By: ABP Desam | Updated at : 11 Sep 2023 08:25 PM (IST)
Photo Credit : JigarthandaDoubleX/Twitter
సినీ ఇండస్ట్రీలో ప్రస్తుతం సీక్వెల్స్ ట్రెండ్ నడుస్తున్న విషయం తెలిసిందే. మన టాలీవుడ్ లో ఈ ట్రెండ్ కాస్త ఎక్కువగా ఉంది. అటు తమిళంలో కూడా కొన్ని సినిమాలకు సీక్వెల్స్ తెరకెక్కుతున్నాయి. ఈ క్రమంలోనే సుమారు 14 ఏళ్ల కింద తమిళంలో రిలీజై సంచలన విజయమందుకున్న 'జిగర్తాండ' మూవీకి సీక్వెల్ తెరకెక్కుతున్న విషయం తెలిసిందే. 'జిగర్తాండ డబుల్ ఎక్స్' పేరుతో వస్తున్న ఈ సీక్వెల్ అనౌన్స్మెంట్ వీడియో తోనే భారీ హైప్ ని క్రియేట్ చేసింది. రాఘవ లారెన్స్, ఎస్ జే సూర్య లీడ్ రోల్స్ లో నటిస్తున్న ఈ మూవీ టీజర్ ను తాజాగా విడుదల చేశారు మేకర్స్. ఈ సీక్వెల్ ను పాన్ ఇండియా లెవెల్ లో రూపొందిస్తున్నారు.
ఈ క్రమంలోనే తాజాగా చిత్ర టీజర్ ను సౌత్ లో ఉన్న పలువురు స్టార్స్ రిలీజ్ చేయడం విశేషం. తెలుగులో మహేష్ బాబు, తమిళంలో ధనుష్, మలయాళం లో దుల్కర్ సల్మాన్, కన్నడలో రక్షిత్ శెట్టి.. 'జిగర్తాండ డబుల్ ఎక్స్' టీజర్ ను లాంచ్ చేశారు. కార్తీక్ సుబ్బరాజ్ దర్శకత్వం వహిస్తున్న ఈ చిత్రంలో నిమిషా సజయన్ హీరోయిన్‌గా నటిస్తోంది. 2009లో వచ్చిన 'జిగర్తాండ'కి సిక్వెల్ గా వస్తున్న ఈ మూవీ టీజర్ మళ్లీ ఆ సినిమాను గుర్తు చేసేలా ఉంది. ఓ ఫిలిం మేకర్ గ్యాంగ్ స్టార్ చుట్టూ తిరిగే కథ ఇది. ఓ క్రైమ్ స్టోరీ కోసం వెతుకుతున్న డైరెక్టర్ కి రియల్ లైఫ్ గ్యాంగ్ స్టర్ తన జీవిత చరిత్రనే సినిమాగా తీయాలని చెప్పడంతో కథలో అసలు ట్విస్ట్ వస్తోంది.
ఇందులో డైరెక్టర్ పాత్రలో ఎస్ జె సూర్య, గ్యాంగ్ స్టర్ పాత్రలో రాఘవ లారెన్స్ నటించారు. తాజాగా విడుదలైన టీజర్ లో లారెన్స్ గన్స్ పట్టుకొని బీడీ తాగుతూ పక్కా మాస్ అవతార్లో కనిపించగా, SJ సూర్య సూట్ వేసుకొని స్టైలిష్ లుక్ లో ఆకట్టుకున్నారు. ఇక టీజర్ లో అన్ని భాషల ఆడియన్స్ కనెక్ట్ అయ్యేలా కేవలం ఇంగ్లీష్ డైలాగ్స్ మాత్రమే పెట్టారు. 1975లో జరిగిన కథగా ఈ సీక్వెల్ని తెరకెక్కించారు. దాంతో ఆ కాలంలోకి తీసుకెళ్లడానికి మేకర్స్ గట్టి ప్రయత్నాలు చేసినట్లు టీజర్ చూస్తే అర్థమవుతుంది. ఇక టీజర్ చివర్లో రాఘవ లారెన్స్ ఓ ఫన్నీ డైలాగ్ తో ఆకట్టుకున్నారు. పాన్ ఇండియా అనే దానిని పాండియా వెస్టర్న్ అంటూ లారెన్స్ చెప్పిన డైలాగ్ ఆకట్టుకుంది.
