Peddi New Release Date : రామ్ చరణ్ 'పెద్ది' రిలీజ్ వాయిదా - కొత్త రిలీజ్ డేట్ ఎప్పుడంటే?
Peddi Release Date : రామ్ చరణ్ 'పెద్ది' మూవీ రిలీజ్ వాయిదా పడింది. ఈ మేరకు డైరెక్టర్ బుచ్చిబాబు అఫీషియల్‌గా కొత్త రిలీజ్ డేట్ అనౌన్స్ చేశారు.

Ram Charan's Peddi Movie New Release Date Announced : గ్లోబల్ స్టార్ రామ్ చరణ్ అవెయిటెడ్ విలేజ్ స్పోర్ట్స్ డ్రామా 'పెద్ది' రిలీజ్ వాయిదా పడింది. చరణ్ బర్త్ డే సందర్భంగా మార్చి 27న సినిమా ప్రేక్షకుల ముందుకు వస్తుందని ముందు ప్రకటించినా అనుకోని కారణాలతో వాయిదా పడింది.
కొత్త రిలీజ్ డేట్ ఎప్పుడంటే?
'పెద్ది' మూవీ వరల్డ్ వైడ్‌గా ఏప్రిల్ 30న ప్రేక్షకుల ముందుకు రానుంది. ఈ మేరకు డైరెక్టర్ బుచ్చిబాబు అఫీషియల్‌గా సోషల్ మీడియా వేదికగా కొత్త రిలీజ్ డేట్ కన్ఫర్మ్ చేశారు. షూటింగ్ ఇంకా పెండింగ్ ఉండడం, పోస్ట్ ప్రొడక్షన్ పనులు, ప్రమోషన్స్ వంటి కారణాలతో వాయిదా పడినట్లు తెలుస్తోంది. దీంతో ఫ్యాన్స్ కాస్త నిరాశ చెందుతున్నారు.
30-04-2026 💥#PEDDI
— BuchiBabuSana (@BuchiBabuSana) February 4, 2026
సమ్మర్‌కు బిగ్ బ్లాక్ బస్టర్
గత కొంతకాలంగా మూవీ రిలీజ్ వాయిదా పడుతుందంటూ ప్రచారం సాగింది. అంతా అనుకున్నట్లుగానే కొత్త రిలీజ్ డేట్ అనౌన్స్ చేశారు. మూవీ రిలీజ్ వాయిదాపై ఫ్యాన్స్ కొంత నిరాశ చెందుతున్నా... సమ్మర్‌కు పర్ఫెక్ట్ టైమింగ్‌లో రిలీజ్ చేస్తున్నారంటూ కామెంట్స్ చేస్తున్నారు. వీకెండ్, సమ్మర్ కలిసొస్తుందని మేకర్స్ భావించి కొత్త రిలీజ్ డేట్ ఫిక్స్ చేశారని అంటున్నారు. ఈసారి బాక్సాఫీస్ రికార్డులు బద్దలవడం ఖాయమంటూ ధీమా వ్యక్తం చేస్తున్నారు.
ఈ మూవీలో చరణ్ సరసన జాన్వీ కపూర్ హీరోయిన్‌గా నటించగా... కన్నడ స్టార్ శివరాజ్ కుమార్, మీర్జాపూర్ ఫేం దివ్యేందు శర్మ, బోమన్ ఇరానీ, జగపతి బాబు తదితరులు కీలకపాత్రలు పోషించారు. ఇప్పటికే రిలీజ్ చేసిన గ్లింప్స్, చికిరి చికిరి సాంగ్ ట్రెండ్ క్రియేట్ చేశాయి. రెండో సాంగ్ కోసం ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు. మైత్రీ మూవీ మేకర్స్, సుకుమార్ రైటింగ్స్ సమర్పణలో వృద్ధి సినిమాస్ బ్యానర్‌పై వెంకట సతీష్ కిలారు నిర్మిస్తున్నారు. ఉత్తరాంధ్ర గ్రామీణ స్పోర్ట్స్ నేపథ్యంలో యాక్షన్ డ్రామాగా మూవీ రూపొందుతోంది. ఆస్కార్ విన్నర్ ఏఆర్ రెహమాన్ మ్యూజిక్ అందిస్తున్నారు. తెలుగుతో పాటు తమిళం, హిందీ, కన్నడ, మలయాళం ఇలా పాన్ ఇండియా భాషల్లో మూవీ ప్రేక్షకుల ముందుకు రానుంది.
అదే రోజున బాబాయ్ మూవీ
ఇక పెద్ది రిలీజ్ అనుకున్న టైంకు ఒక రోజు ముందు పవర్ స్టార్ పవన్ కల్యాణ్ 'ఉస్తాద్ భగత్ సింగ్' ప్రేక్షకుల ముందుకు రానుంది. ఈ మేరకు మూవీ టీం అఫీషియల్‌గా అనౌన్స్ చేసింది. ఈ మూవీకి హరీష్ శంకర్ దర్శకత్వం వహిస్తుండగా... పవన్ సరసన శ్రీలీల, రాశీ ఖన్నా హీరోయిన్లుగా నటించారు. రాకింగ్ స్టార్ దేవిశ్రీ ప్రసాద్ మ్యూజిక్ అందించగా... ఇప్పటికే రిలీజ్ అయిన 'దేఖ్ లేంగే సాలా' సాంగ్ ట్రెండ్ అవుతోంది. మైత్రీ మూవీ మేకర్స్ బ్యానర్‌పై నవీన్ యెర్నేని, రవిశంకర్ నిర్మిస్తున్నారు. హరీష్, పవన్ కాంబోపై బిగ్ హైప్ క్రియేట్ అవుతోంది.
ట్రెండింగ్ వార్తలు






















