అన్వేషించండి

Rajinikanth - Nagarjuna: 32 ఏళ్ల తర్వాత కలిసి నటించనున్న నాగార్జున, రజనీకాంత్ - ఆ సినిమా కోసమే!

Rajinikanth - Nagarjuna: రజనీకాంత్, నాగార్జున కలిసి 1991లో విడుదలయిన ‘శాంతి క్రాంతి’ మూవీలో కలిసి కనిపించారు. 32 ఏళ్ల తర్వాత మరోసారి కలిసి స్క్రీన్ షేర్ చేసుకోనున్నారని వార్తలు వినిపిస్తున్నాయి.

Rajinikanth And Nagarjuna To Act Together Soon: ఒకప్పుడు మాత్రమే కాదు.. ఇప్పుడు కూడా మల్టీ స్టారర్లకు విపరీతమైన క్రేజ్ ఉంది. తెలుగులో హీరోలు ఎక్కువగా ఎవరు ప్రాజెక్ట్స్‌లో వారు బిజీగా ఉండడంతో ఇతర హీరోలతో కలిసి నటించే అవకాశం ఎక్కువగా ఉండడం లేదు. కానీ తమిళంలో మాత్రం రెగ్యులర్‌గా మల్టీ స్టారర్ ప్రాజెక్ట్స్‌ను వర్కవుట్ చేయడానికే ప్రయత్నిస్తున్నారు దర్శకులు. అందుకే 32 ఏళ్ల క్రితం కలిసి నటించిన నాగార్జున, రజనీకాంత్ కాంబినేషన్‌ను మళ్లీ ఇన్నేళ్ల తర్వాత వర్కవుట్ అయ్యేలా చేయాలని చూస్తున్నాడు ఓ యంగ్ డైరెక్టర్. రజనీ హీరోగా నటించనున్న తరువాతి చిత్రంలో నాగ్ ఓ కీలక పాత్రలో కనిపించనున్నట్టు సమాచారం.

రజనీతో నాగ్..

సూపర్ స్టార్ రజనీకాంత్ మల్టీ స్టారర్ సినిమాలకు ఎప్పుడూ నో చెప్పరు. ఆయన చివరి చిత్రం ‘జైలర్’లో కూడా కన్నడ హీరో శివ రాజ్‌కుమార్, మలయాళ స్టార్ మోహన్‌ లాల్‌తో కలిసి నటించారు. ఇప్పుడు నాగార్జునతో కలిసి నటించడానికి సిద్ధమవుతున్నారు. యంగ్ డైరెక్టర్ లోకేశ్ కనకరాజ్ డైరెక్షన్‌లో రజనీ ఓ సినిమా చేస్తున్న విషయం తెలిసిందే. ప్రస్తుతం ‘తలైవార్ 171’ అనే వర్కింగ్ టైటిల్‌తో తెరకెక్కుతున్న ఈ మూవీలో నాగార్జున కూడా నటించనున్నట్టు అటు కోలీవుడ్, ఇటు టాలీవుడ్‌లో వార్తలు వినిపిస్తున్నాయి. కేవలం నాగార్జున మాత్రమే కాదు.. ఈ సినిమా కోసం మరెందరో స్టార్లను రంగంలోకి దించనున్నాడట లోకేశ్.

చివరిగా 1991లో..

‘తలైవార్ 171’లో నాగార్జున కూడా ఓ పాత్ర చేస్తే బాగుంటుందని ఆయనను సంప్రదించాడట దర్శకుడు లోకేశ్ కనకరాజ్. అయితే నాగార్జున ఇంకా ఈ మూవీని ఓకే చేశారా లేదా అన్న విషయం మాత్రం బయటికి రాలేదు. ఒకవేళ ఇదే నిజమయితే 32 ఏళ్ల తర్వాత నాగార్జున, రజనీకాంత్‌ను ఒకే స్క్రీన్‌పై చూడనున్నారు ప్రేక్షకులు. వీరిద్దరూ చివరిగా 1991లో విడుదలయిన ‘శాంతి క్రాంతి’ అనే చిత్రంలో కలిసి కనిపించారు. ఇక నాగార్జున సైతం ఎప్పటినుండి అయినా మల్టీ స్టారర్లను ఎక్కువగానే ఇష్టపడతారు. ప్రస్తుతం ధనుష్‌తో కలిసి ‘కుబేర’ షూటింగ్‌లో బిజీగా ఉన్నారు నాగ్. ఇప్పుడు రజనీకాంత్ మూవీని కూడా కచ్చితంగా ఓకే చేస్తారని ప్రేక్షకులు భావిస్తున్నారు.

