By: ABP Desam | Updated at : 23 May 2023 11:55 AM (IST)
రామ్ చరణ్ (Image Credits: Ram Charan/Twitter)
Ram Charan : ఎస్ఎస్ రాజమౌళి రూపొందించిన 'ఆర్ఆర్ఆర్' (RRR) తో అంతర్జాతీయ స్థాయిలో పేరు, ప్రఖ్యాతలు, ప్రశంసలు అందుకున్న మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ (Ram Charan).. మరో సారి భారతదేశానికి గర్వ కారణంగా నిలిచారు. కాశ్మీర్ లో జరిగిన జీ 20 సమ్మిట్ లో పాల్గొన్న ఆయన.. తన హాలీవుడ్ అరంగేట్రంపై హింట్ ఇచ్చారు. భారతీయ సినిమా గురించి, దర్శకులు చెప్పే పాతుకుపోయిన కథల గురించి గొప్పగా మాట్లాడిన రామ్ చరణ్.. కొన్ని నెలల క్రితం నుంచి హాలీవుడ్ దర్శకులు, నిర్మాతలతో చర్చలు జరుపుతున్నట్లు వెల్లడించాడు. అయితే, అతని తొలి హాలీవుడ్ ప్రాజెక్ట్ గురించి మాత్రం ఎలాంటి వివరాలు ఇంకా బయటకు రాలేదు.
ఈ కార్యక్రమంలో రామ్ చరణ్ మాట్లాడుతూ, తన హాలీవుడ్ అరంగేట్రానికి సంబంధించిన సూచనను క్యాజువల్‌గా చేప్పేశారు. “ప్రస్తుతం తాను భారతదేశాన్ని ఎక్కువగా అన్వేషించులనుకుంటున్నట్లు తెలుపుతూ.. హాలీవుడ్ దర్శకులు, నిర్మాతలతో తప్ప తన తదుపరి సినిమాల కోసం ఎక్కడికి ప్రయాణించాలనుకోవట్లేద”ని రామ్ చరణ్ చెప్పుకొచ్చారు. “ఇండియాలోని అందమైన షూటింగ్ లొకేషన్స్ ని నేను ప్రపంచానికి చూపించాలని అనుకుంటున్నాను అని ఆయన అన్నారు. తాను సంస్కృతికి కట్టుబడి ఉండాలనుకుంటున్నానని, భారతీయుల్ని ఇంకా ఎడ్యుకేట్ చేయాలనుకుంటున్నానని ఆయన ఈ సందర్భంగా వెల్లడించారు. దీన్ని బట్టి చూస్తే ఆయన లైనప్ లో ఓ హాలీవుడ్ ప్రాజెక్టుకు ఓకే చేసినట్టు తెలుస్తోంది. దీంతో మెగా ఫ్యాన్స్ ఆనందం వ్యక్తం చేస్తున్నారు.
• @AlwaysRamCharan Hinted the Sneak in of Hollywood Project in his Lined up Movies. If Everything Falls in Place 💥💥💥🤞#G20Summit #RamCharanForG20Summit pic.twitter.com/WPvxfAy8Fi
— Trends RamCharan™ (@TweetRamCharan) May 22, 2023
‘నేను1986 నుంచి కాశ్మీర్‌కు వస్తున్నాను, మా నాన్న సినిమాల షూటింగ్స్ కూడా ఎక్కువగా గుల్‌మార్గ్, సోనామార్గ్‌లలో జరిగాయి. నేను కూడా 2016లో ఇక్కడ షూట్ చేశాను. ఈ ప్రదేశంలో ఏదో అద్భుతం ఉంది. కశ్మీర్ అందరి దృష్టిని ఆకర్షిస్తుందని’ రామ్ చరణ్ చెప్పారు. “మా నాన్న గారికి 68 ఏళ్ల ఆయినా ప్రస్తుతం నాలుగు సినిమాలు చేస్తూ ఇంకా బిజీగా ఉన్నారు. అంతేకాదు ఇండస్ట్రీలో ఎక్కువ పారితోషకం తీసుకునే యాక్టర్స్ లో ఆయన ఒకరు. ఇక ఇంతటి ఫేమ్ సంపాదించుకున్నా.. ఇప్పటికి ఇంకా ఉదయం 5:30 గంటలకు నిద్ర లేచి వర్కవుట్స్ చేస్తూనే ఉంటారు. ఈ వయసులోనూ ఆయన సినిమాపై, చేసే పనిపై చూపించే డెడికేషన్.. మాకు ఎంతో స్ఫూర్తిని కలగజేస్తుంది” అంటూ ఆయన చెప్పుకొచ్చారు.
