SSMB29 Update: మహేష్, రాజమౌళి 'SSMB29' అప్డేట్ - నవంబరులో ఓకే... సర్‌ప్రైజ్ ఆ రోజే!
Mahesh Babu: మహేష్ బాబు 'SSMB29' మూవీపై నవంబరులో బిగ్ సర్ ప్రైజ్ ఇవ్వనున్నట్లు దర్శక ధీరుడు రాజమౌళి అనౌన్స్ చేసిన సంగతి తెలిసిందే. మరి అది ఏ రోజున అనే ఆసక్తి అందరిలోనూ నెలకొంది.

SSMB29 Movie Title Glimpse Release Date: సూపర్ స్టార్ మహేష్ బాబు, దర్శక ధీరుడు రాజమౌళి కాంబోలో పాన్ వరల్డ్ అడ్వెంచర్ థ్రిల్లర్ తెరకెక్కుతున్న సంగతి తెలిసిందే. శుక్రవారం జక్కన్న బర్త్ డే సందర్భంగా ప్రస్తుతం సోషల్ మీడియాలో 'SSMB29' ట్రెండ్ అవుతోంది. ఈ మూవీ అనౌన్స్‌మెంట్ తప్ప పూజా కార్యక్రమాల నుంచి నటీనటులు అన్నీ కూడా ఫుల్ కాన్ఫిడెన్షియల్‌గా ఉంచారు రాజమౌళి. రీసెంట్‌గా మహేష్ బర్త్ డే సందర్భంగా ప్రీ లుక్‌తో నవంబరులో బిగ్ సర్‌ప్రైజ్ ఉంటుందని అనౌన్స్ చేశారు.
ఆ రోజునే బిగ్ సర్‌ప్రైజ్?
బాలీవుడ్ మీడియా నివేదికల ప్రకారం... 'SSMB29' బిగ్ సర్ ప్రైజ్ నవంబర్ 16న ఉంటుందని తెలుస్తోంది. తన మూవీ 'Globe Trotter' అంటూ హింట్ ఇచ్చారు రాజమౌళి. ప్రపంచవ్యాప్తంగా విస్తృతంగా ప్రయాణించే వ్యక్తుల గురించి చెప్పే సందర్భంలో ఈ పదాన్ని వాడతారు. 'ప్రపంచ పర్యాటకుడు', లేదా 'భూగోళాన్ని చుట్టే వ్యక్తి' అని అర్థం. ఆఫ్రికన్ అడవుల నేపథ్యంలో సాగే సాహస యాత్రగా ఈ మూవీ ఉండబోతున్నట్లు సమాచారం. ఆ రోజున ఫస్ట్ లుక్, టైటిల్‌తో పాటు గ్లింప్స్ కూడా అనౌన్స్ చేస్తారనే టాక్ వినిపిస్తోంది. గ్లింప్స్‌లోనే రిలీజ్ డేట్ కూడా అనౌన్స్ చేయనున్నారని సమాచారం.
Also Read: ఓటీటీలోకి హారర్ థ్రిల్లర్ 'కిష్కింధపురి' - అఫీషియల్ స్ట్రీమింగ్ డేట్... టీవీల్లోనూ వచ్చేస్తోంది
'వారణాసి' సెట్
ప్రస్తుతం ఈ మూవీ షూటింగ్ శరవేగంగా సాగుతోంది. ఇప్పటికే ఒడిశా, కెన్యా, నైరోబీ ప్రాంతాల్లో షూటింగ్ షెడ్యూల్ కంప్లీట్ చేసుకోగా తాజాగా హైదరాబాద్ రామోజీ ఫిలిం సిటీలో షూటింగ్ సాగుతోంది. దాదాపు రూ.60 కోట్లతో 'వారణాసి' టెంపుల్ సెట్ వేసినట్లు టాక్ వినిపిస్తోంది. ఇక మహేష్ బాబుపై కీలక సీన్స్ చిత్రీకరించనున్నట్లు సమాచారం. రాబోయే రోజుల్లో మహేష్, ప్రియాంక చోప్రాలపై హై ఎనర్జీ ఫోక్ నృత్య గీతం ఉంటుందని తెలుస్తోంది. కాన్సెప్ట్, ట్రయల్స్ ఇప్పటికే పూర్తైనట్లు సమాచారం. ఈ పాటకు రాజు సుందరం కొరియోగ్రఫీ చేస్తారని టాక్ వినిపిస్తోంది. వీటితో పాటు మరో 2 సాంగ్స్, భారీ పోరాట సన్నివేశాలు జక్కన్న ప్లాన్ చేసినట్లు సమాచారం.
టైటిల్ అదేనా?
ఇక ఈ మూవీకి 'వారణాసి' అనే టైటిల్‌నే ఫిక్స్ చేస్తారని తెలుస్తుండగా ఇది హాట్ టాపిక్‌గా మారింది. ఇక 'జెన్ 63', 'గ్లోబ్ ట్రాటర్' అనే పదాలు ట్రెండ్ అవుతున్నాయి. ఆఫ్రికన్ అడవుల నేపథ్యంలో సాగే ఓ సాహస ప్రయాణంగా బ్యాక్ డ్రాప్ మూవీ తెరకెక్కుతున్నట్లు తెలుస్తుండగా... డివోషనల్ టచ్ కూడా ఇస్తున్నట్లు తెలుస్తోంది. దీంతో పాటే మూవీలో సంజీవని ఓ కీలక అంశం కాబోతుందని సమాచారం. ఇండియానా జోన్స్ తరహాలో ప్రపంచాన్నే చుట్టేసే ఓ సాహసికుడిగా మహేష్ కనిపించనున్నారట.
ఇప్పటివరకూ 'SSMB29' ప్రాజెక్ట్ గురించి రాజమౌళి ఎలాంటి విషయాలు బహిర్గతం చేయలేదు. సినిమా గురించి ఏ చిన్న బజ్ అయినా సోషల్ మీడియాలో నిమిషాల్లోనే ట్రెండ్ అవుతోంది. రీసెంట్‌గా సెట్స్ నుంచి ఫోటో లీక్ ఘటనలతో భద్రతను మరింత పెంచారు. మూవీలో మహేష్‌తో పాటు ప్రియాంక చోప్రా, ఆర్ మాధవన్, పృథ్వీరాజ్ సుకుమారన్ కీలక పాత్రలు పోషించనున్నారు. 2027లో మూవీ ప్రేక్షకుల ముందుకు తెచ్చేలా రాజమౌళి ప్లాన్ చేస్తున్నారు.





















