By: ABP Desam | Updated at : 27 May 2023 06:51 PM (IST)
రాహుల్ రవీంద్రన్, చిన్మయి, 'వెన్నెల' కిశోర్ (Image Credit: ETv WIN/Twitter)
రాహుల్ రవీంద్రన్, చిన్మయి శ్రీపాద దంపతుల గురించి తెలుగు ప్రేక్షకులకు ప్రత్యేకంగా పరిచయం చేయాల్సిన అవసరం లేదు. 'అందాల రాక్షసి' సినిమాతో టాలీవుడ్ లో అడుగుపెట్టిన రాహుల్.. మొదట హీరోగా, ఆ తర్వాత డైరెక్టర్ గా పేరు తెచ్చుకున్నాడు. మరోవైపు సింగర్ గా, డబ్బింగ్ ఆర్టిస్టుగా చిన్మయి తనకంటూ ప్రత్యేకమైన గుర్తింపు తెచ్చుకుంది. మీటూ ఉద్యమం సమయంలో తాను ఎదుర్కొన్న కాస్టింగ్ కౌచ్ అనుభవం గురించి బహిరంగంగా వెల్లడించి సంచలనం రేపింది. సమాజంలో స్త్రీలకు జరుగుతున్న అన్యాయాలపై, సినీ ఇండస్ట్రీలో అమ్మాయిలు ఎదుర్కొంటున్న లైంగిక వేదింఫులపై గళం విప్పుతూ, సోషల్ మీడియాలో ఫెమినిస్టుగా ముద్ర వేయించుకుంది. రెండు భిన్న స్వభావాలు కలిగిన వ్యక్తులుగా కనిపించే రాహుల్, చిన్మయిలు లవ్ మ్యారేజ్ చేసుకోవడం అప్పట్లో అందరినీ ఆశ్చర్యపరిచింది. అయితే తాము అసలు పెళ్లి చేసుకోవాలని అనుకోలేదని ఈ జంట తాజాగా వెల్లడించారు.
స్టార్ కమెడియన్ వెన్నెల కిశోర్ ‘అలా మొదలైంది’ అనే టాక్ షోకి హోస్ట్ గా వ్యవహరిస్తున్న సంగతి తెలిసిందే. సెలబ్రిటీ జంటలు గెస్టులుగా హాజరయ్యే ఈ ప్రోగ్రామ్ కి బుల్లితెర ప్రేక్షకుల నుంచి మంచి రెస్పాన్స్ లభిస్తోంది. లేటెస్టుగా ఈ కార్యక్రమంలో రాహుల్ రవీంద్రన్, చిన్మయి దంపతులు సందడి చేసారు. ఈ సందర్భంగా వారిద్దరి లవ్ స్టోరీ, దాంపత్య జీవితానికి సంబంధించి పలు విశేషాలను పంచుకున్నారు. మరో మూడు రోజుల్లో ప్రచారం కాబోతున్న ఈ ఎపిసోడ్ కు సంబంధించిన ప్రోమోని తాజాగా విడుదల చేసారు.
"మంచితనానికి మాయిశ్చరైజర్ పెడితే రాహుల్ రవీంద్రన్ అంటాం మేము.. సత్యానికి శానిటైజర్ పెడితే చిన్మయి.." అంటూ రాహుల్ రవీంద్రన్, చిన్మయి జంటను వెన్నెల కిశోర్ ఆహ్వానించడంతో ప్రారంభమైన ఈ ప్రోమో ఆకట్టుకుంటోంది. 'ప్లీజ్.. నన్ను టీవీ హోస్టుగా చూడండి.. కొంచం రెస్పెక్టబుల్ గా మాట్లాడండి' అంటూ కిషోర్ తనదైన శైలిలో రిక్వెస్ట్ చేస్తూ ప్రశ్నలు అడగడం స్టార్ట్ చేసాడు. రాహుల్ తన ప్రేమకథ గురించి చెబుతూ "డబ్బింగ్ చేస్తుంటే ఈ అబ్బాయి ఎవరో క్యూట్ ఉన్నాడు కదా అని తనకు అనిపించిందట.. పెళ్లి తర్వాత ఈ విషయం చెప్పింది" అని అనగా, పక్కనే ఉన్న చిన్మయి "అయ్యో, ఇదేంటో వాగుతున్నాడు" అంటూ క్యూట్ గా నవ్వేసింది.
"పెళ్లి వద్దనుకున్నా" అని చిన్మయి చెబుతుంటే.. "నేను తనను కలిసేముందు పెళ్లి వద్దనుకున్నా.. కళ్లల్లో కళ్లు పెట్టి ఒకటి చెప్పాను.." అని రాహుల్ అన్నాడు. అయితే "కళ్లల్లో కళ్లు పెట్టి ఏం చెప్పలేదు" అని చెప్పి చిన్మయి ఆటపట్టించింది. "అంత ఇంట్రెస్ట్ లేనప్పుడు నేను మాత్రం ఎందుకంత దిగజారిపోవాలి అని ఫిక్స్ అయిపోయాను.. అరగంట తర్వాత ఏదో కొడతా ఉంది" అని రాహుల్ చెప్పాడా.. "మనం ఎన్నో సార్లు దిగజారిపోయాం కదరా" అంటూ వెన్నెల కిశోర్ నవ్వులు పూయించాడు.
