By: ABP Desam | Updated at : 19 Sep 2023 04:38 PM (IST)
రజనీకాంత్(Photo Credit: Nelson Dilipkumar/Instagram)
సౌత్ సూపర్ స్టార్ రజనీకాంత్ నటించిన తాజా చిత్రం ‘జైలర్’. ఆయన కెరీర్ లో ఈ మూవీ తన రేంజిని మరో స్థాయికి తీసుకెళ్లిందని చెప్పుకోవచ్చు. ఆగష్టు 10న విడుదలైన ఈ చిత్రం ప్రపంచ వ్యాప్తంగా రూ. 550 కోట్లకు పైగా వసూళు చేసి వారెవ్వా అనిపించింది. సినీ అభిమానులకు ఈ చిత్రం అద్భుతంగా నచ్చింది. అయితే, ఇంతటి ఘన విజయాన్ని సాధించిన ‘జైలర్’ సినిమా తనకు ఓ సాధారణ మూవీ లాగే అనిపించిందంటూ రజనీకాంత్ వ్యాఖ్యానించడం అందరినీ షాక్ కి గురి చేసింది.
తాజాగా ‘జైలర్’ చిత్రానికి సంబంధించి సక్సెస్ మీట్ ఏర్పాటు చేశారు. ఈ ఈవెంట్ లో చిత్రబృందం పాల్గొన్నది. ఈ సందర్భంగా మాట్లాడిన రజనీకాంత్ అందరినీ ఆశ్చర్యపరిచారు. “వాస్తవానికి ‘జైలర్’ సినిమా ఓ యావరేజ్ మూవీగా అనిపించింది. కానీ, అనిరుధ్ ఈ సినిమాను ఓ స్థాయికి తీసుకెళ్లాడు. అతడి బ్యాగ్రౌండ్ స్కోర్ సినిమాకు ప్రాణం పోసింది. అతడి కారణంగానే ఈ సినిమా ఈ స్థాయి సక్సెస్ అందుకుంది” అని వ్యాఖ్యానించారు.
రజనీకాంత్ వ్యాఖ్యలు సినీ పరిశ్రమతో పాటు సాధారణ ప్రేక్షకులను కూడా ఆశ్చర్య పరిచాయి. అనిరుధ్ మంచి మ్యూజిక్ ఇచ్చినప్పటికీ, సినిమా ఈ స్థాయిలో సక్సెస్ కావడానికి ఆయనే కారణం అని చెప్పడం ఏంటని విమర్శిస్తున్నారు. మొత్తం అనిరుధ్ చేస్తే, మరి దర్శకుడు నెల్సన్ దిలీప్ కుమార్ చేసిందేమీ లేదా? అని ఆయన అభిమానులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. ఇలాంటి వ్యాఖ్యలు రజనీకాంత్ లాంటి పెద్ద స్టార్స్ నుంచి ఊహించలేదంటున్నారు. ఇలా కామెంట్స్ చేయడం కచ్చితంగా దర్శకుడి ప్రతిభను తగ్గించడమే అవుతుందన్నారు. “దర్శకుడు నెల్సన్ రజనీకి అద్భుత విజయాలను అందించారు. ‘జైలర్’ అన్నింటికీ మించిన హిట్ సాధించింది. ఇలాంటి సమయంలో ఆయన అలా కామెంట్స్ చేయడం ఏంటి?” అని ప్రశ్నిస్తున్నారు.
