Peddi Pre Release Business: రామ్ చరణ్ 'పెద్ది' ప్రీ రిలీజ్ బిజినెస్ టార్గెట్ @ 350 కోట్లు... బడ్జెట్ ఎంతో తెలుసా?
Ram Charan Peddi Updates: గ్లోబల్ స్టార్ రామ్ చరణ్ హీరోగా రూపొందుతున్న పాన్ ఇండియా స్పోర్ట్స్ డ్రామా 'పెద్ది'. మూవీ బడ్జెట్, ప్రీ రిలీజ్ బిజినెస్ టార్గెట్ డీటెయిల్స్ తెలుసా?

గ్లోబల్ స్టార్ రామ్ చరణ్ (Ram Charan) కథానాయకుడిగా దర్శకుడు బుచ్చిబాబు సానా తెరకెక్కిస్తున్న స్పోర్ట్స్ డ్రామా 'పెద్ది' (Peddi Movie). ప్రజెంట్ జెట్ స్పీడులో షూటింగ్ జరుగుతోంది. అమ్మమ్మ అల్లు కనకరత్నం మరణం, దశదిన కర్మ వంటి కార్యక్రమాల కోసం రెండు మూడు రోజుల బ్రేక్ మాత్రమే తీసుకున్నారు చరణ్. ఈ సినిమా షూటింగ్ 'గేమ్ ఛేంజర్' వల్ల కొంత ఆలస్యం అయ్యింది. 'ఉప్పెన' తర్వాత ఈ కథతో ఎన్టీఆర్ దగ్గరకు వెళ్లి అక్కడ కొన్ని రోజులు ఉండటం వల్ల దర్శకుడికి కెరీర్‌లో ఎక్కువ గ్యాప్ కనబడుతోంది. లేట్ అయినా లేటెస్టుగా, భారీ ఎత్తున ఈ సినిమాను తెరకెక్కిస్తున్నారు.
మూడు వందల కోట్లకు పైగా 'పెద్ది' బడ్జెట్!
Peddi Movie Budget: 'పెద్ది' బడ్జెట్ మూడు వందల కోట్లకు పైగా వృద్ధి సినిమాస్ అధినేత సతీష్ కిలారు సన్నిహిత వర్గాలు తెలిపాయి. హీరో రామ్ చరణ్ రెమ్యూనరేషన్ కాకుండా మేకింగ్ కాస్ట్ 200 కోట్లు దాటుతోందని టాక్. ఇప్పటికే 80 రోజుల పాటు షూటింగ్ చేశారు. మరో 80 రోజుల వరకు షూటింగ్ చేయాల్సిన పార్ట్ ఉందట. అందువల్ల మేకింగ్ కాస్ట్ ఎక్కువ అవుతోందట. హీరో రెమ్యూనరేషన్ ఆల్మోస్ట్ 100 కోట్ల వరకు ఉంటుందని టాక్. మరి ఇంత బడ్జెట్ పెడుతున్న సినిమా ప్రీ రిలీజ్ బిజినెస్ ఎంత చేయాలి? ఎన్ని కోట్ల బిజినెస్ చేస్తే నిర్మాతకు రికవరీ అవుతుంది? అనేది చూస్తే...
ఆల్రెడీ బడ్జెట్‌లో సగం రికవరీ చేసిన 'పెద్ది'!
Peddi Audio Rights Price: 'పెద్ది' కోసం నిర్మాత ఖర్చు పెడుతున్న బడ్జెట్‌లో ఆల్రెడీ సగం వరకు రికవరీ అయినట్లు తెలిసింది. ఈ సినిమాకు ఆస్కార్ అవార్డు విన్నర్ ఏఆర్ రెహమాన్ సంగీతం అందిస్తున్నారు. అందువల్ల, ఆడియో రైట్స్ కోసం రూ. 20 కోట్లు ఇచ్చి మరీ తీసుకుంది టీ సిరీస్ సంస్థ.
Peddi OTT Deal Price: 'పెద్ది' డిజిటల్ స్ట్రీమింగ్ రైట్స్ నెట్‌ఫ్లిక్స్ తీసుకుంది. ఆ డీల్ వేల్యూ 130 కోట్ల రూపాయలు అని టాక్. థియేటర్లలో బంపర్ కలెక్షన్స్ వచ్చి సినిమా భారీ హిట్ సాధిస్తే ఆ విలువ మరో రూ. 20 కోట్లు పెరుగుతుందట. ఆడియో, ఓటీటీ రైట్స్ ద్వారా రూ. 150 కోట్లు వచ్చాయి. మరో 150 కోట్లు థియేట్రికల్ డిస్ట్రిబ్యూషన్ ద్వారా రావాల్సి ఉంది.
ఏపీ, తెలంగాణ... రెండు తెలుగు రాష్ట్రాలో థియేట్రికల్ బిజినెస్ వంద కోట్లకు పైగా జరుగుతుందని ఒక అంచనా. డిస్ట్రిబ్యూషన్ రైట్స్ మంచి రేటు పలుకుతాయి. హిందీ డబ్బింగ్, తెలుగు శాటిలైట్ వంటివి అమ్మడం వల్ల ఎన్ని కోట్లు వస్తాయనేది చూడాలి. అదీ సంగతి! ఎలా లేదన్నా మూవీ రిలీజ్ టైంకి ప్రీ రిలీజ్ బిజినెస్ టార్గెట్ రూ. 350 కోట్లు ఉంటుందని ట్రేడ్ టాక్. రామ్ చరణ్ పుట్టినరోజు సందర్భంగా వచ్చే ఏడాది మార్చి 27న సినిమాను విడుదల చేయనున్నట్లు అనౌన్స్ చేసిన సంగతి తెలిసిందే.
Also Read: అమెరికాలో 'ఓజీ'కి అన్యాయమా? పవన్ ఫ్యాన్స్ ఫైర్... క్లారిటీ ఇచ్చిన డిస్ట్రిబ్యూటర్!





















