అన్వేషించండి

Sunaina: హాస్పిటల్ బెడ్​పై విశాల్ హీరోయిన్.. షాక్​లో ఫ్యాన్స్!

'రాజ రాజ చోర' హీరోయిన్ సునైన ఆస్పత్రి పాలయ్యారు. త్వరలో స్ట్రాంగ్ గా తిరిగొస్తానంటూ ఆమె సోషల్‌ మీడియాలో ఓ ఫోటోని పంచుకున్నారు.

కోలీవుడ్ హీరోయిన్ సునైన గురించి తెలుగు ప్రేక్షకులకు పరిచయం చేయాల్సిన అవసరం లేదు. ‘కుమార్ వ‌ర్సెస్ కుమారి’ అనే సినిమాతో టాలీవుడ్ లో ఎంట్రీ ఇచ్చిన ఈ బ్యూటీ.. స్ట్రెయిట్ తెలుగు సినిమాతో పాటుగా పలు డబ్బింగ్ చిత్రాలతో ఆకట్టుకుంది. 34 ఏళ్ళ వయసులోనూ క్రేజీ ఆఫర్స్ తో దూసుకుపోతోంది. అయితే చివరగా 'రాజ రాజ చోర'  సినిమాతో బ్లాక్ బస్టర్ హిట్ అందుకున్న ఈ భామ.. ఇప్పుడు ఆస్పత్రి పాలవ్వడం అభిమానులను ఆందోళనకు గురి చేస్తోంది. 

సోషల్‌ మీడియాలో యాక్టివ్‌ గా ఉండే నటి సునయన తాజాగా హాస్పిటల్ లో బెడ్ మీద పేషెంట్ లా పడుకొని ఉన్న ఓ ఫోటోని షేర్ చేసింది. అది కాస్త నెట్టింట వైరల్‌ గా మారింది. ఏ కారణంగా ఆస్పత్రిలో అడ్మిట్ అయ్యారనేది ఆమె చెప్పలేదుగానీ, ''నాకు కొంత సమయం ఇవ్వండి.. నేను త్వరలో స్ట్రాంగ్ గా తిరిగి వస్తాను'' అని పోస్ట్ చేసింది. ఇందులో ఆమె చేతికి సెలైన్‌ బాటిల్ ఎక్కించుకుంటూ, ఆక్సిజన్ పైప్ పెట్టుకొని ఉండటాన్ని చూసి ఫ్యాన్స్ షాక్ అవుతున్నారు. సునైనకు ఏం జరిగిందని ఆరాలు తీస్తున్నారు. ఏదేమైనా వీలైనంత త్వరగా కోలుకోవాలని ఆకాంక్షిస్తున్నారు. 

 
 
 
 
 
View this post on Instagram
 
 
 
 
 
 
 
 
 
 
 

A post shared by Sunainaa Yeellaa (@thesunainaa)

గతంలో హీరోయిన్‌ సునయన కనిపించడం లేదంటూ కోలీవుడ్‌లో ఓ వార్త వైరల్‌ అయిన సంగతి తెలిసిందే. ఆమెను ఎవరో గుర్తు తెలియ‌ని దుండ‌గ‌లు కిడ్నాప్‌ చేశారని పెద్ద ఎత్తున ప్రచారం జరిగింది. ఆమె మొబైల్ ఫోన్ కూడా రెండు రోజుల పాటు స్విచ్ ఆఫ్‌ లో ఉండటంతో, ఏమైందోన‌ని అభిమానులు కంగారు పడ్డారు. ఆమెను ర‌క్షించాలంటూ 'రెస్క్యూ సునైనా' అనే హ్యాష్ ట్యాగ్‌ ను సోష‌ల్ మీడియాలో ట్రెండింగ్ చేశారు. దీంతో తమిళనాడు పోలీసులు రంగంలోకి దిగి ఆమె కోసం గాలింపు చర్యలు కూడా చేపట్టారు. అయితే చివరకు అదంతా డ్రామా అనే విషయం బయటకు వచ్చింది. 

Also Read: 'భగవంత్ కేసరి'లో జరిగిన తప్పుకి క్షమాపణలు చెప్పిన అనిల్ రావిపూడి!

