అన్వేషించండి

Ram Charan: భార్య ఉపాసన, కూతురు క్లింకారతో కలిసి చెన్నై చేరుకున్న రామ్‌ చరణ్‌ - ఎందుకంటే!

Ram Charan: మరికొద్ది గంటల్లో గౌరవ డాక్టరేట్‌ అందుకోబోతున్నాడు. ఈ రోజు చెన్నై వేల్స్‌ యూనిర్సిటీలో జరిగే స్నాతకోత్సవ వేడుకలకు భార్య, కూతురితో కలిసి పాల్గొనబోతున్నాడు.

Ram Charan Reached to Chennai With Wife Upasana And Daughter: గ్లోబల్‌ స్టార్‌ రామ్‌ చరణ్‌కు ప్రముఖ యూనివర్సిటీ డాక్టరేట్‌ ప్రకటించిన సంగతి తెలిసిందే. సినీ ఇండస్ట్రీకి నటుడిగా అతడు అందిస్తున్న విశేష సేవలకుగానూ చెన్నైకి చెందిన వేల్స్‌ యూనివర్సిటీ చరణ్‌కు గౌరవ డాక్టరేట్‌ను ప్రకటించింది. ఇక యూనివర్సిటీలో జరిగే విశ్వవిద్యాలయం స్నాతకోత్సవ వేడుకలో భాగంగా చరణ్‌ను సదరు యూనివర్సిటీ గౌరవ డాక్టరేట్‌ సత్కరించనుంది. ఈ నేపథ్యంలో నేడు (ఏప్రిల్‌ 13) జరిగే ఈ కార్యక్రమానికి చరణ్‌ ముఖ్య అతిథిగా పాల్గొననున్నాడు.

ఈ నేపథ్యంలో చరణ్‌ తన కుటుంబంతో కలిసి చెన్నైకి చేరుకున్నారు. ఆయన భార్య ఉపాసన, కూతురు క్లింకారతో కలిసి చరణ్‌ చెన్నైలో ల్యాండ్‌ అయ్యాడు. ఈ సందర్భంగా అక్కడ ఎయిర్‌పోర్టు నుంచి బయటకు వస్తున్న రామ్‌ చరణ్‌, ఉపాసన ఫోటోలు బయటకు వచ్చాయి. ఈ సందర్భంగా చరణ్‌కు ఎయిర్‌పోర్టు వద్ద ఘనస్వాగతం లభించింది. ఇక అక్కడి నుంచి నేరుగా వేల్స్‌ యూనివర్సిటీ జరిగిన ఈ కార్యక్రమంలో చరణ్‌ ముఖ్య అతిథిగా పాల్గొని ఈ గౌరవ డాక్టరేట్‌ను అందుకొనున్నాడు. ఈ స్నాతకోత్సవ వేడుకులకు ఆల్‌ ఇండియా కౌన్సిల్‌ ఫర్‌ టెక్నికల్‌ ఎడ్యుకేషన్‌(AICTC) అధ్యక్షుడు డీజీ సీతారాం  పాల్గొని చరణ్‌కు డాక్టరేట్‌ అందించనున్నారు.

ఈ కార్యక్రమానికి చరణ్‌తో పాటు పలువురు సినీ, రాజకీయ ప్రముఖులు కూడా పాల్గొననున్నట్టు సమాచారం. ఆర్ఆర్‌ఆర్‌ మూవీతో రామ్‌ చరణ్‌ వరుసగా ఇలాంటి అరుదైన గౌరవాలను పొందుతున్నాడు. ఇప్పటికీ గ్లోబల్‌ స్టార్‌ బిరుదు పొందిన చరణ్‌, తాజాగా డాక్టర్‌రేట్‌ అందుకోవడం నిజం టాలీవుడ్‌ ఇండస్ట్రీ గర్వించదగ్గ విషయం. ఇక ఈ మెగా హీరోకు దక్కుతున్న బిరుదులు, అవార్డులు చూసి మెగా ఫ్యాన్స్‌ అంతా మురిసిపోతున్నారు.   ఇక చరణ్‌ సినిమాల విషయానికి వస్తే.. ప్రస్తుతం 'గేమ్‌ ఛేంజర్‌' మూవీ చేస్తున్నాడు. ప్రస్తుతం ఈ మూవీ షూటింగ్‌లో చివరి దశలో ఉంది. డైరెక్టర్‌ శంకర్‌ దర్వకత్వంలో తెరకెక్కుతున్న ఈ చిత్రంపై భారీ అంచనాలు నెలకొన్నాయి.

