Rajamouli Tweet On SSMB29: మహేష్ మూవీపై మొదటిసారి నోరు విప్పిన రాజమౌళి... నవంబర్‌లో తగలబడిపోద్ది!
SSMB29 Latest News Updates: సూపర్ స్టార్ మహేష్ బాబు సినిమా గురించి దర్శక ధీరుడు రాజమౌళి మొదటిసారి నోరు విప్పారు. మహేష్ లుక్, కథ, తన ప్లాన్ గురించి వివరించారు. ఆయన ఏమన్నారంటే?

సూపర్ స్టార్ మహేష్ బాబు (Mahesh Babu) కథానాయకుడిగా తాను దర్శకత్వం వహిస్తున్న గ్లోబ్ ట్రాటర్ (Globe Trotter) గురించి దర్శక ధీరుడు ఎస్ఎస్ రాజమౌళి (SS Rajamouli) మొదటిసారి నోరు విప్పారు. మహేష్ పాస్ పోర్ట్ సీజ్ చేస్తున్నారు వీడియో షేర్ చేయడం, లొకేషన్స్ రెక్కీ కోసం ఆఫ్రికన్ కంట్రీలకు వెళ్లిన వీడియోలు పోస్ట్ చేయడం తప్ప ఇప్పటి వరకు ఈ సినిమా (SSMB29) గురించి నేరుగా ఆయన ట్వీట్ చేసింది లేదు. మహేష్ బాబు పుట్టినరోజు సందర్భంగా ప్రీ లుక్ విడుదల చేయడం పాటు తన విజన్ గురించి కొంచెం వివరించారు. ఇంతకీ రాజమౌళి ఏమన్నారంటే?
నవంబర్ వరకు వెయిట్ చేయండి!
మహేష్ బాబు బర్త్ డే సందర్భంగా అభిమానులకు రాజమౌళి ఓ స్పెషల్ గిఫ్ట్ ఇచ్చారు. ప్రీ లుక్ విడుదల చేశారు. అంతకు ముందు మరో పోస్ట్ చేశారు.
''మహేష్ అభిమానులతో పాటు ఇండియాలోనూ, ప్రపంచవ్యాప్తంగా ఉన్న ప్రియమైన సినిమా ప్రేమికులకు... మేం (అంటే మహేష్ బాబుతో పాటు టీం) చిత్రీకరణ ప్రారంభించి కొన్ని రోజులైంది. సినిమా గురించి తెలుసుకోవాలని మీరు చూపిస్తున్న ఆసక్తిని అభినందిస్తున్నా. అయితే... ఈ సినిమా స్టోరీ, స్కోప్ చాలా పెద్దది. ఒక్క ఫోటోలో చూపించేది కాదు... ఒక్క సమావేశంలో వివరించేది కాదు. మేం సృష్టిస్తున్న ప్రపంచాన్ని చూపించేందుకు ఓ అద్భుతాన్ని ప్లాన్ చేస్తున్నా. నవంబర్ వరకూ వెయిట్ చేయండి. ఇప్పటి వరకు చూడనటువంటి ఒక అద్భుతాన్ని మీ కళ్ళ ముందుకు తీసుకొస్తాం'' అని రాజమౌళి పేర్కొన్నారు.
Also Read: మహేష్ బాబు పర్సనల్ లైఫ్ గురించి గూగుల్‌లో ఎక్కువ మంది సెర్చ్ చేసిన ప్రశ్నలు... సమాధానాలు తెల్సా?
For all the admirers of my #GlobeTrotter… pic.twitter.com/c4vNXYKrL9
— rajamouli ss (@ssrajamouli) August 9, 2025
SSMB29 సినిమాలో రుద్ర పాత్రలో మహేష్ బాబు నటిస్తున్నట్లు సమాచారం. ఆ పేరు రివీల్ చేయలేదు గానీ మహేష్ ప్రీ లుక్ రిలీజ్ చేశారు. అందులో మహేష్ మెడలో శివుని డమరుకం, నామాలతో పాటు నంది, రుద్రాక్ష సైతం ఉన్నాయి. ఈ ప్రీ లుక్ సినిమాపై అంచనాలు మరింత పెంచిందని చెప్పడంలో ఎటువంటి సందేహం అవసరం లేదు. దుర్గా ఆర్ట్స్ పతాకంపై కేఎల్ నారాయణ ప్రొడ్యూస్ చేస్తున్న ఈ సినిమాలో ప్రియాంక చోప్రా, పృథ్వీరాజ్ సుకుమారన్, ఆర్ మాధవన్ నటిస్తున్నారు. ఈ చిత్రానికి ఆస్కార్ పురస్కార గ్రహీత ఎంఎం కీరవాణి సంగీత దర్శకుడు.
Also Read: రియల్ హీరో... లిటిల్ హార్ట్స్ సేవియర్ మహేష్ బాబు - సూపర్ స్టార్ ఫౌండేషన్ నుంచి సాయం ఇలా పొందొచ్చు!
The First Reveal in November 2025… #GlobeTrotter pic.twitter.com/MEtGBNeqfi
— rajamouli ss (@ssrajamouli) August 9, 2025





















