News
News
వీడియోలు ఆటలు
X

Samantha Reaction On Rumours : నేనెప్పుడు అన్నాను? - శోభితతో చైతూ డేటింగ్ మీద సమంత క్లారిటీ 

Samantha Tweet On Naga Chaitanya : శోభితా ధూళిపాళతో నాగచైతన్య డేటింగ్ రూమర్స్ మీద సమంత కామెంట్ చేస్తున్నట్లు సోషల్ మీడియాలో, ఓకే సెక్షన్ ఆఫ్ వెబ్ మీడియాలో ప్రచారం జరుగుతోంది. దానిపై ఆమె స్పందించారు.

FOLLOW US: 
Share:

సమంత (Samantha)తో వైవాహిక బంధం నుంచి వేరు పడిన తర్వాత, విడాకులు తీసుకున్నాక... తెలుగు అమ్మాయి, హిందీతో పాటు తెలుగు, తమిళ సినిమాల్లో నటిస్తున్న శోభితా ధూళిపాళ (Sobhita Dhulipala)తో అక్కినేని నాగ చైతన్య (Akkineni Naga Chaitanya) ప్రేమలో పడ్డారని ఫిల్మ్ నగర్ గుసగుస. వాళ్ళిద్దరూ లండన్ రెస్టారెంట్, వీధుల్లో తిరిగిన ఫోటోలు సోషల్ మీడియాలో లీక్ కావడంతో డేటింగ్ రూమర్స్ వచ్చాయి. వాళ్ళిద్దరి బంధం మీద సమంత కామెంట్ చేసినట్లు వార్తలు వచ్చాయి. 

ఎవరు ఎవరితో డేటింగ్ చేస్తే నాకేంటి?
సమంత ప్రధాన పాత్రలో నటించిన 'శాకుంతలం' ఏప్రిల్ 14న విడుదల కానుంది. ఈ నేపథ్యంలో ముంబై మీడియాకు వరుస ఇంటర్వ్యూలు ఇచ్చారు. అక్కడ చైతూ, శోభిత డేటింగ్ గురించి అడగ్గా 'ఎవరు ఎవరితో డేటింగ్ చేస్తే నాకేంటి?' అని సామ్ సమాధానం చెప్పినట్లు ఓ వార్త చక్కర్లు కొడుతోంది. దానిపై ఆమె స్పందించారు. 

నేను ఎప్పుడూ అలా అనలేదు - సమంత
ఎంత మందితో డేటింగ్ చేసినప్పటికీ... ప్రేమకు విలువ ఇవ్వని వాళ్ళకు చివరకు కన్నీళ్లు మిగులుతాయని, ఎవరు ఎవరితో డేటింగ్ చేస్తే తనకేంటి? అని సమంత చెప్పినట్లు ఓ మీడియా వార్త రాయగా... ''నేను ఎప్పుడూ చెప్పలేదు'' అని సామ్ పేర్కొన్నారు. అదీ సంగతి! మెజారిటీ బాలీవుడ్ మీడియా అయితే సమంత చెప్పని మాటలను చెప్పినట్లు రాసింది. డేటింగ్ మీద స్పందించినట్లు కథనాలు రాసింది.  అయితే, ఓ ఇంటర్వ్యూలో మాత్రం విడాకుల విషయంలో తన తప్పేమీ లేదని ఆవిడ పేర్కొన్నారు.

Also Read : 'దసరా' హిట్టుతో హ్యాపీ, కానీ ఆ విషయంలో నానికి నిరాశేనా?నేను ఏ తప్పూ చేయలేదు! - సమంత 

''విడాకులు తీసుకున్నాం. కానీ, నేను ఏమీ తప్పుగా చేయలేదు. నా వైపు నుంచి వంద శాతం కృషి చేశా. వైవాహిక బంధానికి కట్టుబడి ఉన్నాను'' అని సమంత పేర్కొన్నారు. తాను తప్పు చేయలేదని సమంత చెప్పడంలో అర్థం ఏమిటి? చైతన్య తప్పు చేశాడని చెబుతున్నారా? రెండు లైన్లలో ఎన్నో అనుమానాలు, ప్రశ్నలను ప్రేక్షకులకు వదిలేశారు. సమంత కామెంట్స్ వల్ల నాగ చైతన్య బ్యాడ్ అవుతున్నాడని అక్కినేని ఫ్యాన్స్ ఫీల్ అవుతున్నారు. 

విడాకుల తర్వాత సమంత మీద చాలా ట్రోల్స్ వచ్చాయి. అప్పట్లో సమంతకు ఎవరితోనో ఎఫైర్ ఉందని చెప్పుకొచ్చారు. ఆ వదంతులను, పుకార్లను సమంత ఖండించారు. తనపై వచ్చిన విమర్శలపై సమంత స్పందిస్తూ... "అభిమానుల ఫ్రస్ట్రేషన్ అర్థం చేసుకోగలను. అయితే... దాన్ని మారో రూపంలో చెబితే బావుండేది. ట్రోల్స్ చేయకుండా" అని అన్నారు.

