Su From So OTT: థియేటర్లలో నవ్వించిన కన్నడ హారర్ కామెడీ... ఈ వారమే ఓటీటీలోకి 'సు ఫ్రమ్ సో' - స్ట్రీమింగ్ ఎందులో అంటే?
Su From So OTT Telugu Release Date: కన్నడతో పాటు తెలుగు ప్రేక్షకులను సైతం థియేటర్లలో నవ్వించిన హారర్ కామెడీ 'సు ఫ్రమ్ సో'. ఇప్పుడీ సినిమా ఈ వారం ఓటీటీలో సందడికి సిద్ధమైంది.

Su From So OTT Platform Telugu: కన్నడ సినిమాలకు తెలుగులో ఆదరణ పెరిగింది. 'కేజీఎఫ్', 'కాంతార' విజయాల తర్వాత కన్నడ సినిమాలను తెలుగులో డబ్బింగ్ చేయడం పెరిగింది. ఆ కోవలో వచ్చిన హారర్ కామెడీ 'సు ఫ్రమ్ సో'. కన్నడతో పాటు తెలుగు ప్రేక్షకులను సైతం నవ్వించింది. ఇప్పుడీ సినిమా ఓటీటీలో విడుదలకు సిద్ధమైంది.
సెప్టెంబర్ 5 నుంచి ఓటీటీలోకి 'సు ఫ్రమ్ సో'
Su From So Telugu OTT Release Date: 'సు ఫ్రమ్ సో' సినిమా కన్నడలో జూలై 25న విడుదలైంది. తెలుగు రాష్ట్రాల్లో ఆగస్టు 8న తెలుగు డబ్బింగ్ వెర్షన్ విడుదల చేశారు. కన్నడతో పాటు తెలుగులోనూ బ్లాక్ బస్టర్ హిట్ అయ్యింది. ఈ సినిమాను సెప్టెంబర్ 5వ తేదీ నుంచి స్ట్రీమింగ్ చేయడానికి జియో హాట్ స్టార్ ఓటీటీ రెడీ అయ్యింది.
కన్నడ, తెలుగుతో పాటు తమిళ్, మలయాళం, హిందీ భాషల్లో సెప్టెంబర్ 5 నుంచి 'సు ఫ్రమ్ సో' జియో హాట్ స్టార్ ఓటీటీలో స్ట్రీమింగ్ కానుంది.
రాజ్ బి శెట్టి నటించిన బ్లాక్ బస్టర్ 'సు ఫ్రమ్ సో'
రూరల్ హారర్ కామెడీగా తెరకెక్కిన 'సు ఫ్రమ్ సో' సినిమాకు జెపీ తుమినాడ్ దర్శకత్వం వహించారు. గ్రామీణ నేపథ్యంలో జానపద కథలు, ప్రజల మూఢ నమ్మకాలు మేళవించి హిలేరియస్ కామెడీతో సినిమా రూపొందించారు. 'సు ఫ్రమ్ సో' కథ అంతా ఓ పల్లెటూర్లో జరుగుతుంది. సోమేశ్వర నుంచి వచ్చిన సులోచన కారణంగా ఆ ఊరు మొత్తం గందరగోళ పరిస్థితిలో చిక్కుకుంటుంది. ఆ తర్వాత ఏమైంది? అనేది సినిమా.
Also Read: సొంత కుటుంబానికి దూరంగా ఎన్టీఆర్... కానీ అల్లు - కొణిదెల కుటుంబాలు కలిశాయ్!
'సు ఫ్రమ్ సో' సినిమాలో శనీల్ గౌతమ్, సంధ్య ఆరకెరె, జెపీ తుమినాడ్, ప్రకాశ్ తుమినాడ్, రాజ్ బి శెట్టి (సహ నిర్మాత) ప్రధాన పాత్రల్లో నటించారు. సందీప్ తులసిదాస్ సంగీతం అందించారు. ఓటీటీ రిలీజ్ కోసం వెయిట్ చేసే ఆడియన్స్ కోసం జియో హాట్ స్టార్ మంచి న్యూస్ చెప్పింది.
Also Read: మదర్ రోల్స్ వైపు షిఫ్ట్ అవుతున్న శ్రియ... అప్పుడు 'దృశ్యం', 'ఆర్ఆర్ఆర్' - ఇప్పుడు 'మిరాయ్'





