Also Read: తండ్రయిన మంచు మనోజ్‌ - పండంటి బిడ్డకు జన్మనిచ్చిన మౌనిక రెడ్డి

పైగా ఆర్‌ఆర్‌ఆర్ మూవీ తర్వాత చరణ్‌ నటిస్తున్న చిత్రమిది.. పైగా శంకర్‌ దర్శకత్వంలో రూపుదిద్దుకోవడంతో గేమ్‌ ఛేంజర్‌ మూవీ కోసం తెలుగు ఆడియన్సే కాదు తమిళ్‌ ప్రేక్షకులు సైతం ఈగర్‌ వెయిట్‌ చేస్తున్నారు. ప్రస్తుతం శరవేగంగా షూటింగ్‌ జరుపుకుంటున్న ఈ చిత్రం పోస్ట్‌ ప్రొడక్షన్‌ వర్క్‌ కూడా మొదలైనట్టు తెలుస్తోంది. ఇక 'గేమ్‌ ఛేంజర్‌' దసరా కానుకగా రిలీజ్‌ చేసేందుకు మూవీ టీం సన్నాహాలు చేస్తుందని ఇన్‌సైడ్‌ సినీ సర్కిల్లో టాక్‌. ఇక శ్రీ వెంకటేశ్వర బ్యానర్‌లో దిల్‌ రాజు తెరకెక్కిస్తున్న ఈ చిత్రంలో చరణ్‌కు జోడిగా బాలీవుడ్‌ బ్యూటీ కియారా అద్వానీ నటిస్తుంది. నటి అంజలి, ఎస్‌జే సూర్య, సముద్రఖని, జయరామ్‌, సునీల్‌, బాలీవుడ్‌ నటుడు హ్యారీ జోష్‌లు ఇతర కీలక పాత్రల్లో కనిపించబోతున్నారు. మరోవైపు చరణ్‌ మరో పాన్‌ ఇండియా మూవీని కూడా లైన్లో పెట్టాడు. 'ఉప్పెన' ఫేం బుచ్చిబాబు సానా దర్శకత్వలో ఆర్‌సీ16(#RC16) వర్కింగ్‌ టైటిల్‌తో వస్తున్న సంగతి తెలిసిందే. ఇటీవల పూజ కార్యక్రమంతో గ్రాండ్‌గా లాంచ్‌ అయిన ఈ చిత్రం త్వరలోనే రెగ్యూలర్‌ షూటింగ్‌ను మొదలుపెట్టనుందట. ఇందులో చరణ్‌కు జోడీగా బాలీవుడ్‌ బ్యూటీ జాన్వీకపూర్‌ నటిస్తుంది.

మరిన్ని చూడండి
Advertisement

టాప్ హెడ్ లైన్స్

Nitish Family Photo With Kohli: కోహ్లీతో సెల్ఫీ దొరకలేదనే కసితో మొదలై.. తన ఫ్యామిలీతోనే విరాట్ ఫొటో దిగేలా ఎదిగిన నితీశ్.. వాట్ ఏ జర్నీ
కోహ్లీతో సెల్ఫీ దొరకలేదనే కసితో మొదలై.. తన ఫ్యామిలీతోనే విరాట్ ఫొటో దిగేలా ఎదిగిన నితీశ్.. వాట్ ఏ జర్నీ
South Korea Plane Crash: ఎయిర్‌పోర్టులో గోడను ఢీకొట్టిన విమానం, మంటలు చెలరేగి 67 మంది మృతి
ఎయిర్‌పోర్టులో గోడను ఢీకొట్టిన విమానం, మంటలు చెలరేగి 67 మంది మృతి- సంఖ్య పెరిగే అవకాశం
Pawan Kalyan OG: పవన్‌ను ఇబ్బంది పెట్టకండ్రా... టైముంది... థియేటర్లలో అల్లాడిద్దాం - ఫ్యాన్స్‌కు 'ఓజీ' టీమ్ రిక్వెస్ట్
పవన్‌ను ఇబ్బంది పెట్టకండ్రా... టైముంది... థియేటర్లలో అల్లాడిద్దాం - ఫ్యాన్స్‌కు 'ఓజీ' టీమ్ రిక్వెస్ట్
Telangana Income: కాంగ్రెస్ పాలన తొలి ఏడాదిలోనే ఖజానాకు తగ్గిన ఆదాయం - బీఆర్ఎస్‌ చేతికి మరో అస్త్రం
కాంగ్రెస్ పాలన తొలి ఏడాదిలోనే ఖజానాకు తగ్గిన ఆదాయం - బీఆర్ఎస్‌ చేతికి మరో అస్త్రం
Advertisement
Advertisement
Advertisement
ABP Premium