రీసెంట్ గా ‘బీస్ట్’ మూవీ గురించి రజనీకాంత్ చేసిన వ్యాఖ్యలు విజయ్ దళపతి అభిమానులకు ఇబ్బంది కలిగించాయి. ‘బీస్ట్’ మూవీ తర్వాత నెల్సన్ రజినీకాంత్ తో ‘జైలర్’ మూవీని అనౌన్స్ చేశారు. ఈ ప్రకటన తర్వాత రజినీకి చాలామంది ఫోన్లు చేసి నెల్సన్ తో సినిమా చేయవద్దని చెప్పారట. ‘బీస్ట్’ సినిమా సరిగ్గా ఆడకపోవడంతో వాళ్లు అలాంటి సలహా ఇచ్చారట. ఇదే ఈ విషయాన్ని రజినీ.. ‘బీస్ట్’ ప్రొడ్యూసర్స్ ని అడిగాడట. దానికి వారు సమాధానం చెప్తూ, “రివ్యూస్ సరిగా రాకపోయినా, డిస్ట్రిబ్యూటర్స్ కి ఎటువంటి నష్టం జరగలేదని చెప్పుకొచ్చారట. ఈ విషయాన్ని రజినీ ఇటీవల వెల్లడించారు. ఈ వ్యాఖ్యలపై విజయ్ అభిమానులు తీవ్ర అసంతృప్తి, ఆగ్రహం వ్యక్తం చేశారు. అటు ‘జైలర్’ మూవీ ఇప్పటికే అమెజాన్ ప్రైమ్ వీడియోలో స్ట్రీమింగ్ కు వచ్చింది. ఓటీటీలోనూ ఈ సినిమా చక్కటి ఆదరణ దక్కించుకుంటోంది. ప్రైమ్ వీడియో ఇండియా టాప్ ట్రెండింగ్స్ లో ‘జైలర్’ రెండో స్థానంలో ఉండటం విశేషం.
Read Also: డిలీటెడ్ సీన్లతో ‘జవాన్’ ఓటీటీ విడుదల, అభిమానులకు అదిరిపోయే న్యూస్ చెప్పిన దర్శకుడు!
ముఖ్యమైన, మరిన్ని ఆసక్తికర కథనాల కోసం ‘టెలిగ్రామ్’లో ‘ఏబీపీ దేశం’లో జాయిన్ అవ్వండి.
Join Us on Telegram: https://t.me/abpdesamofficial
వరుణ్ తేజ్ మూవీకి భారీ డీల్ - 'ఆపరేషన్ వాలెంటైన్' నాన్ థియేట్రికల్ రైట్స్ అన్ని కోట్లా?
Bigg Boss 7 Telugu: దొంగ అనుకుంటారు నన్ను - రెండు నిమిషాలు పట్టదు, ఎత్తిపడేస్తా.. శోభాశెట్టితో శివాజీ గొడవ
BhagavanthKesari: గ్రౌండ్ ఫ్లోర్ బలిసిందా బే - బాలయ్య ఊరమాస్ అవతార్, 'భగవంత్ కేసరి' సర్ప్రైజ్ అదిరింది
Vijay Deverakonda - Rashmika: డార్లింగ్ అంటూ దేవరకొండ ట్వీట్ - నువ్వు ఎప్పటికీ బెస్ట్ అంటూ రష్మిక రిప్లై!
Siddharth: కర్ణాటకలో హీరో సిద్ధార్థ్‌కు ఘోర అవమానం, తమిళోడివి అంటూ వేదికపై ఉండగానే..
Telangana BJP : సర్వశక్తులు కూడగట్టుకునేందుకు బీజేపీ ప్రయత్నం - అగ్రనేతల పర్యటనలు మేలు చేస్తాయా ?
Breaking News Live Telugu Updates: చంద్రబాబుతో బ్రహ్మణి, భువనేశ్వరి, మాజీ మంత్రి నారాయణ ములాఖత్
Accident Policy: మీరిచ్చే ఒక్క రూపాయితో ఓ పేద కుటుంబానికి రూ.10 లక్షల ఇన్సూరెన్స్ - దానం ఇలా కూడా చేయొచ్చు
Cyber Crime: గణేష్ ఉత్సవాల లక్కీ డ్రాలో ఐఫోన్ 15-నమ్మితే అకౌంట్ ఖాళీ అయినట్టే
/body>