అన్వేషించండి

Game Changer Update: 'గేమ్ ఛేంజర్' అప్డేట్: దసరాని టార్గెట్ గా పెట్టుకున్న రామ్ చరణ్?

Game Changer Update: శంకర్ దర్శకత్వంలో రామ్‌ చరణ్‌ హీరోగా నటిస్తున్న పాన్ ఇండియా సినిమా ‘గేమ్ ఛేంజర్‌’. ఈ మూవీకి సంబంధించిన ఓ ఇంట్రెస్టింగ్ న్యూస్ సోషల్ మీడియాలో చక్కర్లు కొడుతోంది. 

Game Changer Update: 2024 మోస్ట్ అవైటెడ్ పాన్ ఇండియా సినిమాలలో ‘గేమ్‌ ఛేంజర్‌’ ఒకటి. మెగా పవర్ స్టార్ రామ్‌ చరణ్‌ హీరోగా నటిస్తున్న ఈ చిత్రాన్ని షో మ్యాన్ శంకర్‌ షణ్ముగం డైరెక్ట్ చేస్తున్నారు. ఇప్పటికే విడుదలైన చెర్రీ ఫస్ట్ లుక్ మెగా అభిమానులను విశేషంగా ఆకట్టుకుంది. అయితే చాలా కాలంగా ఈ మూవీ నుంచి మరో అప్డేట్ లేకపోవడంతో ఫ్యాన్స్ కాస్త నిరాశలో ఉన్నారు. ఈ నేపథ్యంలో వారిని ఉత్సాహపరిచే ఓ ఆసక్తికరమైన న్యూస్ ఇప్పుడు సోషల్ మీడియాలో చక్కర్లు కొడుతోంది. 
 
మనకందిన సమాచారం ప్రకారం, ‘గేమ్‌ ఛేంజర్‌’ సినిమా షూటింగ్ ప్రస్తుతం హైదరాబాద్ లోని రామోజీ ఫిలిం సిటీలో జరుగుతోంది. సంక్రాంతి సంబరాల కోసం మూడు రోజుల బ్రేక్ తీసుకున్న చిత్ర బృందం.. నిన్న బుధవారం తిరిగి చిత్రీకరణ ప్రారంభించింది. ఈ షూటింగ్ లో రామ్ చరణ్ తో పాటుగా సునీల్, రఘుబాబు వంటి పలువురు ప్రధాన నటీనటులు పాల్గొన్నట్లు తెలుస్తోంది. జనవరి 21 - 22 వరకూ జరగనున్న ఈ షెడ్యూల్ లో కొన్ని కీలక సన్నివేశాలను చిత్రీకరించనున్నారట. 

‘గేమ్‌ ఛేంజర్‌’ సినిమాని వీలైనంత త్వరగా ఫినిష్ చేసి బుచ్చిబాబు మూవీ షూటింగ్ లో పాల్గొనాలని భావిస్తున్నారట. ఇప్పటికే మేజర్ యాక్షన్ సీన్స్, సాంగ్స్ షూట్ కంప్లీట్ అయినందున.. మార్చి నెలాఖరుకల్లా తన పాత్రకు సంబంధించిన చిత్రీకరణ మొత్తాన్ని పూర్తి చేయాలని అనుకుంటున్నారట. ఈ మేరకు శంకర్ సినిమా షెడ్యూల్స్ ప్లాన్ చేసుకున్న చెర్రీ.. ఏప్రిల్ లో RC16 మూవీ రెగ్యులర్ షూటింగ్ స్టార్ట్ చేయాలని నిర్ణయించుకున్నారట.  

అన్నీ అనుకున్నట్లు జరిగి షూటింగ్ పూర్తయితే, ‘గేమ్‌ ఛేంజర్‌’ సినిమాని ఈ ఏడాది చివరి త్రైమాసికంలో ప్రేక్షకుల ముందుకు తీసుకురావాలని మేకర్స్ భావిస్తున్నారట. దిల్ రాజు బ్యానర్ లో తెరకెక్కనున్న 'శతమానం భవతి' సీక్వెల్ ను 2025 సంక్రాంతికి రిలీజ్ చేయనున్నట్లు ప్రకటించిన నేపథ్యంలో, అంతకంటే ముందుగానే రామ్ చరణ్ - శంకర్ ల సినిమా వచ్చే అవకాశం ఉందని వార్తలు వినిపిస్తున్నాయి. 2024 దసరా ఫెస్టివల్ సీజన్ లో విడుదల చేయాలని లక్ష్యంగా పెట్టుకున్నారని టాక్ నడుస్తోంది. ఇప్పటికే నాన్ థియేట్రికల్ రైట్స్ రికార్డ్ స్థాయిలో అమ్ముడయ్యాయని అంటున్నారు. మరి థియేట్రికల్ రిలీజ్ పై త్వరలోనే క్లారిటీ వస్తుందేమో చూడాలి. 