సోషల్ మీడియా వచ్చిన తర్వాత నేరుగా స్టార్స్‌ను కామెంట్ చేసే, ట్రోల్స్ చేసే నెటిజన్స్ సంఖ్య పెరిగింది. స్టార్స్ వ్యక్తిగత జీవితంలోకి ప్రవేశిస్తున్నారు. దీనికి కారణం స్టార్స్ అనేది సమంత మాటలను బట్టి అర్థమవుతోంది. "అభిమానులు చూపించే ప్రేమ కోసం స్టార్స్ పరితపిస్తారు. ప్రతి విషయాన్నీ వాళ్లతో పంచుకుంటారు. నా వ్యక్తిగత విషయాల్ని వారితో సోషల్ మీడియాలో పోస్ట్ చేస్తా. అలా చేయడం వల్ల... ఓ విధంగా అభిమానులు, ప్రేక్షకులను నా జీవితంలోకి ఆహ్వానించడమే" అని సమంత వ్యాఖ్యానించారు. 

Also Read సమంతకు సలహా ఇవ్వలేనంటున్న ప్రియాంకా చోప్రా!

Published at : 04 Apr 2023 12:27 PM (IST) Tags: Naga Chaitanya Sobhita Dhulipala Samantha Dating Rumors

సంబంధిత కథనాలు

Kriti Sanon Om Raut : తిరుమలలో వివాదాస్పదంగా మారిన కృతి సనన్, ఓం రౌత్ ప్రవర్తన

Kriti Sanon Om Raut : తిరుమలలో వివాదాస్పదంగా మారిన కృతి సనన్, ఓం రౌత్ ప్రవర్తన

Prabhas On Om Raut : యుద్ధమే చేశాడు - ఓం రౌత్‌ను వెనకేసుకొచ్చిన ప్రభాస్

Prabhas On Om Raut : యుద్ధమే చేశాడు - ఓం రౌత్‌ను వెనకేసుకొచ్చిన ప్రభాస్

‘ఆదిపురుష్’ టీమ్ 7 నెలలు నిద్రపోకుండా పనిచేశారు, చిరంజీవి ఆశ్చర్యపోయారు: ప్రభాస్ - కన్నీళ్లు పెట్టుకున్న ఓంరౌత్

‘ఆదిపురుష్’ టీమ్ 7 నెలలు నిద్రపోకుండా పనిచేశారు, చిరంజీవి ఆశ్చర్యపోయారు: ప్రభాస్ - కన్నీళ్లు పెట్టుకున్న ఓంరౌత్

Adipurush Trailer: ‘ఆదిపురుష్’ ఫైనల్ ట్రైలర్ - భీకర యుద్ధంలో కదంతొక్కిన రామసేన!

Adipurush Trailer: ‘ఆదిపురుష్’ ఫైనల్ ట్రైలర్ - భీకర యుద్ధంలో కదంతొక్కిన రామసేన!

ప్రభాస్ తనలో రాముడిని బయటకు తెచ్చారు, నేటితరానికి ఈ మూవీ అవసరం: చిన్న జీయర్ స్వామి

ప్రభాస్ తనలో రాముడిని బయటకు తెచ్చారు, నేటితరానికి ఈ మూవీ అవసరం: చిన్న జీయర్ స్వామి

టాప్ స్టోరీస్

Odisha Train Accident: ఒడిశాలోని ఓ మార్చురీలో హర్రర్ సినిమాను తలపించే సీన్‌- హడలిపోయిన అధికారయంత్రాంగం!

Odisha Train Accident: ఒడిశాలోని ఓ మార్చురీలో హర్రర్ సినిమాను తలపించే సీన్‌- హడలిపోయిన అధికారయంత్రాంగం!

YS Viveka Case : అవినాష్ రెడ్డికి ముందస్తు బెయిల్‌ రద్దు చేయండి - సుప్రీంకోర్టులో సునీత పిటిషన్

YS Viveka Case :  అవినాష్ రెడ్డికి ముందస్తు బెయిల్‌ రద్దు చేయండి -   సుప్రీంకోర్టులో సునీత పిటిషన్

WTC Final 2023: ఓవల్ ఎవరికి అనుకూలం - భారత్, ఆసీస్‌ల రికార్డులు ఎలా ఉన్నాయి?

WTC Final 2023: ఓవల్ ఎవరికి అనుకూలం - భారత్, ఆసీస్‌ల రికార్డులు ఎలా ఉన్నాయి?

WTC Final 2023: కుడి ఎడమైతే పొరపాటు లేదోయ్ - గెలుపు టీమిండియాదేనోయ్ - ఫ్యాన్స్‌కు ‘లెఫ్ట్’ సెంటిమెంట్

WTC Final 2023: కుడి ఎడమైతే పొరపాటు లేదోయ్ - గెలుపు టీమిండియాదేనోయ్ - ఫ్యాన్స్‌కు ‘లెఫ్ట్’ సెంటిమెంట్