Also Read: కొరటాల చేసిన తప్పు నాగ్ అశ్విన్ చెయ్యలేదు - ఆచార్యకు, కల్కికి తేడా అదే మరి!

బాలీవుడ్ హీరో కూడా..

నాగార్జునను మాత్రమే కాదు... ఇంతకు ముందే ‘తలైవార్ 171’లో గెస్ట్ రోల్ చేయడం కోసం బాలీవుడ్ హీరో రణవీర్ సింగ్‌ను కూడా సంప్రదించాడట లోకేశ్ కనకరాజ్. సౌత్ సినిమాలు అన్నా.. సౌత్ యాక్టర్స్ అన్నా.. రణవీర్‌కు ఇష్టం కాబట్టి ఈ గెస్ట్ రోల్‌ను తాను ఓకే చేయాలని అనుకుంటున్నట్టు సమాచారం. ప్రస్తుతం నాగార్జున, రణవీర్ సింగ్ పేర్లు మాత్రమే బయటికొచ్చినా.. మరెందరో స్టార్లను కూడా ఈ సినిమా కోసం సంప్రదించాలనే ఆలోచనలో ఉన్నాడట లోకేశ్. ప్రస్తుతం రజనీకాంత్.. జ్ఞానవేల్ దర్శకత్వంలో తెరకెక్కుతున్న ‘వెట్టయాన్’ మూవీ షూటింగ్‌లో బిజీగా ఉన్నారు. అది పూర్తయిన వెంటనే ‘తలైవార్ 171’ సెట్స్‌లో అడుగుపెట్టనున్నారు.

Also Read: కల్కి రిలీజ్ జూన్‌లో... ఆ రెండు రోజుల్లో ఏదో ఒక తేదీన ప్రేక్షకుల ముందుకు ప్రభాస్ సినిమా?

టాప్ హెడ్ లైన్స్

Mammootty : మలయాళ స్టార్‌ మమ్ముట్టీకి సామాన్యుడి సాయం - నా ఫ్రెండ్ అంటూ... వీడియో వైరల్
మలయాళ స్టార్‌ మమ్ముట్టీకి సామాన్యుడి సాయం - నా ఫ్రెండ్ అంటూ... వీడియో వైరల్
Anupama Parameswaran : కష్టంలో నాకు గుర్తొచ్చే ఫస్ట్ వ్యక్తి ఆ హీరోనే - అనుపమ పరమేశ్వరన్
కష్టంలో నాకు గుర్తొచ్చే ఫస్ట్ వ్యక్తి ఆ హీరోనే - అనుపమ పరమేశ్వరన్
Bandla Ganesh : ఘనంగా బండ్ల గణేష్ కుమార్తె వివాహం - తరలివచ్చిన తారా లోకం... అల్లుడి బ్యాగ్రౌండ్ ఏంటో తెలుసా?
ఘనంగా బండ్ల గణేష్ కుమార్తె వివాహం - తరలివచ్చిన తారా లోకం... అల్లుడి బ్యాగ్రౌండ్ ఏంటో తెలుసా?
Newtons 3rd Law OTT : ఓటీటీలోకి సుమంత్ కొత్త మూవీ - క్రైమ్ ఇన్వెస్టిగేషన్ థ్రిల్లర్ ఎందులో స్ట్రీమింగ్ అంటే?
ఓటీటీలోకి సుమంత్ కొత్త మూవీ - క్రైమ్ ఇన్వెస్టిగేషన్ థ్రిల్లర్ ఎందులో స్ట్రీమింగ్ అంటే?

