అన్వేషించండి

Game Changer Teaser: ‘అయాం అన్‌ప్రిడిక్టబుల్’ - మెగా ఫ్యాన్స్‌కు మాస్ ట్రీట్ ఇచ్చిన శంకర్!

Game Changer Teaser Launched: 'గేమ్ ఛేంజర్' సినిమా నుంచి చాలా రోజుల నుంచి మెగా ఫ్యాన్స్ ఎదురు చూస్తున్న టీజర్ రానే వచ్చింది. మరి ఈ టీజర్ ఎలా ఉందో చూసేద్దాం పదండి.

Ram Charan Game Changer Teaser: మెగా అభిమానులంతా ఎప్పుడెప్పుడా అని ఎదురు చూస్తున్న 'గేమ్ ఛేంజర్' మూవీ నుంచి తాజాగా టీజర్ రిలీజ్ అయింది. మొత్తానికి మూడేళ్లుగా ఎన్నో ఆశలతో ఎదురు చూస్తున్నా మెగా ఫ్యాన్స్ కు ఈరోజు అసలైన ట్రీట్ వచ్చేసింది. మరి ఈ టీజర్ ఎలా ఉంది? టీజర్ లోని విశేషాలు ఏంటి?

విజనరీ డైరెక్టర్ శంకర్ దర్శకత్వంలో మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ హీరోగా నటిస్తున్న పాన్ ఇండియా పొలిటికల్ ఎంటర్టైనర్ 'గేమ్ ఛేంజర్'. ప్రముఖ టాలీవుడ్ నిర్మాత దిల్ రాజు ఈ సినిమాను శ్రీ వెంకటేశ్వర క్రియేషన్స్ బ్యానర్ పై భారీ బడ్జెట్ తో నిర్మిస్తున్నారు. ఇక ఈ సినిమాలో రామ్ చరణ్ సరసన బాలీవుడ్ బ్యూటీ కియారా అద్వానీ హీరోయిన్ గా నటిస్తోంది. అలాగే ఎస్జే సూర్య, సునీల్, అంజలి తదితరులు కీలకపాత్రలు పోషిస్తున్నారు. ఇప్పటికే ఈ సినిమా నుంచి రెండు పాటలు, పలు పోస్టర్స్ రిలీజ్ కాగా సినిమాపై అంచనాలను పెంచేశాయి. అలాగే నిన్న రాత్రి 'గేమ్ ఛేంజర్'కు సంబంధించిన చిన్న ప్రోమోను రిలీజ్ చేసి మరింత క్యూరియాసిటీని పెంచారు మేకర్స్. ఇక ఈరోజు టీజర్ లాంచ్ ఈవెంట్ గ్రాండ్ గా లక్నోలో జరుగుతున్న సంగతి తెలిసిందే. 

Also Read: హీరోయిన్ లేకుండానే తెరపైకి రాబోతున్న "మ్యాడ్ స్క్వేర్".. కానీ టిల్లు గానీ పిల్లది మాత్రం స్పెషల్ రోల్

నిర్మాత దిల్ రాజు ఈ మూవీ టీజర్ లాంచ్ ఈవెంట్ లో నవంబర్ 9న జరగబోతుందని అనౌన్స్ చేసినప్పటి నుంచి సోషల్ మీడియాలో 'గేమ్ ఛేంజర్' ట్రెండింగ్ లో ఉంది. దానికి తగ్గట్టుగానే తాజాగా రిలీజ్ అయిన ట్రైలర్ కూడా ఆసక్తికరంగా ఉంది. చెప్పినట్టుగానే మేకర్స్ శనివారం సాయంత్రం 6 గంటలకు టీజర్ ను రిలీజ్ చేశారు. టీజర్ లో శంకర్ మార్క్ భారీ విజువల్స్ కనిపించాయి. ఆఖర్లో ‘అయాం అన్‌ప్రిడిక్టబుల్’ అంటూ రామ్ చరణ్ కొత్త తరహా బాడీ లాంగ్వేజ్‌లో చెప్పే డైలాగ్ టీజర్‌కు హైలెట్. అలాగే బ్యాక్గ్రౌండ్ స్కోర్ కూడా అద్భుతంగా ఉంది. తమన్ అందించిన మ్యూజిక్ ఈ టీజర్ లో మెయిన్ హైలెట్ అని చెప్పొచ్చు. అదిరిపోయే యాక్షన్ సీన్స్ తో పాటు ఈ సినిమాలో రామ్ చరణ్ స్టైలిష్ గా కనిపించబోతున్నాడని టీజర్ ద్వారా వెల్లడించారు. టీజర్ చూస్తుంటే థియేటర్లలో ఈ సినిమా దుమ్మురేపడం ఖాయం అనిపిస్తోంది. 

