అన్వేషించండి

Jailer 2 Leak : రజనీ కాంత్ 'జైలర్ 2' ఫుటేజీ లీక్ - చిత్ర నిర్మాణ సంస్థ స్ట్రాంగ్ వార్నింగ్... జన నాయగన్ లీక్ మరువక ముందే...

Jailer 2 Footage : కోలీవుడ్ ఇండస్ట్రీలో మరో మూవీ రిలీజ్‌కు ముందే లీకుల బారిన పడింది. రజనీ కాంత్ జైలర్ 2 సెట్స్ నుంచి ఓ వీడియో నెట్టింట వైరల్ అవుతోంది.

Rajinikanth's Jailer 2 Footage Leaked Online : కోలీవుడ్ ఇండస్ట్రీని వరుస లీకులు ఇబ్బంది పెడుతున్నాయి. దళపతి విజయ్ జన నాయగన్ లీక్ కేసు ఇంకా పూర్తిగా మరువక ముందే మరో స్టార్ హీరో మూవీకి సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో ప్రత్యక్షమైనట్లు తెలుస్తోంది.

జైలర్ 2 ఫుటేజీ లీక్

సూపర్ స్టార్ రజనీ కాంత్ బ్లాక్ బస్టర్ సీక్వెల్ 'జైలర్ 2'కు సంబంధించి ఓ ఫుటేజీ సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. ఇది చూసిన తలైవా అభిమానులు ఒక్కసారిగా షాక్ అయ్యారు. దీనిపై చిత్ర నిర్మాణ సంస్థ సన్ పిక్చర్స్ రియాక్ట్ అయ్యింది. 'జైలర్ 2 సెట్స్ నుంచి ఓ వీడియో లీక్ అయి సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నట్లు మా దృష్టికి వచ్చింది. మా యాంటీ పైరసీ బృందం దీన్ని తొలగించేందుకు చర్యలు చేపట్టింది.

ఈ క్లిప్ షేర్ చేయడం లేదా డౌన్ లోడ్ చేయడం వంటివి చెయ్యొద్దు. అలా చేసిన వారిపై కఠిన చర్యలు తీసుకుంటాం. వారి అకౌంట్స్ సస్పెండ్ అయ్యి క్రిమినల్ కేసులు ఎదుర్కోవాల్సి ఉంటుంది.' అంటూ స్ట్రాంగ్ వార్నింగ్ ఇచ్చింది. గతంలో లోకేశ్ కనగరాజ్ దర్శకత్వంలో వచ్చిన కూలీ మూవీ నుంచి రిలీజ్‌కు ముందే వీడియో లీక్ అయ్యింది. సెట్‌లో నాగార్జునకు సంబంధించి ఓ వీడియో లీక్ కావడం అప్పట్లో కలకలం రేపింది.

Also Read : 'ఎట్టా ఎట్టా' అదరగొట్టిన అఖిల్, భాగ్యశ్రీ జోడీ - లెనిన్ విలేజ్ లవ్ సాంగ్ క్యూట్ లిరిక్స్

ఈ మూవీకి నెల్సన్ దిలీప్ కుమార్ దర్శకత్వం వహిస్తుండగా... 2023లో వచ్చిన జైలర్ మూవీకి సీక్వెల్‌గా ఈ మూవీని రూపొందిస్తున్నారు. రిటైర్డ్ పోలీస్ ఆఫీసర్ ముత్తువేల్ పాండియన్ పాత్రలో రజనీ అదరగొట్టారు. ఆయన భార్యగా రమ్యకృష్ణ, కరుణాడ చక్రవర్తి శివరాజ్ కుమార్, మలయాళ స్టార్ మోహన్ లాల్, జాకీ ష్రాఫ్, సునీల్, వినాయకన్ వంటి స్టార్స్ నటించారు. సీక్వెల్‌లో కొత్త రోల్స్ యాడ్ కానున్నట్లు తెలుస్తోంది. సన్ పిక్చర్స్ బ్యానర్‌పై కళానిధి మారన్ మూవీని... ఫస్ట్ పార్ట్‌ను మించి భారీ బడ్జెట్‌తో నిర్మిస్తున్నారు.