'రెజీనా' మూవీ ప్రమోషన్స్ కోసం సునయన చిత్ర బృందంతో కలిసి ఇలా నాటకం ఆడారని తెలిసి పోలీసులు, ఫ్యాన్స్ అందరూ షాకయ్యారు. సినిమా పబ్లిసిటీ కోసం కిడ్నాప్ డ్రామా చేయడంపై అప్పట్లో ఆమెపై పలు విమర్శలు వచ్చాయి. ఫ్యాన్స్ ఎమోషన్స్ తో ఆడుకున్నారని, దీనికి కారణమైన సునైనాతో పాటుగా మేకర్స్ పై చట్టపరమైన చర్యలు తీసుకోవాలని నెటిజన్లు మండిప‌డ్డారు. ఇప్పుడు ఆమె హాస్పిటల్ బెడ్ పై ఉన్న ఫోటో పోస్ట్ చేసినప్పటికీ, ఎలాంటి వివరాలు వెల్లడించకపోవడంతో ఒక్కొక్కరు ఒక్కోలా రియాక్ట్ అవుతున్నారు. అప్పుడు కిడ్నాప్ డ్రామా చేసినట్లే, ఇప్పుడు కూడా ఏదైనా మూవీ ప్రమోషన్స్‌ కోసం ఇలా చేస్తున్నారా? అంటూ పలువురు నెటిజన్లు కామెంట్లు చేస్తున్నారు. మరికొందరు మాత్రం షూటింగ్ లో గాయపడి ఉండొచ్చని, ఆమె నిజంగానే ఆరోగ్య సమస్యలతో బాధ పడుతోందని, త్వరగా కోలుకోవాలని కోరుకుంటున్నారు. 

 
 
 
 
 
View this post on Instagram
 
 
 
 
 
 
 
 
 
 
 

A post shared by Sunainaa Yeellaa (@thesunainaa)

కాగా, 'వాళండిల్‌ కాల్తేనే' అనే తమిళ సినిమాతో తెరంగేట్రం చేసిన సునైనా.. 2005లో 'కుమార్ వర్సెస్ కుమారి' చిత్రంతో టాలీవుడ్‌ లోకి అడుగుపెట్టింది. ఆ తర్వాత తెలుగులో 'సమ్‌ థింగ్ స్పెషల్' '10థ్ క్లాస్' వంటి సినిమాల్లో నటించింది. శ్రీవిష్ణుకు జోడీగా నటించిన 'రాజ రాజ చోర' సినిమా విజయం సాధించడమే కాదు, ఆమెను మంచి పేరు తెచ్చిపెట్టింది. అలానే విశాల్ తో కలిసి చేసిన ‘లాఠీ’ చిత్రంలో మెప్పించింది. హీరో నాని నిర్మించిన 'మీట్ క్యూట్' ఆంథాలజీ సిరీస్ లోనూ భాగమైంది. ఆమె తాజా చిత్రం ‘రెజీనా’ అమెజాన్‌ ప్రైమ్‌ వీడియో ఓటీటీలో స్ట్రీమింగ్‌ అవుతోంది.

Also Read: నందమూరి హీరో సినిమాలో విజయశాంతి!

ముఖ్యమైన, మరిన్ని ఆసక్తికర కథనాల కోసం ‘టెలిగ్రామ్’లో ‘ఏబీపీ దేశం’లో జాయిన్ అవ్వండి.
Join Us on Telegram: https://t.me/abpdesamofficial

ఇంకా చదవండి
Sponsored Links by Taboola

టాప్ హెడ్ లైన్స్

IND vs SA 3rd T20: ధర్మశాలలో భారత్- దక్షిణాఫ్రికా మూడో టీ20.. పిచ్, వెదర్ రిపోర్ట్ సహా లైవ్ స్ట్రీమింగ్ వివరాలు
ధర్మశాలలో భారత్- దక్షిణాఫ్రికా మూడో టీ20.. పిచ్, వెదర్ రిపోర్ట్ సహా లైవ్ స్ట్రీమింగ్ వివరాలు
Pawan Kalyan Helps Cricketers: అంధ క్రికెటర్లు దీపిక, ప్లేయర్ కరుణ కుమారి కుటుంబాలకు అండగా నిలిచిన పవన్ కళ్యాణ్
అంధ క్రికెటర్ల కుటుంబాలకు అండగా నిలిచిన డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్
The Paradise : నేచరల్ స్టార్ నాని 'ది ప్యారడైజ్' మేకింగ్ వీడియో - రక్తం పడిన తర్వాతే హిస్టరీ ఓపెన్
నేచరల్ స్టార్ నాని 'ది ప్యారడైజ్' మేకింగ్ వీడియో - రక్తం పడిన తర్వాతే హిస్టరీ ఓపెన్
Premante OTT : ఓటీటీలోకి లవ్ రొమాంటిక్ కామెడీ 'ప్రేమంటే' - ఎప్పటి నుంచి స్ట్రీమింగ్ అంటే?
ఓటీటీలోకి లవ్ రొమాంటిక్ కామెడీ 'ప్రేమంటే' - ఎప్పటి నుంచి స్ట్రీమింగ్ అంటే?