Also Read : లారెన్స్ బిష్ణోయ్ హిట్ లిస్ట్‌లో నెంబర్ వన్ సల్మాన్ ఖాన్, సిద్ధూ మూసే వాలా మేనేజర్ కూడా..
ఇదిలా ఉండగా 'ఆర్ఆర్ఆర్'తో రామ్ చరణ్ గ్లోబల్ వైడ్ పాపులారిటీని సంపాదించుకున్న విషయం తెలిసిందే. దీంతో హాలీవుడ్ మేకర్స్ కూడా చరణ్ తో సినిమా తీసేందుకు ఆసక్తి చూపిస్తున్నారు. ఇప్పటికే పలు హాలీవుడ్ మేకర్స్ తో కూడా చర్చలు జరిగాయని, త్వరలోనే హాలీవుడ్ సినిమా ఉండబోతుందని రామ్ చరణ్ గతంలోనే ఓ ఇంటర్వ్యూలో చెప్పుకొచ్చారు.
రామ్ చరణ్ చివరిసారిగా సల్మాన్ ఖాన్ 'కిసీ కా భాయ్ కిసీ కి జాన్' లో అతిథి పాత్రలో కనిపించారు. ప్రస్తుతం దర్శకుడు శంకర్‌తో రూపొందిస్తోన్న భారీ బడ్జెట్ చిత్రం 'గేమ్ ఛేంజర్' షూటింగ్‌లో బిజీగా ఉన్నారు. ఈ సినిమా ఈ ఏడాది చివర్లో లేదా 2024 ప్రారంభంలో థియేటర్లలోకి వచ్చే అవకాశం ఉంది. 'గేమ్ ఛేంజర్' తర్వాత, దర్శకుడు బుచ్చి బాబు సనాతో మూవీలో కనిపించనున్నారు. దీనిపై అధికారిక ప్రకటన రావాల్సి ఉంది.
Read Also : Ajith: బైక్ రైడర్స్, అడ్వెంచర్స్‌కు హీరో అజీత్ గుడ్ న్యూస్ - ఇక ఆయన కంపెనీ నుంచే టూర్స్!
రాష్ట్రపతి ద్రౌపతి ముర్మును కలిసిన సమంత, ‘సిటాడెల్’ టీమ్ - ఇండియాలో కాదు
హీరో విజయ్ కీలక నిర్ణయం - ఆ విద్యార్థులకు సాయం
Ranbir Kapoor: రణబీర్ కపూర్ మంచి మనసు - వారికి 'ఆదిపురుష్' టికెట్లు ఫ్రీ!
Leo Movie: విజయ్ ‘లియో’లో కమల్ హాసన్ - లోకేష్ కనగరాజ్ కొత్త ప్లాన్?
అభిమానుల చేతుల మీదుగా 'భగవంత్ కేసరి' టీజర్ - ఎన్ని థియేటర్లలో తెలుసా?
Sharwanand: సీఎం కేసీఆర్‌ను కలిసిన శర్వానంద్ - వెడ్డింగ్ రిసెప్షన్‌కు ఆహ్వానం
Ambati Rayudu : జగన్ ను కలిసిన అంబటి రాయుడు - వైసీపీలో చేరికకు ముహుర్తం ఖరారైనట్లేనా ?
CM Jagan Review: ప్రతి మండలానికి 2 జూనియర్ కాలేజీలు ఉండాల్సిందే - అధికారులకు సీఎం జగన్ ఆదేశాలు
Durgam Chinnaiah: బీఆర్ఎస్ ఎమ్మెల్యే దుర్గం చిన్నయ్యకు షాక్! మహిళా కమిషన్ కీలక ఆదేశం