కాగా టీజర్ లాంచ్ ఈవెంట్ లో భాగంగా 'గేమ్ ఛేంజర్' చిత్ర బృందం అంతా లక్నోకు వెళ్లిన సంగతి తెలిసిందే. కాగా టీజర్ ని తెలుగు లో దిల్ రాజు యూట్యూబ్ ఛానల్లో, తమిళ్ లో సరిగమ తమిళ్ ఛానల్లో, హిందీలో జీ స్టూడియోస్ ఛానల్లో రిలీజ్ చేశారు. కాగా 'గేమ్ ఛేంజర్' పాన్ ఇండియా మూవీగా జనవరి 10న భారీ ఎత్తున థియేటర్లలోకి రాబోతోంది. ఇక టీజర్ తో మొదలైన ప్రమోషన్ కార్యక్రమాలు జనవరి దాకా జోరుగా నడవబోతున్నాయి. ఈ ఈవెంట్ తర్వాత అమెరికా డల్లాస్ లో ఓ భారీ ఈవెంట్ ను నిర్వహించబోతున్నారు. అలాగే జనవరి మొదటి వారంలో ఏపీ తెలంగాణలో కూడా ఇలాంటి ఈవెంట్ ఉంటుంది. అయితే జనవరి మొదటి వారంలో 'గేమ్ ఛేంజర్' సినిమా ప్రీ రిలీజ్ ఈవెంట్ ఉండొచ్చు.

Read Also : Kannappa Leak: ప్రభాస్ 'కన్నప్ప' లుక్ లీక్ - పట్టిస్తే రూ.ఐదు లక్షలు - ప్రకటించిన మంచు విష్ణు!

టాప్ హెడ్ లైన్స్

Kattalan OTT : ఓటీటీలోకి సునీల్ మలయాళ యాక్షన్ థ్రిల్లర్ - ఎప్పుడు, ఎందులో స్ట్రీమింగ్ అంటే?
ఓటీటీలోకి సునీల్ మలయాళ యాక్షన్ థ్రిల్లర్ - ఎప్పుడు, ఎందులో స్ట్రీమింగ్ అంటే?
Devi Sri Prasad: దేవికి ఓటు వేసిన నాగార్జున... 'కింగ్ 100'కు డీఎస్పీ మ్యూజిక్ కన్ఫర్మ్
దేవికి ఓటు వేసిన నాగార్జున... 'కింగ్ 100'కు డీఎస్పీ మ్యూజిక్ కన్ఫర్మ్
Vijay Varma: తమన్నా మాజీ బాయ్‌ఫ్రెండ్‌కు లైంగిక వేధింపులు... కాస్టింగ్ కౌచ్ గురించి విజయ్ వర్మ ఏమన్నాడంటే?
తమన్నా మాజీ బాయ్‌ఫ్రెండ్‌కు లైంగిక వేధింపులు... కాస్టింగ్ కౌచ్ గురించి విజయ్ వర్మ ఏమన్నాడంటే?
Casting Couch: డబ్బులు అడిగితే  లైంగిక కోర్కెలు తీర్చమన్నాడు... అందాల పోటీల్లో చీకటి కోణం
డబ్బులు అడిగితే  లైంగిక కోర్కెలు తీర్చమన్నాడు... అందాల పోటీల్లో చీకటి కోణం

వీడియోలు

Ujjaini Mahankali Bonalu 2026 | అమ్మవారికి తొలి బోనం సమర్పించిన పొన్నం
HYDRAA Restores Uppal Nalla Cheruvu Lake | ఉప్పల్ నల్లచెరువుకు కొత్త జలకళ
Trinayani Serial Actress Ashika Padukone | 'త్రినయని' ఆషికా రియల్ లైఫ్ సీక్రెట్స్
Hardik Pandya Comments On Captaincy | కెప్టెన్సీపై హార్దిక్ పాండ్యా షాకింగ్ కామెంట్స్
Vaibhav Suryavanshi Vice Captaincy | 15 ఏళ్ల కుర్రాడికి వైస్ కెప్టెన్సీ ఏంటి?

