అన్వేషించండి

Ram Charan: 'మోడ్రన్‌ మాస్టర్స్‌'.. డైరెక్టర్‌ రాజమౌళి డాక్యుమెంటరిపై రామ్ చరణ్‌ ఆసక్తికర కామెంట్స్‌

SS Rajamouli-Ram Charan: దర్శక ధీరుడు రాజమౌళిసై నెటిఫ్లిక్స్‌ డాక్యుమెంటరీ తెరకెక్కించిన సంగతి తెలిసిందే. మోడ్రన్ మాస్టర్స్ పేరుతో ఈ డాక్యుమెంటరిని ఇటీవల ఓటీటీలో రిలీజ్‌ చేసింది. 

Ram Charan About SS Rajamouli Documentary: దర్శక ధీరుడు ఎస్‌ఎస్‌ రాజమౌళిపై ప్రముఖ ఓటీటీ సంస్థ నెట్‌ఫ్లిక్స్‌ డాక్యూమెంటరిని రూపొందించిన సంగతి తెలిసిందే. 'మోడ్రన్‌ మాస్టర్స్‌' పేరుతో ఈ డాక్యుమెంటరిని తెరకెక్కించారు. ఇటీవల ఈ డాక్యూమెంటరిని ఓటీటీలో పలు భాషల్లో అందుబాటులోకి తీసుకువచ్చింది నెట్‌ఫ్లిక్స్‌. తెలుగు, హిందీ, ఇంగ్లీష్‌, తమిళ్, మలయాళంలో ఈ డాక్యూమెంటరి అందుబాటులోకి వచ్చింది. ఇందులో రాజమౌళి తన సినీ జర్నీతో పాటు తన వ్యక్తిగత విషయాలను కూడా పంచుకున్నారు. ఈ డాక్యూమెంటరి మంచి ఆదరణ కూడా దక్కుతోంది.

ఇప్పటికే ఈ డాక్యుమెంటరిపై పలువురు సినీ ప్రముఖులు వారి అభిప్రాయాలు తెలుపుతూ పోస్ట్స్‌ పెట్టారు. తాజాగా గ్లోబల్ స్టార్‌ రామ్‌ చరణ్‌ ఈ డాక్యుమెంటరిపై పోస్ట్‌ పెట్టారు.  "రాజమౌళి గారికి సినిమాల పట్ల అలాగే ఆయన క్రాఫ్ట్‌ వర్క్‌ పట్ల ఉండే అంకితాభావం ఎంతోమందికి స్ఫూర్తిగా ఉంది. ఈ 'మోడ్రన్ మాస్టర్స్‌' డాక్యుమెంటరి ఆయన అద్బుతమైన సినీ ప్రయాణానికి మనం ఇచ్చే సరైన  గౌరవం" అంటూ తన ఇన్‌స్టాగ్రామ్‌ వేదిక పోస్ట్‌ చేశాడు. ప్రస్తుతం చరణ్‌ పోస్ట్‌ వైరల్‌ అవుతుంది. అయితే కాస్తా ఆలస్యంగా ఆయన ఈ డాక్యుమెంటరిపై స్పందించడం గమనార్హం. 

ఇదిలా ఉంటే ఈ డాక్యుమెంటరి రాజమౌళితో పనిచేసిన వారంతా తమ అనుభవాన్ని పంచుకున్నారు. ఇందులో రామ్‌ చరణ్‌ కూడా రాజమౌళి గురించి చెప్పుకొచ్చారు.  జక్కన్న దర్శకత్వంలో తను నటించిన మగధీర, ఆర్‌ఆర్‌ఆర్‌ మూవీ అనుభవాలు, పని పట్ల ఆయన చూపించే శ్రద్ధా.. మూవీ పర్ఫెక్ట్‌ అవుట్‌ పుట్‌ ఆయన పెట్టే ఎఫర్ట్స్‌ అన్నింటిని షేర్ చేసుకున్నారు. అలాగే జూనియర్‌ ఎన్టీఆర్‌, ప్రభాస్‌లు కూడా ఆయనతో వర్క్‌ చేసిన అనుభవాన్ని, సినిమా పట్ల ఆయన చూపించే ప్రేమ, అంకితభావం గురించి చెప్పుకొచ్చారు. అలాగే ఆయన ఫ్యామిలీ మెంబర్స్‌ కూడా జక్కన్న గురించి పర్సనల్‌ విషయాలను పంచుకున్నారు. అలాగే హాలీవుడ్‌ దర్శకులు సైతం జక్కన్నపై చేసిన కామెంట్స్‌ని ఈ డాక్యుమెంటరిలో చూపించారు. 

