By: Satya Pulagam | Updated at : 27 May 2023 03:35 PM (IST)
రామ్ చరణ్, నిఖిల్ సిద్ధార్థ్
గ్లోబల్ స్టార్ రామ్ చరణ్ (Ram Charan) కొత్త సినిమాకు సంబంధించిన ప్రకటన ఆదివారం ఉదయం రానుంది. అయితే, ఇక్కడ ఓ ట్విస్ట్ ఉంది! అది ఏమిటంటే... ఆ సినిమాలో ఆయన హీరో కాదు. నిర్మాణ భాగస్వామి మాత్రమే! తన మిత్రుడు, యువి క్రియేషన్స్ సంస్థలో కీలక భాగస్వామి విక్రమ్ రెడ్డితో కలిసి 'వి మెగా పిక్చర్స్' సంస్థను స్టార్ట్ చేశారు. ప్రతిభావంతులను ప్రోత్సహించడమే లక్ష్యంగా చిత్రాలు నిర్మిస్తామని రామ్ చరణ్, విక్రమ్ రెడ్డి తెలిపారు. వాళ్ళ సంస్థలో సినిమా ప్రకటనే రేపు రానుంది.
రామ్ చరణ్ నిర్మాణంలో నిఖిల్ హీరోగా...
వి మెగా పిక్చర్స్ సంస్థ నిర్మించే తొలి సినిమాలో నిఖిల్ సిద్ధార్థ్ (Nikhil Siddharth) కథానాయకుడిగా నటించనున్నారు. ఆయనతో 'కార్తికేయ 2' వంటి పాన్ ఇండియా సక్సెస్ ఫుల్ ఫిల్మ్ నిర్మించిన అభిషేక్ అగర్వాల్ ఆర్ట్స్ సంస్థ సైతం ఈ సినిమా నిర్మాణంలో భాగస్వామి. పాన్ ఇండియా సినిమాగా దీనిని తెరకెక్కించనున్నారు.
వి మెగా పిక్చర్స్, అభిషేక్ అగర్వాల్ ఆర్ట్స్ సంస్థలు సంయుక్తంగా ఓ సినిమా నిర్మిస్తున్నట్లు ఈ రోజు అనౌన్స్ చేశాయి. అయితే, అందులో హీరో ఎవరు అనేది రివీల్ చేయలేదు. 'Revolution Is Brewing' అని హ్యాష్ ట్యాగ్ ఇచ్చారు. 'విప్లవం పురుడు పోసుకుంటోంది' అని అర్థం వచ్చేలా ఆ క్యాప్షన్ ఇచ్చారు.
Delighted to join hands with the successful @AAArtsOfficial ❤️🔥
No better way to start our journey ❤️
The start of backing young talent to give great cinema.
Big announcement tomorrow at 11.11 AM.#RevolutionIsBrewing
Stay tuned 💥@AlwaysRamCharan @AbhishekOfficl pic.twitter.com/HtVJxjpoDD— V Mega Pictures (@VMegaPictures_) May 27, 2023
'కార్తికేయ 2' సినిమాతో ఉత్తరాది ప్రేక్షకుల్లో నిఖిల్ సిద్దార్థ్ మంచి పేరు అయితే సంపాదించారు. వసూళ్ల పరంగానూ ఆ సినిమా నిర్మాతకు విపరీతమైన లాభాలు అందించింది. త్వరలో 'స్పై' సినిమాతోనూ ఉత్తరాది ప్రేక్షకులను మరోసారి నిఖిల్ పలకరించనున్నారు. ఇక నుంచి నిఖిల్ చేయబోయే సినిమాలు అన్నీ పాన్ ఇండియా టార్గెట్ చేస్తూ ఉంటాయని తెలిసింది.
ఉత్తరాదిలో రామ్ చరణ్ క్రేజ్ తెలుసుగా!