వీడియోలు

Abhishek Sharma to Break Virat Record | కోహ్లీ అరుదైన రికార్డుపై కన్నేసిన అభిషేక్
India vs South Africa 3rd T20 | భారత్ x సౌతాఫ్రికా మూడో టీ20
Robin Uthappa on Gambhir Ind vs SA | గంభీర్ పై ఉత్తప్ప కామెంట్స్
Suryakumar Yadav Form in SA T20 Series | సూర్య కుమార్ యాదవ్ పై ట్రోల్స్
Leonel Messi Kolkata Tour Hightension | కోల్ కతా సాల్ట్ లేక్ స్టేడియంలో తీవ్ర ఉద్రిక్తత | ABP Desam

ఫోటో గ్యాలరీ

ABP Premium

వ్యక్తిగత కార్నర్

అగ్ర కథనాలు
టాప్ రీల్స్
IND vs SA 3rd T20: ధర్మశాలలో భారత్- దక్షిణాఫ్రికా మూడో టీ20.. పిచ్, వెదర్ రిపోర్ట్ సహా లైవ్ స్ట్రీమింగ్ వివరాలు
ధర్మశాలలో భారత్- దక్షిణాఫ్రికా మూడో టీ20.. పిచ్, వెదర్ రిపోర్ట్ సహా లైవ్ స్ట్రీమింగ్ వివరాలు
Pawan Kalyan Helps Cricketers: అంధ క్రికెటర్లు దీపిక, ప్లేయర్ కరుణ కుమారి కుటుంబాలకు అండగా నిలిచిన పవన్ కళ్యాణ్
అంధ క్రికెటర్ల కుటుంబాలకు అండగా నిలిచిన డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్
The Paradise : నేచరల్ స్టార్ నాని 'ది ప్యారడైజ్' మేకింగ్ వీడియో - రక్తం పడిన తర్వాతే హిస్టరీ ఓపెన్
నేచరల్ స్టార్ నాని 'ది ప్యారడైజ్' మేకింగ్ వీడియో - రక్తం పడిన తర్వాతే హిస్టరీ ఓపెన్
Premante OTT : ఓటీటీలోకి లవ్ రొమాంటిక్ కామెడీ 'ప్రేమంటే' - ఎప్పటి నుంచి స్ట్రీమింగ్ అంటే?
ఓటీటీలోకి లవ్ రొమాంటిక్ కామెడీ 'ప్రేమంటే' - ఎప్పటి నుంచి స్ట్రీమింగ్ అంటే?
Top Mileage Cars in India: వ్యాగన్ ఆర్ నుంచి టాటా పంచ్ వరకు.. రూ.10 లక్షలలోపు అధిక మైలేజ్ ఇచ్చే కార్లు
వ్యాగన్ ఆర్ నుంచి టాటా పంచ్ వరకు.. రూ.10 లక్షలలోపు అధిక మైలేజ్ ఇచ్చే కార్లు
Maruti Brezza లేదా Nissan Magnite లలో ఏ SUV బెటర్- ధర, ఫీచర్లు చూసి డిసైడ్ అవ్వండి
Maruti Brezza లేదా Nissan Magnite లలో ఏ SUV బెటర్- ధర, ఫీచర్లు చూసి డిసైడ్ అవ్వండి
Shocking News: పాఠాలు వింటూ కుప్పకూలిన విద్యార్ధిని.. కోన‌సీమ జిల్లా రామ‌చంద్ర‌పురంలో విషాదం
పాఠాలు వింటూ కుప్పకూలిన విద్యార్ధిని.. కోన‌సీమ జిల్లా రామ‌చంద్ర‌పురంలో విషాదం
Masaka Masaka Song : ఓల్డ్ రొమాంటిక్ 'మసక మసక చీకటిలో...' - పాప్ సింగర్ స్మిత ర్యాప్ మిక్స్ విత్ న్యూ ట్రెండ్
ఓల్డ్ రొమాంటిక్ 'మసక మసక చీకటిలో...' - పాప్ సింగర్ స్మిత ర్యాప్ మిక్స్ విత్ న్యూ ట్రెండ్
Embed widget