Peddi First Single: 'పెద్ది' ఫస్ట్ సింగల్ రెడీ... త్వరలో రామ్ చరణ్ కోసం రెహమాన్ చేసిన సాంగ్ రిలీజ్
Peddi First Song: గ్లోబల్ స్టార్ రామ్ చరణ్ హీరోగా బుచ్చిబాబు సానా దర్శకత్వం వహిస్తున్న 'పెద్ది'కి ఆస్కార్ విన్నర్ ఏఆర్ రెహమాన్ సంగీతం అందిస్తున్న సంగతి తెలిసిందే. త్వరలో ఫస్ట్ సింగిల్ రిలీజ్ కానుంది.

గ్లోబల్ స్టార్ రామ్ చరణ్ (Ram Charan) కథానాయకుడిగా రూపొందుతున్న పాన్ ఇండియా స్పెక్టకిల్ ఫిల్మ్ 'పెద్ది' (Peddi Movie). బుచ్చిబాబు సానా దర్శకత్వంలో వృద్ధి సినిమాస్ పతాకం మీద వెంకట సతీష్ కిలారు (Venkata Satish Kilaru) భారీగా ఎత్తున ప్రతిషాత్మకంగా నిర్మిస్తున్నారు. ఈ చిత్రానికి మైత్రీ మూవీ మేకర్స్, సుకుమార్ రైటింగ్స్ సమర్పణ. రామ్ చరణ్ మేకోవర్,టైటిల్ గ్లింప్స్, ఫస్ట్ లుక్ ఫ్యాన్స్‌లో, ప్రేక్షకుల్లో అంచనాలు పెంచాయి. లేటెస్ట్ అప్డేట్ ఏమిటంటే...
విడుదలకు 'పెద్ది' ఫస్ట్ సాంగ్ రెడీ!
'పెద్ది' సినిమాకు ఆస్కార్ విన్నర్ ఏఆర్ రెహమాన్ సంగీతం అందిస్తున్న సంగతి తెలిసిందే. ఆయన ఎటువంటి ట్యూన్స్ ఇస్తారోనని ఫ్యాన్స్, ఆడియన్స్ ఎంతగానో ఎదురు చూస్తున్నారు. ఆల్రెడీ గ్లింప్స్‌కు ఇచ్చిన మ్యూజిక్ బావుంది. ఇప్పుడు యూనిట్ మరో ఇంట్రెస్టింగ్ న్యూస్ చెప్పింది. 'పెద్ది' ఫస్ట్ సింగిల్ రెడీ అయ్యిందని, త్వరలో విడుదల చేయబోతున్నామని తెలిపింది. రామ్ చరణ్, దర్శకుడు బుచ్చిబాబు సానా, ఏఆర్ రెహమాన్ స్టూడియోలో ఉన్న ఫోటోను షేర్ చేశారు.
'పెద్ది' కోసం రెహమాన్ బ్లాక్ బస్టర్ ఆల్బమ్ కంపోజ్ చేశారని చిత్ర బృందం చెబుతోంది. ప్రేక్షకులతో పాటు మెగా అభిమానులకు ఎప్పటికీ గుర్తుండిపోయే పాటలు రెడీ చేశారట.
Also Read: సొంత కుటుంబానికి దూరంగా ఎన్టీఆర్... కానీ అల్లు - కొణిదెల కుటుంబాలు కలిశాయ్!
View this post on Instagram
Peddi Movie Cast: రామ్ చరణ్ సరసన 'పెద్ది' సినిమాలో జాన్వి కపూర్ హీరోయిన్‌గా నటిస్తుండగా... కన్నడ సూపర్ స్టార్ శివరాజ్ కుమార్ కథలో కీలకమైన పవర్ ఫుల్ రోల్ చేస్తున్నారు. ఇంకా జగపతి బాబు, దివ్యేందు శర్మ కీలక పాత్రల్లో యాక్ట్ చేస్తున్నారు. ఈ చిత్రానికి ఛాయాగ్రహణం: రత్నవేలు, కూర్పు: నేషనల్ అవార్డ్ విన్నర్ నవీన్ నూలి, ప్రొడక్షన్ డిజైన్: అవినాష్ కొల్లా.



