వీడియోలు

Bindu Madhavi Reacts to Uppal Balu Controversy | ఉప్పల్ బాలు vs బిందు మాధవి
Devdutt Padikkal Historic Test Century | స్వతంత్ర దినోత్సవం రోజు పడిక్కల్ సెంచరీ
Devdutt Padikkal Century vs Sri Lanka | శ్రీలంకపై దేవదత్ పడిక్కల్ సూప‌ర్ సెంచ‌రీ
KL Rahul Retired Hurt Near Century | సెంచరీకి చేరువలో కేఎల్ రాహుల్ రిటైర్డ్ హర్ట్
IND Spin Attack Strategy vs SL Revealed | గాలే టెస్టులో ముగ్గురు లెఫ్ట్ ఆర్మ్ స్పిన్నర్లు

ఫోటో గ్యాలరీ

వ్యక్తిగత కార్నర్

అగ్ర కథనాలు
టాప్ రీల్స్
Addanki Ganja News: అద్దంకి సమీపంలో రోడ్డు ప్రమాదం.. పోలీసుల వాహనంలో గంజాయి చూసి స్థానికులు ఆగ్రహం
అద్దంకి సమీపంలో రోడ్డు ప్రమాదం.. పోలీసుల వాహనంలో గంజాయి చూసి స్థానికులు ఆగ్రహం
Visakhapatnam to Bhogapuram Airport Buses: విశాఖ నుంచి భోగాపురం ఎయిర్‌పోర్ట్‌కు ఏరో ఎక్స్‌ప్రెస్ బస్సులు.. స్టాప్స్, ఛార్జీల పూర్తి వివరాలు
విశాఖ నుంచి భోగాపురం ఎయిర్‌పోర్ట్‌కు ఏరో ఎక్స్‌ప్రెస్ బస్సులు.. స్టాప్స్, ఛార్జీల పూర్తి వివరాలు
Gavaskar Comments : జిమ్ ఫిట్‌నెస్ కాదు మ్యాచ్ ఫిట్‌నెస్ ముఖ్యం.. బుమ్రా, హార్దిక్ గాయాలపై గవాస్కర్ క్లాస్, ట్రెయినింగ్ పద్ధతులపై ఫైర్ !
జిమ్ ఫిట్‌నెస్ కాదు మ్యాచ్ ఫిట్‌నెస్ ముఖ్యం.. బుమ్రా, హార్దిక్ గాయాలపై గవాస్కర్ క్లాస్, ట్రెయినింగ్ పద్ధతులపై ఫైర్ !
సోషల్ మీడియాలో నెగిటివ్ కామెంట్స్ పై టెక్ మహీంద్రా ఉద్యోగి భావన స్ట్రాంగ్ కౌంటర్స్ ..ABP దేశం Exclusive
సోషల్ మీడియాలో నెగిటివ్ కామెంట్స్ పై టెక్ మహీంద్రా ఉద్యోగి భావన స్ట్రాంగ్ కౌంటర్స్ ..ABP దేశం Exclusive
DSC Teachers Rally: విజయవాడలో మెగా డీఎస్సీ 2025 టీచర్ల భారీ ర్యాలీ.. ఏ అక్రమాలు జరగలేదన్న వైఎస్ జగన్ ఫ్యాన్
విజయవాడలో మెగా డీఎస్సీ 2025 టీచర్ల భారీ ర్యాలీ.. ఏ అక్రమాలు జరగలేదన్న వైఎస్ జగన్ ఫ్యాన్
Tirumala Viral Video: తిరుమల అలిపిరి మెట్ల మార్గంలో దర్జాగా స్మోకింగ్ చేసిన వ్యక్తి.. భక్తులు ఆగ్రహం
తిరుమల అలిపిరి మెట్ల మార్గంలో దర్జాగా స్మోకింగ్ చేసిన వ్యక్తి.. భక్తులు ఆగ్రహం
Bandla ganesh Daughter Marriage : ఘనంగా బండ్ల గణేష్ కుమార్తె పెళ్లి - టాలీవుడ్ స్టార్స్ సందడి... తెలుగు రాష్ట్రాల సీఎంలు, రాజకీయ ప్రముఖులు హాజరు
ఘనంగా బండ్ల గణేష్ కుమార్తె పెళ్లి - టాలీవుడ్ స్టార్స్ సందడి... తెలుగు రాష్ట్రాల సీఎంలు, రాజకీయ ప్రముఖులు హాజరు
Soaked Raisins : రోజూ కిస్మిస్ నానబెట్టి ఉదయాన్నే తింటే కలిగే అద్భుతమైన ఆరోగ్య ప్రయోజనాలు ఇవే
రోజూ కిస్మిస్ నానబెట్టి ఉదయాన్నే తింటే కలిగే అద్భుతమైన ఆరోగ్య ప్రయోజనాలు ఇవే
Embed widget