ఫోటో గ్యాలరీ

వ్యక్తిగత కార్నర్

అగ్ర కథనాలు
టాప్ రీల్స్
AP Voter List Deletions: ఏపీలో 44 లక్షల ఓట్లు గల్లంతు - నెల్లూరు, తిరుపతి, కడపలోనే ఎక్కువ.. ఏ పార్టీకి నష్టం?
ఏపీలో 44 లక్షల ఓట్లు గల్లంతు - నెల్లూరు, తిరుపతి, కడపలోనే ఎక్కువ.. ఏ పార్టీకి నష్టం?
HYDRA Commissioner Ranganath Removal Order: హైడ్రా చుట్టూ న్యాయపరమైన సంక్షోభం - రంగనాథ్ బదిలీకి హైకోర్టు ఆదేశం.. రేవంత్ ప్రభుత్వ వ్యూహం ఏమిటి?
హైడ్రా చుట్టూ న్యాయపరమైన సంక్షోభం - రంగనాథ్ బదిలీకి హైకోర్టు ఆదేశం.. రేవంత్ ప్రభుత్వ వ్యూహం ఏమిటి?
West Bengal Industrial Revival: పశ్చిమ బెంగాల్ పారిశ్రామిక రీ-ఎంట్రీ - సువేందు భవ్య రసాయన్ విజన్.. గుజరాత్, మహారాష్ట్రలకు పోటీగా నిలబడగలదా?
పశ్చిమ బెంగాల్ పారిశ్రామిక రీ-ఎంట్రీ - సువేందు భవ్య రసాయన్ విజన్.. గుజరాత్, మహారాష్ట్రలకు పోటీగా నిలబడగలదా?
Andhra Pradesh And Telangana Weather Report: ఆంధ్రప్రదేశ్ తెలంగాణలో తేలికపాటి వర్షాలు- వాతావరణ శాఖ లేటెస్ట్ అప్‌డ్టే ఇదే 
ఆంధ్రప్రదేశ్ తెలంగాణలో తేలికపాటి వర్షాలు- వాతావరణ శాఖ లేటెస్ట్ అప్‌డ్టే ఇదే 
IMD Weather Update: ఈ రాష్ట్రాలకు వరద ముప్పు- ఐఎమ్‌డి సీరియస్‌ హెచ్చరిక!
ఈ రాష్ట్రాలకు వరద ముప్పు- ఐఎమ్‌డి సీరియస్‌ హెచ్చరిక!
How To Save ₹100 Every Day:రోజుకు 100 రూపాయలు సేవ్ చేస్తే మీ ఆర్థిక భవిష్యత్‌ ఎలా మారుతుంది?
రోజుకు 100 రూపాయలు సేవ్ చేస్తే మీ ఆర్థిక భవిష్యత్‌ ఎలా మారుతుంది?
World Breastfeeding Week 2026 : బిడ్డకు తల్లిపాలు ఎందుకు ముఖ్యం? పుట్టిన గంటలోపే ఎందుకు ఇవ్వాలి? లాభాలు, పోషకాలు ఇవే
బిడ్డకు తల్లిపాలు ఎందుకు ముఖ్యం? పుట్టిన గంటలోపే ఎందుకు ఇవ్వాలి? లాభాలు, పోషకాలు ఇవే
Kattalan OTT : ఓటీటీలోకి సునీల్ మలయాళ యాక్షన్ థ్రిల్లర్ - ఎప్పుడు, ఎందులో స్ట్రీమింగ్ అంటే?
ఓటీటీలోకి సునీల్ మలయాళ యాక్షన్ థ్రిల్లర్ - ఎప్పుడు, ఎందులో స్ట్రీమింగ్ అంటే?
Embed widget