నిఖిల్ సిద్ధార్థ్ సంగతి పక్కన పెడితే... ఉత్తరాదిలో రామ్ చరణ్ ఫాలోయింగ్ ఎలా ఉందో ప్రత్యేకంగా వివరించాల్సిన అవసరం లేదు. 'ఆర్ఆర్ఆర్ : రౌద్రం రణం రుధిరం' సినిమాలో పతాక సన్నివేశాల్లో అల్లూరి సీతారామరాజు వేషధారణలో ఆయన నటన అక్కడి ప్రేక్షకులను అమితంగా ఆకట్టుకుంది. కొందరు అయితే ఆయన్ను శ్రీరాముడు అనుకున్నారు. రామ్ చరణ్ నిర్మాణంలో నిఖిల్ హీరోగా సినిమా అంటే ఉత్తరాదిలో కూడా మంచి క్రేజ్ ఉంటుంది.
Also Read : 'భోళా శంకర్' ప్రీ రిలీజ్ ఈవెంట్‌కు 'ఇంద్ర' సెంటిమెంట్!?
రామ్ చరణ్ సినిమాలకు వస్తే... ప్రస్తుతం రామ్ చరణ్ చేస్తున్న సినిమాలకు వస్తే... సమాజానికి పనికి వచ్చే చక్కటి సందేశంతో పాటు వాణిజ్య హంగులు మేళవించి భారీ చిత్రాలు తెరకెక్కించే స్టార్ దర్శకుడు శంకర్ తో కలిసి 'గేమ్ చేంజర్' సినిమా చేస్తున్నారు. అది పాన్ ఇండియా రిలీజ్ కానుంది. ఆ తర్వాత సుకుమార్ శిష్యుడు, 'ఉప్పెన' ఫేమ్ బుచ్చి బాబు సానా దర్శకత్వంలో మరో పాన్ ఇండియా సినిమా చేస్తారు. 'విక్రమ్' ఫేమ్ లోకేష్ కనగరాజ్, 'కెజిఎఫ్' & 'సలార్' ఫేమ్ ప్రశాంత్ నీల్ దర్శకత్వంలో సినిమాలు చర్చల దశలో ఉన్నాయి.
Also Read : ఎన్టీఆర్ కెరీర్ మలుపు తిప్పిన సినిమాలు - తెలుగులో కొత్త ట్రెండ్ సెట్ చేశాయ్!
Akhil Akkineni : తమిళ దర్శకుడితో అఖిల్ అక్కినేని సినిమా?
iPhone 15: 10 నిమిషాల్లో ఐఫోన్ 15 డెలివరీ - ఎక్కడ అందుబాటులో ఉంది? ఎందులో ఆర్డర్ చేయాలి?
Papam Pasivadu Trailer : సింగర్ శ్రీరామచంద్ర హీరోగా 'పాపం పసివాడు' - ట్రైలర్ ఎలా ఉందో చూశారా?
Ram - Virat Kohli Biopic : విరాట్ కోహ్లీ బయోపిక్‌లో రామ్ పోతినేని - హీరో ఏమన్నారో తెలుసా?
Geethanjali Malli Vachindhi: పదేళ్ల తర్వాత 'గీతాంజలి మళ్ళీ వచ్చింది' - హైదరాబాద్‌లో అంజలి, కోన వెంకట్ సినిమా షురూ
TDP News : కర్నూలు టీడీపీలో కీలక మార్పులు - బైరెడ్డి చేరిక ఖాయమయిందా ?
Mindspace Buildings Demolition: మాదాపూర్ మైండ్ స్పేస్ లో 2 భవనాలు క్షణాల్లో నేలమట్టం
Modi Tour : 30వ తేదీనే తెలంగాణకు ప్రధాని మోదీ - టూర్ షెడ్యూల్‌లో మార్పులు!
Lokesh : నిరసనలు చేస్తే హత్యాయత్నం కేసులా ? - జగన్ సర్కార్‌పై లోకేష్ తీవ్ర విమర్శలు !
/body>