ఈ మూవీని తమిళం తో పాటు తెలుగు, హిందీ, కన్నడ, మలయాళ భాషల్లో విడుదల చేస్తున్నారు. కార్తీక్ సుబ్బరాజ్ ఈ సినిమాకి కథ, దర్శకత్వంతో పాటు నిర్మాతగానూ వ్యవహరిస్తున్నారు. తన సొంత బ్యానర్ స్టోన్ బెంచ్ ఫిలిమ్స్ పై ఈ మూవీ రూపొందింది. దీపావళి కానుకగా ఈ సినిమా థియేటర్స్ లోకి రాబోతోంది. ఇక 2009లో వచ్చిన 'జిగర్తాండ' మూవీని గబ్బర్ సింగ్ డైరెక్టర్ హరీష్ శంకర్ మన తెలుగులో మెగా ప్రిన్స్ వరుణ్ తేజ్ తో రీమేక్ చేసాడు. తమిళ యువ హీరో ఆ తర్వాత మురళి ఈ సినిమాలో మరో లీడ్ రోల్ ప్లే చేశాడు. తెలుగులో కూడా ఈ సినిమా మంచి విజయాన్ని అందుకుంది. ఇక రాఘవ లారెన్స్ త్వరలోనే 'చంద్రముఖి 2'తో ప్రేక్షకుల ముందుకు రాబోతున్నాడు. పి. వాసు డైరెక్ట్ చేస్తున్న ఈ మూవీలో కంగన రనౌత్ హీరోయిన్‌గా నటిస్తోంది. సెప్టెంబర్ 28న ఈ సినిమా ప్రేక్షకుల ముందుకు రానుంది.
Also Read : మరోసారి ఆగిపోయిన 'ఉస్తాద్' షూటింగ్ - హరీశ్ శంకర్‌కి పవన్ డేట్స్ దొరకడం కష్టమేనా?
Join Us on Telegram: https://t.me/abpdesamofficial
Baby Movie: ‘బేబీ’ నిర్మాత సంతోషం - దర్శకుడికి ఖరీదైన కారు గిఫ్ట్, భలే బాగుంది.. మీరూ చూడండి
Vijay Antony: పాన్ ఇండియా రేంజ్లో విజయ్ ఆంటోనీ కొత్త చిత్రం ‘హిట్లర్’, ఆసక్తికరంగా మోషన్ పోస్టర్
Sapta Sagaralu Dhaati: ‘సప్త సాగరాలు దాటి’ సినిమాకు సీక్వెల్ - తెలుగు, కన్నడలో ఒకేసారి రిలీజ్
Vijay Sethupathi: అందుకే కృతి శెట్టిని తిరస్కరించాడట - విజయ్ సేతుపతిలా మన హీరోలు చేయగలరా?
Vijay Antony: మూవీ ప్రమోషన్స్ మొదలుపెట్టిన విజయ్ ఆంటోనీ, నెటిజన్స్ నెగిటివ్ కామెంట్స్
అప్పట్లో పళ్లాలు కొడితే బొక్కలో వేశావ్! ఇప్పుడు బొక్కలో పడి పళ్లాలు కొట్టమంటున్నావ్!
Bigg Boss Telugu 7: కోపం కాదు ఆకలి, ప్రిన్స్ యావర్ ఎమోషనల్ - నువ్వు ట్రోపీ కొట్టాలంటూ హగ్ ఇచ్చిన శోభాశెట్టి
IND Vs ENG: ప్రపంచకప్ ప్రస్థానం ప్రారంభించనున్న రోహిత్ సేన - ఇంగ్లండ్తో వార్మప్ మ్యాచ్కు రెడీ!
Upcoming Mobiles: స్మార్ట్ ఫోన్ల సీజన్ వచ్చేసింది - అక్టోబర్లో ఏయే ఫోన్లు రానున్నాయంటే?
/body>