
Bholaa Shankar Pre Release : 'భోళా శంకర్' ప్రీ రిలీజ్ ఈవెంట్‌కు 'ఇంద్ర' సెంటిమెంట్!?
మెగాస్టార్ చిరంజీవి కథానాయకుడిగా రూపొందుతోన్న లేటెస్ట్ సినిమా 'భోళా శంకర్'. ఆగస్టు 11న సినిమా విడుదల కానుంది. అంతకు ముందు భారీ ప్రీ రిలీజ్ ఈవెంట్ ప్లాన్ చేస్తున్నారని తెలిసింది.

మెగాస్టార్ చిరంజీవి (Megastar Chiranjeevi)కి విజయవాడతో మంచి అనుబంధం ఉంది. ఆ నగరంలో ఆయనకు మధుర జ్ఞాపకాలు ఉన్నాయి. చిరు సూపర్ డూపర్ హిట్ సినిమాల్లో ఒకటైన 'ఇంద్ర' విజయోత్సవ సభ (175 రోజుల వేడుక) ప్రస్తుతం ఏపీలో ఉన్న విజయవాడలో జరిగింది. మరో సినిమా వేడుకను ఆ నగరంలో ప్లాన్ చేస్తున్నారని తెలిసింది.
ఏపీలో 'భోళా శంకర్' ప్రీ రిలీజ్ వేడుక!?
చిరంజీవి కథానాయకుడిగా దర్శకుడు మెహర్ రమేష్ తెరకెక్కిస్తున్న తాజా సినిమా 'భోళా శంకర్'. ఆగస్టు 11న ప్రపంచ వ్యాప్తంగా విడుదల కానుంది. అంత కంటే ముందు అభిమానుల సమక్షంలో భారీ ఎత్తున ప్రీ రిలీజ్ వేడుక నిర్వహించడానికి ఏర్పాట్లు చేస్తున్నారు.
విజయవాడలో 'భోళా శంకర్' ప్రీ రిలీజ్ ఈవెంట్ చేయాలని నిర్ణయించినట్టు ఫిల్మ్ నగర్ వర్గాల ద్వారా తెలిసింది. 'భోళా శంకర్' నిర్మాత, ఏకే ఎంటర్టైన్మెంట్స్ అధినేత అనిల్ సుంకరకు సైతం విజయవాడ అంటే సెంటిమెంట్! ఆయన ఓ నిర్మాతగా చేసిన మహేష్ బాబు 'దూకుడు' సక్సెస్ మీట్ కూడా ఆ సిటీలో నిర్వహించారు. అదీ సంగతి! ఇటీవల 'భోళా శంకర్' టీమ్ స్విట్జర్లాండ్ నుంచి తిరిగొచ్చింది.
స్విస్ కొండల్లో రొమాంటిక్ డ్యూయెట్!
'భోళా శంకర్'లో చిరంజీవి జోడిగా మిల్కీ బ్యూటీ తమన్నా భాటియా (Tamannaah) నటిస్తున్నారు. స్విట్జర్లాండ్ మంచు కొండల్లో హీరో హీరోయిన్లపై రొమాంటిక్ డ్యూయెట్ ఒకటి తెరకెక్కించారు. ఆ సాంగ్ షూటింగ్ కంప్లీట్ అయ్యింది.
స్విట్జర్లాండ్ (Switzerland)లో 'భోళా శంకర్' సాంగ్ షూటింగ్ కంప్లీట్ కావడంతో తమ యూనిట్ ఇండియా రిటర్న్ అయ్యిందని మెహర్ రమేష్ పేర్కొన్నారు. పాట చాలా అందంగా వచ్చిందని ఆయన తెలిపారు. అదే సమయంలో అక్కడ చిత్రీకరణ చేయడం చాలా కష్టమని ఆయన చెప్పుకొచ్చారు. యువ సంగీత దర్శకుడు సాగర్ మహతి అందించిన బాణీకి శేఖర్ మాస్టర్ అద్భుతమైన కొరియోగ్రఫీ చేయగా... సినిమాటోగ్రాఫర్ డడ్లీ అందంగా తెరకెక్కించారని మెహర్ రమేష్ ట్వీట్ చేశారు.
Also Read : శత జయంతి ఒక్కసారే వస్తుందని, పుట్టిన రోజులు మళ్ళీ వస్తాయని రిక్వెస్ట్ చేసినా రాలేదు - టీడీ జనార్థన్
ప్రముఖ నిర్మాత కె.ఎస్. రామారావుకు చెందిన క్రియేటివ్ కమర్షియల్స్‌తో కలిసి అనిల్ సుంకర ఎకె ఎంటర్‌టైన్‌మెంట్స్ సంస్థ నిర్మిస్తున్న చిత్రమిది. ఇందులో చిరంజీవి సోదరిగా కీర్తీ సురేష్ నటిస్తున్నారు. ఏయన్నార్ మనవడు, నాగార్జున మేనల్లుడు, యువ హీరో సుశాంత్ కూడా సినిమాలో ఉన్నారు. ఆయన కీర్తీ సురేష్ జంటగా నటిస్తున్నట్లు సమాచారం. అయితే, ఆ విషయాన్ని అధికారికంగా అనౌన్స్ చేయలేదు.
Also Read : ఎన్టీఆర్‌తో ఎక్కువ సినిమాలు చేసిన దర్శకుడు ఎవరో తెలుసా?
రఘు బాబు, మురళీ శర్మ, రవి శంకర్, 'వెన్నెల' కిశోర్, తులసి, సురేఖా వాణి, శ్రీ ముఖి, 'హైపర్' ఆది, 'వైవా' హర్ష, రష్మీ గౌతమ్, ప్రదీప్, బిత్తిరి సత్తి, సత్య, 'గెటప్' శ్రీను, వేణు టిల్లు (బలగం దర్శకుడు వేణు ఎల్దండి), 'తాగుబోతు' రమేష్, ఉత్తేజ్, తరుణ్ అరోరా తదితరులు నటిస్తున్న ఈ చిత్రానికి కూర్పు : మార్తాండ్ కె వెంకటేష్, కథా పర్యవేక్షణ : సత్యానంద్, మాటలు : తిరుపతి మామిడాల, ఫైట్ మాస్టర్స్ : రామ్ - లక్ష్మణ్ & దిలీప్ సుబ్బరాయన్ & కాచే కంపాక్డీ, పాటలు : రామజోగయ్య శాస్త్రి, కాసర్ల శ్యామ్, శ్రీమణి, సిరాశ్రీ, ఎగ్జిక్యూటివ్ నిర్మాత : కిషోర్ గరికిపాటి, ఛాయాగ్రహణం : డడ్లీ, సంగీతం : మహతి స్వర సాగర్, నిర్మాణ సంస్థ : ఎకె ఎంటర్‌టైన్‌మెంట్స్, నిర్మాత : రామ బ్రహ్మం సుంకర, కథనం, దర్శకత్వం : మెహర్ రమేష్.
టాప్ హెడ్ లైన్స్
ట్రెండింగ్ వార్తలు