విగ్రహాల చోరీ ముఠా వల్ల ఓ రిటైర్స్ పోలీస్ ఆఫీసర్ ఫ్యామిలీ ఎన్ని ఇబ్బందులు ఎదుర్కొంది? తన కుటుంబాన్ని కాపాడుకునేందుకు సదరు ఆఫీసర్ ఏం చేశాడు? క్లైమాక్స్‌లో ఆయనకు తెలిసిన షాకింగ్ నిజం వంటి వాటిని ఫస్ట్ పార్ట్‌లో చూపించగా... ఇంట్రెస్టింగ్ కాన్సెప్ట్‌తో సీక్వెల్ తెరకెక్కుతోంది. ఇప్పటికే షూటింగ్ చివరి దశకు చేరుకోగా... జూన్ 12న మూవీ రిలీజ్ చేసేందుకు మేకర్స్ ప్లాన్ చేస్తున్నారు.

About the author Ganesh Guptha

గణేష్ గుప్త గత రెండున్నరేళ్లుగా ABPలో పని చేస్తున్నారు. ఐదేళ్లుగా జర్నలిజంలో ప్రముఖ తెలుగు మీడియా ఛానళ్లలో పని చేసిన ఎక్స్‌పీరియన్స్ ఉంది. ప్రముఖ మీడియా సంస్థలు ఈటీవీ భారత్, Way2News, Lokal యాప్స్‌లో కంటెంట్ రైటర్‌గా సేవలు అందించారు.

Read More

టాప్ హెడ్ లైన్స్

Allu Arjun On Chiranjeevi Birthday: కట్టె కాలే వరకు... చిరు బర్త్‌డేకు అల్లు అర్జున్ చేసిన ట్వీట్‌లో మీనింగ్ తెలుసా?
కట్టె కాలే వరకు... చిరు బర్త్‌డేకు అల్లు అర్జున్ చేసిన ట్వీట్‌లో మీనింగ్ తెలుసా?
Mugguru Kothulu: ముగ్గురు కోతులు ఫస్ట్ లుక్... ఫుల్ లెంగ్త్ కామెడీ సినిమా... కిటికీ లోనుంచి ఏం చూస్తున్నారు?
ముగ్గురు కోతులు ఫస్ట్ లుక్... ఫుల్ లెంగ్త్ కామెడీ సినిమా... కిటికీ లోనుంచి ఏం చూస్తున్నారు?
Naga Babu: భవిష్యత్ తరాలకు ప్రాణవాయువు ఇద్దాం... చిరు పుట్టినరోజున మొక్కలు నాటిన తమ్ముడు నాగబాబు
భవిష్యత్ తరాలకు ప్రాణవాయువు ఇద్దాం... చిరు పుట్టినరోజున మొక్కలు నాటిన తమ్ముడు నాగబాబు
Deepika Padukone : ప్రభాస్ స్పిరిట్ కాంట్రవర్సీపై దీపికా పదుకోన్ రియాక్షన్ - ఒక్క లైక్‌తో...
ప్రభాస్ స్పిరిట్ కాంట్రవర్సీపై దీపికా పదుకోన్ రియాక్షన్ - ఒక్క లైక్‌తో...

వీడియోలు

IAS Officers | హిమాచల్‌లో IAS పోస్టుల కోత.. AP, Telanganaలో పెంపు! అసలు కారణమేంటి?
Gundenininda Gudigantalu Serial August 21 | ప్రభావతికి తిక్క కుదిర్చిన మీనా, శృతి
Formula1 Race Car Exhibition Andhra University | ఆంధ్రా యూనివర్శిటీలో ఫార్ములా-1 కారు
Konda Susmitha Vs Congress | ఉన్నమాటంటే ఉలిక్కిపడుతున్నారా..!?|
JAC Bopparaju Venkateswarlu Comments | మా జీతాలకే ఆదాయం మొత్తం సరిపోతోంది అనేది అబద్దం

