అన్వేషించండి

Prakash Raj : రాముడిది నార్త్... రావణుడిది సౌత్ - రామాయణంపై సెటైర్స్... ప్రకాష్ రాజ్‌పై క్రిమినల్ కేసు

Prakash Raj Comments : విలక్షణ నటుడు ప్రకాష్ రాజ్‌పై కేసు నమోదైనట్లు తెలుస్తోంది. ఓ ప్రైవేట్ ఈవెంట్‌లో పురాణ గాథలను వక్రీకరిస్తూ రామలక్ష్మణులపై ఆయన చేసిన కామెంట్స్‌పై వివాదం నెలకొంది.

Prakash Raj faces Legal Action Over His Comments On Ramayana : విలక్షణ నటుడు ప్రకాష్ రాజ్ మరోసారి కాంట్రవర్షియల్ కామెంట్స్ చేశారు. రామాయణం, భారతదేశంలోని సామాజిక పరిస్థితులపై ఆయన చేసిన కామెంట్స్ దేశవ్యాప్తంగా చర్చకు దారితీశాయి. తాజాగా ఓ కార్యక్రమంలో మాట్లాడిన ఆయన... రామలక్ష్మణులు వలస కూలీలని కామెంట్స్ చేశారు.

ప్రకాష్ రాజ్ ఏమన్నారంటే?

'రామలక్ష్మణులు దక్షిణాదిలో ఓ పొలంలోకి ప్రవేశించి పండ్లను దొంగిలించి తిన్నారు. ఆ పొలం యజమాని గిరిజనుడైన రావణుడు. పండ్ల దొంగతనంపై ప్రశ్నించడంతో  వివాదం పెద్దదైంది. GSTతో కలిపి 2 వేల డాలర్లు కట్టాలని శూర్పణఖ చెప్పింది.' అంటూ ఓ ప్రైవేట్ ఈవెంట్‌లో కాంట్రవర్శీ కామెంట్స్ చేశారు. ప్రస్తుతం ఈ వీడియో వైరల్ అవుతుండగా... ఆయన వ్యాఖ్యలపై హిందూ సంఘాలు మండిపడుతున్నాయి. సోషల్ మీడియాలోనూ ఆయనపై తీవ్ర విమర్శలు వ్యక్తం చేస్తున్నారు.

శ్రీరాముడు ఉత్తరాదికి చెందినవాడని... రావణుడు దక్షిణాదికి చెందినవాడని కామెంట్ చేశారు ప్రకాష్ రాజ్. ఎవరినీ ఏదీ చేయాలంటూ ఫోర్స్ చెయ్యకూడదంటూ సెటైరికల్‌గా పురాణ గాథలను వక్రీకరిస్తూ మాట్లాడారంటూ నెటిజన్లు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. అంతే కాకుండా దేశంలో ప్రస్తుత రాజకీయ పరిస్థితులు, గిరిజనలు హక్కులు, మైనారిటీల స్థితిగతుల గురించి కూడా తీవ్ర కామెంట్స్ చేశారు.

Also Read : 'ఎట్టా ఎట్టా' అదరగొట్టిన అఖిల్, భాగ్యశ్రీ జోడీ - లెనిన్ విలేజ్ లవ్ సాంగ్ క్యూట్ లిరిక్స్

కేసు నమోదు

ప్రకాష్ రాజ్ కామెంట్స్‌పై పోలీసులకు వరుసగా ఫిర్యాదులు అందాయి. పలు హిందూ సంఘాల ఫిర్యాదు మేరకు ఆయనపై వివిధ సెక్షన్ల కింద క్రిమినల్ కేసులు నమోదైనట్లు తెలుస్తోంది. మతపరమైన మనోభావాలు కించపరిచారని, సమాజంలో విధ్వేషాలు రెచ్చగొట్టేలా కామెంట్ చేశారంటూ ఆయనపై కొన్ని సంఘాల వారు మండిపడుతున్నారు. ఆయన్ను అరెస్ట్ చేయాలంటూ సోషల్ మీడియా వేదికగా డిమాండ్స్ వినిపిస్తున్నాయి.

గతంలోనూ ప్రకాష్ రాజ్ పలు అంశాలపై కుండబద్దలు కొట్టినట్లు మాట్లాడగా... వివాదానికి దారితీశాయి. ఈసారి ఏకంగా రామాయణం, సున్నితమైన అంశాలపైనే సెటైరికల్‌గా మాట్లాడడం చర్చనీయాంశమైంది. ఎవరి నమ్మకాలు వారివని... కోట్లాది మంది దేవుడిలా భావించే రామునిపై అవహేళనగా మాట్లాడడం సరికాదంటూ నెటిజన్లు ఆయనపై మండిపడుతున్నారు.

About the author Ganesh Guptha

గణేష్ గుప్త గత రెండున్నరేళ్లుగా ABPలో పని చేస్తున్నారు. ఐదేళ్లుగా జర్నలిజంలో ప్రముఖ తెలుగు మీడియా ఛానళ్లలో పని చేసిన ఎక్స్‌పీరియన్స్ ఉంది. ప్రముఖ మీడియా సంస్థలు ఈటీవీ భారత్, Way2News, Lokal యాప్స్‌లో కంటెంట్ రైటర్‌గా సేవలు అందించారు.