‘గేమ్‌ ఛేంజర్‌’ అనేది పవర్‌ ఫుల్‌ కథాంశంతో తెరకెక్కుతోన్న శంకర్ మార్క్ పొలిటికల్‌ యాక్షన్‌ థ్రిల్లర్. ఇందులో చెర్రీ తండ్రీకొడులుగా రెండు విభిన్నమైన పాత్రల్లో కనిపించనున్నారు. బాలీవుడ్ బ్యూటీ కియారా అద్వానీ హీరోయిన్ గా నటిస్తోంది. దర్శక నటుడు ఎస్‌.జె. సూర్య విలన్ గా నటిస్తుండగా.. అంజలి, శ్రీకాంత్‌, సునీల్‌, జయరామ్, సముద్రఖని, నవీన్‌ చంద్ర తదితరులు కీలక పాత్రలు పోషిస్తున్నారు. 

ఇది శ్రీ వేంకటేశ్వర క్రియేషన్స్‌ బ్యానర్ లో రూపొందే 50వ సినిమా. అందుకే దిల్‌ రాజు - శిరీష్ లు బడ్జెట్ విషయంలో ఎక్కడా రాజీ పడకుండా ప్రతిష్టాత్మకంగా నిర్మిస్తున్నారు. ఎస్ థమన్ ఈ చిత్రానికి సంగీతం సమకూరుస్తున్నారు. తిరు సినిమాటోగ్రఫీ నిర్వహిస్తుండగా, అవినాష్ కొల్లా ఆర్ట్ డైరెక్టర్ గా వ్యవహరిస్తున్నారు. బుర్రా సాయి మాధవ్ డైలాగ్స్ రాస్తున్నారు. ‘గేమ్‌ ఛేంజర్‌’ చిత్రాన్ని పాన్ ఇండియా స్థాయిలో తెలుగు, తమిళ, హిందీ భాషల్లో విడుదల చేయనున్నారు.

Also Read: హాలీవుడ్ హీరోలను తలదన్నేలా సోగ్గాడి స్టైలిష్ లుక్‌ - ఆర్జీవీ వీడియో వైరల్!

టాప్ హెడ్ లైన్స్

Kiran Abbavaram : ఇంద్రపుత్రగా కిరణ్ అబ్బవరం - ఫస్ట్ పాన్ ఇండియా మూవీ
ఇంద్రపుత్రగా కిరణ్ అబ్బవరం - ఫస్ట్ పాన్ ఇండియా మూవీ
Darshan Case : లోదుస్తుల్లో కారుకు వేలాడదీశారు - ఛాతీపై కాలితో తన్నారు... నటుడు దర్శన్ అభిమాని హత్య కేసులో సంచలనం
లోదుస్తుల్లో కారుకు వేలాడదీశారు - ఛాతీపై కాలితో తన్నారు... నటుడు దర్శన్ అభిమాని హత్య కేసులో సంచలనం
Hushar Pittalu Trailer : ఆడియన్స్ దేవుళ్లకు ప్రత్యేక పూజలు - 'హుషార్ పిట్టలు' మరీ ఇంత హుషారుగా ఉన్నారేంటీ?
ఆడియన్స్ దేవుళ్లకు ప్రత్యేక పూజలు - 'హుషార్ పిట్టలు' మరీ ఇంత హుషారుగా ఉన్నారేంటీ?
SlumDog Update : విజయ్ సేతుపతి స్లమ్ డాగ్ నుంచి బిగ్ సర్ప్రైజ్ - టబు As డిప్యూటీ కమిషనర్ గౌరీ హెగ్డే
విజయ్ సేతుపతి స్లమ్ డాగ్ నుంచి బిగ్ సర్ప్రైజ్ - టబు As డిప్యూటీ కమిషనర్ గౌరీ హెగ్డే