 
 
 
 
 
View this post on Instagram
 
 
 
 
 
 
 
 
 
 
 

A post shared by Ram Charan (@alwaysramcharan)

కాగా రాఘవ్‌ కన్నా దర్శకత్వంలో రూపొందిన ఈ డాక్యుమెంటరిని నెట్‌ఫ్లిక్స్ ఆగష్టు 2 నుంచి అందుబాటులోకి తీసుకువచ్చింది. పలువురు హాలీవుడ్‌ దర్శకులు, సినీ ప్రముఖులు, హీరోలు ఆయనతో ఉన్న అనుబంధాన్ని పంచుకున్నారు. ఇదిలా ఉంటే ప్రస్తుతం జక్కన్న సూపర్ స్టార్‌ మహేష్‌ బాబుతో  తీయబోయే SSMB29 మూవీతో బిజీగా ఉన్నాడు. ప్రస్తుతం ఈ చిత్రం ప్రీ ప్రొడక్షన్‌ వర్క్‌ జరుపుకోబోతోంది. ఈ సినిమా కోసం మహేష్‌ పూర్తిగా మేకోవర్‌ అయ్యాడు. విదేశాల్లో ప్రత్యేకంగా శిక్షణ తీసుకోవడమే కాదు.. హెయిర్ స్టైల్‌ని కూడా మార్చేశాడు. పాన్‌ వరల్డ్ రూపొందబోతున్న ఈ సినిమాను ఎక్కువగా ఆఫ్రికన్‌, అమెరికా అడవుల్లో తెరకెక్కించబోతున్న ఇదోక యాక్షన్‌ అడ్వంచర్‌ చిత్రమని, మహేష్‌ రోల్‌ జేమ్స్‌ బాండ్‌ తరహా ఉండబోతుందంటూ ఇప్పటికే స్టోరీ లైన్‌పై లీక్‌ ఇచ్చేశాడు జక్కన్న. 

Also Read: వారిని మిస్ అవుతాను - 'దేవర' నుంచి అదిరిపోయే అప్‌డేట్‌ ఇచ్చిన ఎన్టీఆర్‌

మరిన్ని చూడండి
Advertisement

టాప్ హెడ్ లైన్స్

Jany Master Arrest: జానీ మాస్టర్ అరెస్టుపై పోలీసులు కీలక ప్రకటన
Jany Master Arrest: జానీ మాస్టర్ అరెస్టుపై పోలీసులు కీలక ప్రకటన
Andhra Flood Relief: ఏపీలో వరద నష్టం - గౌతమ్ ఆదానీ భారీ విరాళం, ఎంతంటే?
ఏపీలో వరద నష్టం - గౌతమ్ ఆదానీ భారీ విరాళం, ఎంతంటే?
Harish Rao: 'సీఎం రేవంత్ రెడ్డిపై క్రమశిక్షణ చర్యలు తీసుకోండి' - ఏఐసీసీ చీఫ్‌ ఖర్గేకు మాజీ మంత్రి హరీష్ రావు బహిరంగ లేఖ
'సీఎం రేవంత్ రెడ్డిపై క్రమశిక్షణ చర్యలు తీసుకోండి' - ఏఐసీసీ చీఫ్‌ ఖర్గేకు మాజీ మంత్రి హరీష్ రావు బహిరంగ లేఖ
Kashmir Elections : కశ్మీర్ ఎన్నికల్లో కాంగ్రెస్‌కు సపోర్టుగా పాకిస్థాన్ మంత్రి - బీజేపీకి ఇంత కంటే ఆయుధం దొరుకుతుందా ?
కశ్మీర్ ఎన్నికల్లో కాంగ్రెస్‌కు సపోర్టుగా పాకిస్థాన్ మంత్రి - బీజేపీకి ఇంత కంటే ఆయుధం దొరుకుతుందా ?
Advertisement
Advertisement
Advertisement
ABP Premium