Read More

టాప్ హెడ్ లైన్స్

Jana Nayagan Collections: సోమవారం వచ్చింది పది కోట్లే... ఐదు రోజుల్లో 'జన నాయకుడు' టోటల్ కలెక్షన్స్ ఎంతంటే?
Jana Nayagan Five Days Collection: బాక్సాఫీస్‌లో విజయ్‌కు ఎదురీత... ఐదు రోజుల్లో ఎన్ని కోట్లు వచ్చాయంటే?
Chennai Love Story Collections: వీకెండ్ తర్వాత చెన్నై లవ్ స్టోరీ కలెక్షన్లు ఎలా ఉన్నాయ్? సోమవారం ఎన్ని కోట్లు వచ్చాయంటే? 
Chennai Love Story Four Days Collection - చెన్నై లవ్ స్టోరీ కలెక్షన్లు... నాలుగో రోజు ఎంత వచ్చిందంటే?
Pavala Shyamala: ప్రముఖ నటి పావలా శ్యామల కన్నుమూత... చివరి రోజుల్లో ఎవరికీ అటువంటి దుస్థితి రాకూడదు
ప్రముఖ నటి పావలా శ్యామల కన్నుమూత... చివరి రోజుల్లో ఎవరికీ అటువంటి దుస్థితి రాకూడదు
Tollywood Stars Injured: జూనియర్ ఎన్టీఆర్‌ సహా టాలీవుడ్ స్టార్‌ హీరోలకు గాయాల బెడద! ఆందోళనలో అభిమానులు!
జూనియర్ ఎన్టీఆర్‌ సహా టాలీవుడ్ స్టార్‌ హీరోలకు గాయాల బెడద! ఆందోళనలో అభిమానులు!

వీడియోలు

Ashes Test Match To Be Hosted In India? | ఇండియాలో 'యాషెస్' టెస్ట్ మ్యాచ్?
Serial Actress Preethi Srinivas Real Life Facts | సీరియల్ నటి ప్రీతి శ్రీనివాస్ రియల్ లైఫ్ సీక్రెట్స్
Vaibhav Suryavanshi Creates World Record | 15 ఏళ్ల వయసులో వైభవ్ సూర్యవంశీ వరల్డ్ రికార్డ్
PM Modi Gains 10 Lakh Followers In 12 Hours | పీఎం మోదీ సోషల్ మీడియాలో రికార్డ్
PM Modi Midnight Statement on Paper Leak | పేపర్ లీకేజీలపై మోదీ అర్ధరాత్రి ప్రకటన

ఫోటో గ్యాలరీ

వ్యక్తిగత కార్నర్

అగ్ర కథనాలు
టాప్ రీల్స్
Team India Squad: శ్రీలంకతో టెస్ట్ సిరీస్‌కు భారత జట్టు ప్రకటించిన BCCI - రవీంద్ర జడేజా రీఎంట్రీ
శ్రీలంకతో టెస్ట్ సిరీస్‌కు భారత జట్టు ప్రకటించిన BCCI - రవీంద్ర జడేజా రీఎంట్రీ
Telangana ACB Raids: తెలంగాణ ఏసీబీ భారీ స్కెచ్ - ఐఏఎస్, ఐపీఎస్, రెవెన్యూ అధికారులపై దాడులకు రంగం సిద్ధం - తిమింగలాలపైనే గురి?
తెలంగాణ ఏసీబీ భారీ స్కెచ్ - ఐఏఎస్, ఐపీఎస్, రెవెన్యూ అధికారులపై దాడులకు రంగం సిద్ధం - తిమింగలాలపైనే గురి?
Crop Insurance: పంటల బీమాకు మరో 3 రోజులే డెడ్‌లైన్.. ఎల్‌నినో ముప్పు ఉన్నా తక్కువగా రైతుల నమోదు
పంటల బీమాకు మరో 3 రోజులే డెడ్‌లైన్.. ఎల్‌నినో ముప్పు ఉన్నా తక్కువగా రైతుల నమోదు
Vizianagaram Road Accident: దైవదర్శనానికి వెళ్తుండగా విషాదం.. వ్యాన్‌ను ఢీకొట్టిన లారీ, ముగ్గురు మృతి, 13 మందికి గాయాలు
దైవదర్శనానికి వెళ్తుండగా విషాదం.. వ్యాన్‌ను ఢీకొట్టిన లారీ, ముగ్గురు మృతి, 13 మందికి గాయాలు
"63 కోర్ట్ ధిక్కార కేసులు భూ మాఫియావే!" - హైకోర్టు తీర్పుపై HYDRA క‌మిష‌న‌ర్ రంగనాథ్ వివరణ
AP Telangana Rain Alert: తీరం దాటనున్న వాయుగుండం.. తెలంగాణలో 8 జిల్లాలకు ఎల్లో అలర్ట్.. ఏపీలో ఆ జిల్లాలకు పిడుగుల వార్నింగ్
తీరం దాటనున్న వాయుగుండం.. తెలంగాణలో 8 జిల్లాలకు ఎల్లో అలర్ట్.. ఏపీలో అక్కడ పిడుగులు పడే అవకాశం
Kishan ReddY Latest News:
"రేవంత్ రెడ్డి హయాంలో ప్రశ్నపత్రాల లీకేజ్‌- రాజీనామా చేయాలి" కేంద్రమంత్రి కిషన్ రెడ్డి డిమాండ్ 
Blood Pressure Tablets : బీపీ మందులు (High BP Medicine) ఎప్పుడు వేసుకుంటే మంచిది? పరగడుపునా.. తిన్న తర్వాతా?
బీపీ మందులు (High BP Medicine) ఎప్పుడు వేసుకుంటే మంచిది? పరగడుపునా.. తిన్న తర్వాతా?
Embed widget