వీడియోలు

Rahane Saved Jaiswal From 4-Match Ban | జైస్వాల్‌ను గ్రౌండ్ నుంచి బయటకు పంపిన రహానే
Ganguly & Yuvraj Singh In Delhi Capitals Camp | ఢిల్లీ క్యాపిటల్స్‌లోకి దాదా, యువి
PM Modi Meets CWG 2026 Medal Winners | ప్రధాని మోడీని కలిసిన గ్లాస్గో కామన్వెల్త్ విజేతలు
Gundenininda Gudigantalu Serial August 10 | రోహిణిని రోడ్డుపైకి నెట్టేసిన ప్రభావతి
Ajinkya Rahane Reveals MS Dhoni's Secret | ధోనీ రూమ్ సీక్రెట్ రూల్ బయటపెట్టిన రహానే

ఫోటో గ్యాలరీ

వ్యక్తిగత కార్నర్

అగ్ర కథనాలు
టాప్ రీల్స్
Jharkhand Students Protest:జార్ఖండ్‌ విద్యార్థుల రణభేరీ! సీజీఎల్ రద్దు కోరుతూ అసెంబ్లీ ముట్టడి!
జార్ఖండ్‌ విద్యార్థుల రణభేరీ! సీజీఎల్ రద్దు కోరుతూ అసెంబ్లీ ముట్టడి!
Amaravati Seed Access Road: అమరావతికి సరికొత్త రాజమార్గం! మూడు రోజుల్లో సీడ్ యాక్సిస్ రోడ్డు పూర్తి వివరాలు ఇవే!
అమరావతికి సరికొత్త రాజమార్గం! మూడు రోజుల్లో సీడ్ యాక్సిస్ రోడ్డు పూర్తి వివరాలు ఇవే!
Priyanka Death Case:రాజమండ్రి మెడికో విద్యార్థి ప్రియాంక మృతిపై దర్యాప్తు వేగవంతం! రాజకీయం చేయొద్దని తండ్రి విజ్ఞప్తి!
రాజమండ్రి మెడికో విద్యార్థి ప్రియాంక మృతిపై దర్యాప్తు వేగవంతం! రాజకీయం చేయొద్దని తండ్రి విజ్ఞప్తి!
Hyderabad Road Accident: నిన్న రాజమండ్రిలో వైద్య విద్యార్థి! నేడు హైదరాబాద్‌లో రిటైర్డ్ జవాన్‌! ప్రాణాలు తీస్తున్న మద్యం మత్తు!
నిన్న రాజమండ్రిలో వైద్య విద్యార్థి! నేడు హైదరాబాద్‌లో రిటైర్డ్ జవాన్‌! ప్రాణాలు తీస్తున్న మద్యం మత్తు!
Gen Z Protests India 2026: జెన్‌జీ ఉద్యమాలు, ప్రశాంత్ కిషోర్ విజయం బీజేపీ స్క్రిప్టేనా - దేశ రాజకీయాల్లో అసలేం జరుగుతోంది?
జెన్‌జీ ఉద్యమాలు, ప్రశాంత్ కిషోర్ విజయం బీజేపీ స్క్రిప్టేనా - దేశ రాజకీయాల్లో అసలేం జరుగుతోంది?
Hushar Pittalu Trailer : ఆడియన్స్ దేవుళ్లకు ప్రత్యేక పూజలు - 'హుషార్ పిట్టలు' మరీ ఇంత హుషారుగా ఉన్నారేంటీ?
ఆడియన్స్ దేవుళ్లకు ప్రత్యేక పూజలు - 'హుషార్ పిట్టలు' మరీ ఇంత హుషారుగా ఉన్నారేంటీ?
పల్సర్‌ 150లో భారీ మార్పులు.. కొత్త ఇంజిన్‌, కొత్త ఫ్రేమ్‌తో వస్తున్న బజాజ్‌ యూత్‌ఫుల్‌ బైక్‌!
కొత్త బజాజ్‌ పల్సర్‌ 150 న్యూ లుక్‌ భలే ఉంది, మీరు చూశారా?.. ఫోటోలు లీక్‌
Claude Vs ChatGPT: చాట్‌జీపీటీ, క్లాడ్‌ మధ్య తేడా ఏంటి? ఏది ఉపయోగించడం సులభం? 
చాట్‌జీపీటీ, క్లాడ్‌ మధ్య తేడా ఏంటి? ఏది ఉపయోగించడం సులభం? 
Embed widget