేశారు. రామ్ చరణ్ స్టైల్ మీద ఐడియా ఉండటంతో ఇరగదీశారు. సల్మాన్ ఖాన్, రామ్ చరణ్, పూజా హెగ్డే డ్యాన్స్ చేయడం బావుంది.

Also Read : నేనెప్పుడు అన్నాను? - శోభితతో చైతూ డేటింగ్ మీద సమంత క్లారిటీ

సల్మాన్ ఖాన్, మెగా ఫ్యామిలీ మధ్య మంచి అనుబంధం ఉంది. చిరంజీవి కోసమే 'గాడ్ ఫాదర్' సినిమాలో సల్మాన్ స్పెషల్ రోల్ చేశారు. పతాక సన్నివేశాల్లో చిరు, సల్మాన్ సీన్లు హైలైట్ అయ్యాయి! ఆ సినిమాకు ఒక్క రూపాయి రెమ్యూనరేషన్ తీసుకోకుండా సల్మాన్ చేశారు. హిందీలో రామ్ చరణ్ 'జంజీర్' చేసినప్పుడు ఆయన మద్దతు ఇచ్చారు. సల్మాన్ ఖాన్ హైదరాబాద్ వస్తే తప్పకుండా మెగాస్టార్ ఇంటికి రాకుండా వెళ్ళారు. ఒకవేళ రావడం కుదరకపోతే కనీసం ఫోనుల్లో అయినా పలకరించుకుంటారు. ఆ అనుబంధం కారణంగా సల్మాన్ సినిమాలోని సాంగులో రామ్ చరణ్ స్పెషల్ రోల్ చేశారు. అదీ సంగతి!  

బతుకమ్మ పాటకు బుట్ట బొమ్మ ఆట!
ఆల్రెడీ ఈ సినిమాలో 'బతుకమ్మ' పాటను కొన్ని రోజుల క్రితం విడుదల చేశారు. 'కె.జి.యఫ్' ఫేమ్ రవి బస్రూర్ సంగీతం అందించగా... తెలుగు లిరిక్స్ హరిణి ఇవటూరి, కిన్నల్ రాజ్ రాశారు. హిందీ లిరిక్స్ షబ్బీర్ అహ్మద్, రవి బస్రూర్ రాశారు. 'బతుకమ్మ' వీడియో సాంగులో బుట్టబొమ్మ పూజా హెగ్డే డ్యాన్స్ ఆకట్టుకునేలా ఉంది. తెలంగాణ సంస్కృతిని ప్రతిబింబించేలా చక్కగా చేశారు. 

Also Read : సమంతకు సలహా ఇవ్వలేనంటున్న ప్రియాంకా చోప్రా!

వెంకీ సలహాతో...
సినిమాలోని ఓ సందర్భంలో 'బతుకమ్మ...' పాట పెడితే బావుంటుందని విక్టరీ వెంకటేష్ సలహా ఇచ్చారట. ఆ ఐడియా నచ్చిన సల్మాన్ ఖాన్... పాట పెట్టమని దర్శక, నిర్మాతలకు చెప్పారట. ఈ పాటను తెలంగాణలో మహిళలకు అంకితం ఇస్తున్నట్లు సమాచారం. సుమారు 200 మంది డ్యాన్సర్లు, సినిమాలోని ప్రధాన తారాగణం మీద పాటను తెరకెక్కించారు. బతుకమ్మ పాట చూస్తే... అందులో భూమిక కూడా కనిపిస్తారు. వెంకటేష్ భార్య పాత్రలో ఆమె నటించారు. రోహాణి హట్టంగడి కూడా ఉన్నారు. సినిమాలో హీరోయిన్ పూజా హెగ్డేను హైదరాబాదీ అమ్మాయిగా చూపిస్తున్నారు.