వీడియోలు

సెంచరీ చేసిన నితీశ్ రెడ్డి, సోషల్ మీడియాలో స్టిల్స్ వైరల్మాజీ ప్రధాని మన్మోహన్ అంత్యక్రియలు పూర్తిమాదాపూర్‌లో ఘోర రోడ్డు ప్రమాదం, ఇద్దరు యువకులు మృతిపవన్ టూర్‌లో ఫేక్ ఐపీఎస్  కలకలం! పోలీసులతో ఫోటోలకు ఫోజులు

ఫోటో గ్యాలరీ

వ్యక్తిగత కార్నర్

అగ్ర కథనాలు
టాప్ రీల్స్
Nitish Family Photo With Kohli: కోహ్లీతో సెల్ఫీ దొరకలేదనే కసితో మొదలై.. తన ఫ్యామిలీతోనే విరాట్ ఫొటో దిగేలా ఎదిగిన నితీశ్.. వాట్ ఏ జర్నీ
కోహ్లీతో సెల్ఫీ దొరకలేదనే కసితో మొదలై.. తన ఫ్యామిలీతోనే విరాట్ ఫొటో దిగేలా ఎదిగిన నితీశ్.. వాట్ ఏ జర్నీ
South Korea Plane Crash: ఎయిర్‌పోర్టులో గోడను ఢీకొట్టిన విమానం, మంటలు చెలరేగి 67 మంది మృతి
ఎయిర్‌పోర్టులో గోడను ఢీకొట్టిన విమానం, మంటలు చెలరేగి 67 మంది మృతి- సంఖ్య పెరిగే అవకాశం
Pawan Kalyan OG: పవన్‌ను ఇబ్బంది పెట్టకండ్రా... టైముంది... థియేటర్లలో అల్లాడిద్దాం - ఫ్యాన్స్‌కు 'ఓజీ' టీమ్ రిక్వెస్ట్
పవన్‌ను ఇబ్బంది పెట్టకండ్రా... టైముంది... థియేటర్లలో అల్లాడిద్దాం - ఫ్యాన్స్‌కు 'ఓజీ' టీమ్ రిక్వెస్ట్
Telangana Income: కాంగ్రెస్ పాలన తొలి ఏడాదిలోనే ఖజానాకు తగ్గిన ఆదాయం - బీఆర్ఎస్‌ చేతికి మరో అస్త్రం
కాంగ్రెస్ పాలన తొలి ఏడాదిలోనే ఖజానాకు తగ్గిన ఆదాయం - బీఆర్ఎస్‌ చేతికి మరో అస్త్రం
Venkatesh: వెంకటేష్ వారసుడు వస్తున్నాడోచ్... సినిమాల్లోకి వచ్చేందుకు అర్జున్ దగ్గుబాటి రెడీ
వెంకటేష్ వారసుడు వస్తున్నాడోచ్... సినిమాల్లోకి వచ్చేందుకు అర్జున్ దగ్గుబాటి రెడీ
Anand Deverakonda: హిట్ దర్శకుడితో ఆనంద్ దేవరకొండ కొత్త సినిమా - హీరోయిన్‌గా మలయాళీ భామకు ఛాన్స్
హిట్ దర్శకుడితో ఆనంద్ దేవరకొండ కొత్త సినిమా - హీరోయిన్‌గా మలయాళీ భామకు ఛాన్స్
Pakistan Afghanistan War: తాలిబన్ల చేతిలో చావు దెబ్బ తింటున్న పాకిస్తాన్ -  భారత్ పని సులువైనట్లే !
తాలిబన్ల చేతిలో చావు దెబ్బ తింటున్న పాకిస్తాన్ - భారత్ పని సులువైనట్లే !
World Rapid Chess Champion: ర్యాపిడ్ చెస్ ఛాంపియన్‌గా కోనేరు హంపి, తెలుగు తేజం అరుదైన ఘనత
ర్యాపిడ్ చెస్ ఛాంపియన్‌గా కోనేరు హంపి, తెలుగు తేజం అరుదైన ఘనత
Embed widget