ఈ క్రమంలో వీరిద్దరూ హీరో సందీప్ కిషన్ వల్ల కలిశారనే విషయం వెల్లడైంది. "సందీప్ ఫుల్.. నువ్వు రాహుల్ ను కలవాలి, రాహుల్ ను మీట్ అవ్వాలి అని చెప్పి.." అని చిన్మయి ఏదో చెప్తుండగా.. "వీడు నా కోసం అక్కడ మార్కెటింగ్ చేస్తున్నాడు" అని రాహుల్ అన్నాడు. దీనికి వెన్నెల కిషోర్ రియాక్ట్ అవుతూ "మార్కెటింగ్ లో సందీప్ కిషన్ ది వేరే లెవల్ యాక్చువల్‌గా" అంటూ నవ్వించాడు. ఇక చిన్మయి 'గోవిందుడు అందరివాడేలే' సినిమాలోని లవ్ సాంగ్ పాడి ఆకట్టుకుంది. తన భర్త మొహానికి చేయి అడ్డుపెట్టి ముద్దు కూడా పెట్టింది.
Also Read : ఓ మై గాడ్, ఎన్టీఆర్ ఇన్ని సినిమాల్లో ద్విపాత్రాభినయం చేశారా? ఎన్నో తెలిస్తే షాకవుతారు!
ఈ సందర్భంగా రాహుల్ కు ఒక సీక్రెట్ ఇంస్టాగ్రామ్ అకౌంట్ ఉందని, సోలోగా యూరప్ ట్రిప్ కి వెళ్తుంటాడు అంటూ భార్యాభర్తల మధ్య పుల్లలు పెట్టే ప్రయత్నం చేసాడు వెన్నెల కిశోర్. ఇక చిన్మయికి నెలలు నిండిన తర్వాత జరిగిన విషయాల గురించి రాహుల్ చెప్పాడు. "ఏమీ కాదు నువ్వు పాడమ్మా అన్నారు.. ఈమెకు అనస్థీషియా ఇచ్చారు.. ఏం జరుగుతుందో తెలీదు.. చిన్మయి లోపల నుంచి పాడుతుంది.. ఆల్ మోస్ట్ నేను కళ్లు తిరిగి పడిపోయాను.. గ్రిప్తాని తీసుకొచ్చి చిన్ను పక్కన పెట్టగానే నవ్వింది.. పిల్లలను నా చేతిలో పెట్టగానే నేను ఔట్ బ్రో" అని రాహుల్ ఆ మధుర క్షణాలను గుర్తు చేసుకున్నారు. ఆ సమయంలో చిన్మయి కూడా చాలా సంతోషంగా వింటూ కనిపించింది. ఇలా ఈ ప్రోమో అలరిస్తోంది. మరి రాహుల్, చిన్మయిల ఫుల్ ఎపిసోడ్ ఎలా ఉంటుందో చూడాలి.
Read Also: 'లేచింది, నిద్ర లేచింది మహిళా లోకం' - ఎన్టీఆర్ సినిమాల్లో మహిళాభ్యుదయం
వరుణ్ తేజ్ మూవీకి భారీ డీల్ - 'ఆపరేషన్ వాలెంటైన్' నాన్ థియేట్రికల్ రైట్స్ అన్ని కోట్లా?
Bigg Boss 7 Telugu: దొంగ అనుకుంటారు నన్ను - రెండు నిమిషాలు పట్టదు, ఎత్తిపడేస్తా.. శోభాశెట్టితో శివాజీ గొడవ
BhagavanthKesari: గ్రౌండ్ ఫ్లోర్ బలిసిందా బే - బాలయ్య ఊరమాస్ అవతార్, 'భగవంత్ కేసరి' సర్ప్రైజ్ అదిరింది
Vijay Deverakonda - Rashmika: డార్లింగ్ అంటూ దేవరకొండ ట్వీట్ - నువ్వు ఎప్పటికీ బెస్ట్ అంటూ రష్మిక రిప్లై!
Siddharth: కర్ణాటకలో హీరో సిద్ధార్థ్‌కు ఘోర అవమానం, తమిళోడివి అంటూ వేదికపై ఉండగానే..
Byreddy Rajasekar Reddy: భువనేశ్వరితో బైరెడ్డి భేటీ - చంద్రబాబు అరెస్టుపై కీలక వ్యాఖ్యలు
Telangana BJP : తెలంగాణ ఎన్నికల కోసం 26 మందితో కేంద్ర కమిటీ - ఏపీ సోము వీర్రాజు, విష్ణువర్ధన్ రెడ్డికి చోటు !
Adilabad: గణేష్ లడ్డూని కొన్న ముస్లిం యువకుడు - రూ.1.2 లక్షలకు వేలంలో సొంతం
Kotamreddy : చంద్రబాబు అరెస్ట్‌పై వైసీపీలో మెజార్టీ నేతల వ్యతిరేకత - కోటంరెడ్డి కీలక వ్యాఖ్యలు !
/body>