Published at : 04 Apr 2023 12:57 PM (IST) Tags: Pooja hegde salman khan Ram Charan Kisi Ka Bhai Kisi Ki Jaan Movie Yentamma Song

సంబంధిత కథనాలు

Flautist Naveen Kumar: ఏఆర్ రెహ్మాన్ ఫ్లూటిస్ట్ నవీన్ కుమార్‌కి బైడెన్ ప్రశంసలు, లైఫ్‌టైమ్ అచీవ్‌మెంట్ అవార్డ్‌తో సత్కారం

Flautist Naveen Kumar: ఏఆర్ రెహ్మాన్ ఫ్లూటిస్ట్ నవీన్ కుమార్‌కి బైడెన్ ప్రశంసలు, లైఫ్‌టైమ్ అచీవ్‌మెంట్ అవార్డ్‌తో సత్కారం

Ashish Vidyarthi : కష్టం కలిగినా అబ్బాయికి విడాకుల గురించి చెప్పక తప్పలేదు- ఆశిష్ విద్యార్థి

Ashish Vidyarthi : కష్టం కలిగినా అబ్బాయికి విడాకుల గురించి చెప్పక తప్పలేదు-  ఆశిష్ విద్యార్థి

Allu Arjun - Telugu Indian Idol 2 : గర్ల్ ఫ్రెండ్ పేరు చెప్పేసిన అల్లు అర్జున్ - ఇంటికెళ్లాక పరిస్థితి ఏంటో?

Allu Arjun - Telugu Indian Idol 2 : గర్ల్ ఫ్రెండ్ పేరు చెప్పేసిన అల్లు అర్జున్ - ఇంటికెళ్లాక పరిస్థితి ఏంటో?

SPB Birth Anniversary: ఇంజనీరింగ్ డ్రాప్ అవుట్ To గిన్నిస్ వరల్డ్ రికార్డ్, ఎస్పీ బాలు గురించి మీకు ఈ విషయాలు తెలుసా?

SPB Birth Anniversary: ఇంజనీరింగ్ డ్రాప్ అవుట్ To గిన్నిస్ వరల్డ్ రికార్డ్,  ఎస్పీ బాలు గురించి మీకు ఈ విషయాలు తెలుసా?

Pawan Kalyan - OG : రాజకీయాలు రాజకీయాలే, సినిమాలు సినిమాలే - పవన్ షూటింగులు ఆగట్లేదు! 

Pawan Kalyan - OG : రాజకీయాలు రాజకీయాలే, సినిమాలు సినిమాలే - పవన్ షూటింగులు ఆగట్లేదు! 

టాప్ స్టోరీస్

Gudivada Amarnath: రైలు ప్రమాద స్థలాన్ని పరిశీలించిన మంత్రి గుడివాడ, మానవ తప్పిదమేనని వెల్లడి

Gudivada Amarnath: రైలు ప్రమాద స్థలాన్ని పరిశీలించిన మంత్రి గుడివాడ, మానవ తప్పిదమేనని వెల్లడి

TDP Leaders on YCP Govt: ఆనం వెంకట రమణారెడ్డిపై దాడి అనాగరికం, అప్రజాస్వామికం: టీడీపీ నేతలు

TDP Leaders on YCP Govt: ఆనం వెంకట రమణారెడ్డిపై దాడి అనాగరికం, అప్రజాస్వామికం: టీడీపీ నేతలు

Sharwanand Wedding Photos : రాయల్‌గా శర్వా - రక్షిత వెడ్డింగ్, కొత్త జంట ఫోటోలు చూశారా?

Sharwanand Wedding Photos : రాయల్‌గా శర్వా - రక్షిత వెడ్డింగ్, కొత్త జంట ఫోటోలు చూశారా?

Odisha Train Accident: రైల్వే నెట్‌వర్క్‌లో కొన్ని లూప్‌హోల్స్‌ ఉన్నాయ్, అసలు సమస్య అదే - నిపుణులు

Odisha Train Accident: రైల్వే నెట్‌వర్క్‌లో కొన్ని లూప్‌హోల్స్‌ ఉన్నాయ్, అసలు సమస్య అదే - నిపుణులు