ఫోటో గ్యాలరీ

వ్యక్తిగత కార్నర్

అగ్ర కథనాలు
టాప్ రీల్స్
AP Job Calendar: 10,060 ఉద్యోగాల భర్తీకి గ్రీన్ సిగ్నల్.. ఏపీ జాబ్‌ క్యాలెండర్‌ వచ్చేసింది
10,060 ఉద్యోగాల భర్తీకి గ్రీన్ సిగ్నల్.. ఏపీ జాబ్‌ క్యాలెండర్‌ వచ్చేసింది
CM Chandrababu: వచ్చే నెలలో అనకాపల్లి, విశాఖకు గోదావరి జలాలు! ఏపీ సీఎం చంద్రబాబు కీలక ప్రకటన!
వచ్చే నెలలో అనకాపల్లి, విశాఖకు గోదావరి జలాలు! ఏపీ సీఎం చంద్రబాబు కీలక ప్రకటన!
Veligonda Project: వెలిగొండ ప్రాజెక్టు తొలిదశ ప్రారంభానికి సర్వం సిద్ధం! నిర్వాసితులకు 250 కోట్ల అందజేసిన ముఖ్యమంత్రి చంద్రబాబు! 
వెలిగొండ ప్రాజెక్టు తొలిదశ ప్రారంభానికి సర్వం సిద్ధం! నిర్వాసితులకు 250 కోట్ల అందజేసిన ముఖ్యమంత్రి చంద్రబాబు! 
Sheik Sadiq Khan Arrest: పంచాయతీరాజ్ ఏఈ కుటుంబ ఆత్మహత్య కేసులో కీలక ముందడుగు! ఢిల్లీలో చిక్కిన రైఫిల్ షూటింగ్ కోచ్‌ సాధిక్ ఖాన్!
పంచాయతీరాజ్ ఏఈ కుటుంబ ఆత్మహత్య కేసులో కీలక ముందడుగు! ఢిల్లీలో చిక్కిన రైఫిల్ షూటింగ్ కోచ్‌ సాధిక్ ఖాన్!
Lok Sabha Delimitation Freeze: డీలిమిటేషన్‌కు కాంగ్రెస్ నో - 50 ఏళ్లుగా 90 కోట్లు పెరిగిన జనాభా - మరి ఎంపీ సీట్లు పెరగొద్దా?
డీలిమిటేషన్‌కు కాంగ్రెస్ నో - 50 ఏళ్లుగా 90 కోట్లు పెరిగిన జనాభా - మరి ఎంపీ సీట్లు పెరగొద్దా?
iPhone Crimes India: ఐఫోన్ మోజులో ముక్కలవుతున్న భారతీయ కుటుంబాలు! రోజురోజుకు పెరుగుతున్న హత్యలు, ఆత్మహత్యలు!
ఐఫోన్ మోజులో ముక్కలవుతున్న భారతీయ కుటుంబాలు! రోజురోజుకు పెరుగుతున్న హత్యలు, ఆత్మహత్యలు!
Revanth Reddy US Tour Cancellation : రేవంత్‌కు కావాల్సిందే కేంద్రం చేసిందా ? - అమెరికా టూర్ పర్మిషన్ క్యాన్సిల్ వెనుక రాజకీయం ఉందా?
రేవంత్‌కు కావాల్సిందే కేంద్రం చేసిందా ? - అమెరికా టూర్ పర్మిషన్ క్యాన్సిల్ వెనుక రాజకీయం ఉందా?
Deepika Padukone : ప్రభాస్ స్పిరిట్ కాంట్రవర్సీపై దీపికా పదుకోన్ రియాక్షన్ - ఒక్క లైక్‌తో...
ప్రభాస్ స్పిరిట్ కాంట్రవర్సీపై దీపికా పదుకోన్ రియాక్షన్ - ఒక్క లైక్‌తో...
Embed widget