వీడియోలు

హైదరాబాద్ దాటిన హైడ్రా బుల్‌డోజర్లు, ఇకపై రాష్ట్రవ్యాప్తంగా కూల్చివేతలులెబనాన్‌లో పేజర్ పేలుళ్ల కలవరం, ఇజ్రాయేల్‌పై ఆరోపణలుభారత్, బంగ్లాదేశ్‌ల మధ్య తొలి టెస్టు నేడే‘కూలీ’లో నాగార్జున సైమన్ లుక్ లీక్

ఫోటో గ్యాలరీ

వ్యక్తిగత కార్నర్

అగ్ర కథనాలు
టాప్ రీల్స్
Jany Master Arrest: జానీ మాస్టర్ అరెస్టుపై పోలీసులు కీలక ప్రకటన
Jany Master Arrest: జానీ మాస్టర్ అరెస్టుపై పోలీసులు కీలక ప్రకటన
Andhra Flood Relief: ఏపీలో వరద నష్టం - గౌతమ్ ఆదానీ భారీ విరాళం, ఎంతంటే?
ఏపీలో వరద నష్టం - గౌతమ్ ఆదానీ భారీ విరాళం, ఎంతంటే?
Harish Rao: 'సీఎం రేవంత్ రెడ్డిపై క్రమశిక్షణ చర్యలు తీసుకోండి' - ఏఐసీసీ చీఫ్‌ ఖర్గేకు మాజీ మంత్రి హరీష్ రావు బహిరంగ లేఖ
'సీఎం రేవంత్ రెడ్డిపై క్రమశిక్షణ చర్యలు తీసుకోండి' - ఏఐసీసీ చీఫ్‌ ఖర్గేకు మాజీ మంత్రి హరీష్ రావు బహిరంగ లేఖ
Kashmir Elections : కశ్మీర్ ఎన్నికల్లో కాంగ్రెస్‌కు సపోర్టుగా పాకిస్థాన్ మంత్రి - బీజేపీకి ఇంత కంటే ఆయుధం దొరుకుతుందా ?
కశ్మీర్ ఎన్నికల్లో కాంగ్రెస్‌కు సపోర్టుగా పాకిస్థాన్ మంత్రి - బీజేపీకి ఇంత కంటే ఆయుధం దొరుకుతుందా ?
Naga Babu-Jani Master: నాగబాబు వరుస ట్వీట్స్‌ - జానీ మాస్టర్‌ను ఉద్దేశించేనా?
నాగబాబు వరుస ట్వీట్స్‌ - జానీ మాస్టర్‌ను ఉద్దేశించేనా?
Kadambari Jethwani 'కేసు విత్ డ్రా చేసి న్యాయం చేయండి' - హోంమంత్రి అనితను కలిసి ముంబయి నటి కాదంబరి జత్వానీ
'కేసు విత్ డ్రా చేసి న్యాయం చేయండి' - హోంమంత్రి అనితను కలిసి ముంబయి నటి కాదంబరి జత్వానీ
Balineni Srinivasa Reddy: జగన్‌ తీరు నచ్చలేదు- పార్టీ నుంచి బయటకు పంపే కుట్రలు చేశారు: బాలినేని కీలక వ్యాఖ్యలు
జగన్‌ తీరు నచ్చలేదు- పార్టీ నుంచి బయటకు పంపే కుట్రలు చేశారు: బాలినేని కీలక వ్యాఖ్యలు
Telangana: తెలంగాణవాసులకు బిగ్ అలర్ట్‌- మీ వాహనం కొని 15 ఏళ్లు దాటిందంటే తుక్కే
తెలంగాణవాసులకు బిగ్ అలర్ట్‌- మీ వాహనం కొని 15 ఏళ్లు దాటిందంటే తుక్కే
Embed widget