Raghava Lawrence: అందుకే ఆ పాత్ర ఒప్పుకోలేదు: ‘విక్రమ్’లో విజయ్ సేతుపతి క్యారెక్టర్‌పై లారెన్స్ కామెంట్స్
తాజాగా రాఘవ లారెన్స్ కూడా తాను ‘విక్రమ్’ సినిమాలో ఎందుకు లేడు అన్న విషయంపై స్పందించాడు. అసలు తను ఆ సినిమా చేయకపోవడం వెనుక కారణం ఏంటో బయటపెట్టాడు.
ఒక హీరోను ఊహించుకొని దర్శకుడు కథ రాసుకుంటాడు. కానీ కొన్ని సందర్భాల్లో మాత్రమే వారు ఊహించుకున్న హీరోతో సినిమా చేయగలిగే అవకాశం లభిస్తుంది. డేట్స్ కుదరక, హీరోకు కథ నచ్చక లేక పాత్ర నచ్చక.. ఇలా చాలా కారణాల వల్ల వారు అనుకున్న హీరోతో సినిమా తెరకెక్కించలేపోతాడు దర్శకుడు. ఇలాంటి విషయాలపై హీరోలు, దర్శకులు అప్పుడప్పుడు స్పందిస్తూనే ఉంటారు. తాజాగా రాఘవ లారెన్స్ కూడా తాను ‘విక్రమ్’ సినిమాలో ఎందుకు లేడు అన్న విషయంపై స్పందించాడు. అసలు తను ఆ సినిమా చేయకపోవడం వెనుక కారణం ఏంటో బయటపెట్టాడు.
‘విక్రమ్’ సినిమాలో కమల్ హాసన్ హీరోగా నటించినా కూడా విజయ్ సేతుపతి, ఫాహద్ ఫాజిల్ క్యారెక్టర్స్‌కు కూడా సమానమైన ప్రాధాన్యత ఉంటుంది. విక్రమ్‌గా కమల్ పాత్రకు ఎంత ఆదరణ లభించిందో సంతానంగా విజయ్ సేతుపతి క్యారెక్టర్‌ను కూడా ప్రేక్షకులు అంతే ఇష్టపడ్డారు. ఇప్పటికే విజయ్ సేతుపతి విలన్‌గా పలు చిత్రాల్లో నటించాడు కానీ.. ‘విక్రమ్’లో సంతానం పాత్ర మాత్రం వేరే లెవెల్ అని తన ఫ్యాన్స్ అంటుంటారు. అయితే ముందుగా ఈ పాత్ర కోసం రాఘవ లారెన్స్‌ను అప్రోచ్ అయ్యాడట దర్శకుడు లోకేశ్ కనకరాజ్. ఈ విషయాన్ని లారెన్స్ కూడా ఇంతకు ముందు స్వయంగా ఒప్పుకున్నాడు. కానీ తను ఆ పాత్ర చేయకపోవడానికి కారణం ఏంటని తాజాగా బయటపెట్టాడు.
నెగిటివ్ షేడ్స్ ఉన్నాయని..
విజయ్ సేతుపతి చేసిన సంతానం అనే క్యారెక్టర్ డ్రగ్స్ మాఫియాను శాసించే వ్యక్తిగా మనకు కనిపిస్తాడు. అయితే ఆ పాత్రలో చాలా నెగిటివ్ షేడ్స్ ఉన్నాయని, చాలా వైలెన్స్ ఉందని, అలాంటి పాత్రను ఫ్యామిలీ ఆడియన్స్ యాక్సెప్ట్ చేయలేరని భావించి తాను సంతానం పాత్రను తిరస్కరించానని రాఘవ లారెన్స్ బయటపెట్టాడు. కానీ సంతానం క్యారెక్టర్‌లో ఎంత వైలెన్స్ ఉన్నా కూడా ఫ్యామిలీ ఆడియన్స్‌ను మాత్రం తన యాక్టింగ్‌తో నవ్వించగలిగాడు విజయ్ సేతుపతి. అదే పాత్ర లారెన్స్ చేస్తే ఎలా ఉంటుంది అన్న ఆలోచన కూడా రానివ్వకుండా చేశాడు. చాలామంది ప్రేక్షకులకు ‘విక్రమ్’లో నటించిన అందరు నటులలో విజయ్ సేతుపతి క్యారెక్టర్ ఫేవరెట్ అని చెప్పడంలో ఆశ్చర్యం లేదు.
లారెన్స్, లోకేశ్ ప్రాజెక్ట్ ఫిక్స్..
‘విక్రమ్’ కోసం లోకేశ్ కనకరాజ్‌తో కలిసి పనిచేయకపోయినా.. త్వరలోనే లారెన్స్, లోకేశ్ ఒక ప్రాజెక్ట్ కోసం చేతులు కలపనున్నట్టు టాక్ వినిపిస్తోంది. రత్నకుమార్ దర్శకత్వంలో లారెన్స్ నటించనున్న చిత్రానికి లోకేశ్ కనకరాజ్ స్టోరీ, స్క్రీన్‌ప్లే అందించనున్నట్టు సమాచారం. అక్టోబర్‌లో ఈ ప్రాజెక్ట్ సెట్స్‌పైకి వెళ్లనుంది. ఇక ప్రస్తుతం రాఘవ లారెన్స్ తాను నటించిన ‘చంద్రముఖి 2’ ప్రమోషన్స్‌లో బిజీగా ఉన్నాడు. లారెన్స్, కంగనా రనౌత్ జోడీగా నటించిన ఈ మూవీ సెప్టెంబర్ 15న ప్రేక్షకుల ముందుకు రానుంది. భారీ బడ్జెట్‌తో తెరకెక్కిన ఈ చిత్రాన్ని పాన్ ఇండియా స్థాయిలో విడుదల చేయడానికి మేకర్స్ ప్లాన్ చేస్తున్నారు. ఒకప్పుడు తమిళంతో పాటు తెలుగులో కూడా సెన్సేషన్ క్రియేట్ చేసిన ‘చంద్రముఖి’ లాంటి బ్లాక్‌బస్టర్ చిత్రానికి సీక్వెల్‌గా తెరకెక్కినా కూడా ‘చంద్రముఖి 2’పై ప్రేక్షకుల్లో పెద్దగా ఆసక్తి కనిపించడం లేదు. ఇప్పటికే విడుదలయిన పోస్టర్స్, పాటలు కూడా ఎక్కువగా వారిని ఆకట్టుకోలేకపోయాయి. మరి మూవీ విడుదల తర్వాత మౌత్ టాక్‌తో అయినా ప్రేక్షకులను ఆకట్టుకొని, కలెక్షన్స్ సాధిస్తుందేమో చూడాలి.
Also Read: సమంత ఎక్కడా? విజయ్ దేవరకొండకు స్టేజ్ మీదే నాగార్జున పంచ్
ముఖ్యమైన, మరిన్ని ఆసక్తికర కథనాల కోసం ‘టెలిగ్రామ్’లో ‘ఏబీపీ దేశం’లో జాయిన్ అవ్వండి.
Join Us on Telegram: https://t.me/abpdesamofficial