PVR Multiplex: మైత్రీ మూవీ మేకర్స్‌కి షాక్ - 'మంజుమ్మెల్ బాయ్స్' చిత్రాన్ని ఆపేసిన పీవీఆర్ మల్టీప్లెక్స్, కారణం ఏంటంటే!
Manjummel Boys: టాలీవుడ్ అగ్ర నిర్మాణ సంస్థ మైత్రీ మూవీ మేకర్స్‌కి పీవీఆర్ మల్టీప్లెక్స్ షాకిచ్చింది. థియేటర్లో సక్సెస్ ఫుల్‌గా రన్ అవుతున్న 'మంజుమ్మెల్ బాయ్స్' చిత్రాన్ని నిలిపివేసింది. కారణం..
PVR Multiplex Stops Manjummel Boys Telugu Version: టాలీవుడ్ టాప్ నిర్మాణ సంస్థలో ఒకటైన మైత్రీ మూవీ మేకర్స్‌కి (Mythri Movie Makers) పీవీఆర్ మల్టీప్లెక్స్ (PVR Multiplex) షాకిచ్చింది. ఈ సంస్థ సమర్ఫణలో రిలీజైన మలయాళ బ్లాక్‌బస్టర్ 'మంజుమ్మెల్ బాయ్స్' తెలుగు వెర్షన్ ప్రదర్శనను సడెన్‌గా నిలిపివేసింది. దీంతో మైత్రీ మూవీ మేకర్స్ పీవీఆర్‌పై ఆగ్రహం వ్యక్తం చేస్తూ నిర్మాత మండలికి ఫిర్యాదు చేశారు. దీంతో నేడు ఫిలిం చాంబర్‌లో పీవీఆర్ యాజమాన్యంతో తెలుగు నిర్మాతలు సమావేశం కానున్నారు. ఇంతకి అసలేం జరిగిందంటే.. ఇటీవల డబ్బింగ్ చిత్రాలు సైతం తెలుగులో మంచి ఆదరణ పొందుతున్నాయి. ఇక రీసెంట్‌గా విడుదలైన మలయాళ చిత్రం 'మంజుమ్మెల్ బాయ్స్'.
అర్థాంతరంగా మూవీ నిలివేత
ఈ చిత్రం మలయాళంలో విశేష ఆదరణ అందుకుంది. నిజ జీవిత సంఘటన ఆధారంగా తెరకెక్కిన ఈ సినిమాకు అక్కడి ఆడియన్స్ బ్రహ్మరథం పట్టారు. దీంతో ఈ సినిమా రికార్డు వసూళ్లు సాధించింది. వరల్డ్ వైడ్‌గా బాక్సాఫీసు వద్ద రూ. 200కోట్లపైగా గ్రాస్ వసూళ్లు చేసింది. మలయాళ వెర్షన్ అయినా తెలుగులోనూ ఈ సినిమాకు మంచి రెస్పాన్స్ వచ్చింది. దీంతో మైత్రీమూవీ మేకర్స్ ఈ సినిమా తెలుగు రైట్స్ తీసుకుని ఇక్కడ విడుదల చేశారు. విజయ్ దేవరకొండ ఫ్యామిలీ స్టార్‌కు పోటీగా 'మంజుమ్మెల్ బాయ్స్' ఏప్రిల్ 6న విడుదలైంది. స్టార్ హీరో అయినా విజయ్ దేవరకొండ మూవీని సైతం పక్కన పెట్టి తెలుగు ఆడియన్స్ 'మంజుమ్మెల్ బాయ్స్'(Manjummel Boys) కోసం థియేటర్లకు క్యూ కడుతున్నారు. ఈ మూవీ వచ్చి వారం రోజులు అవుతుంది. ఇప్పటికీ అదే ప్రేక్షక ఆదరణతో థియేటర్లో సక్సెస్ ఫుల్‌గా రన్ అవుతుంది.
పీవీఆర్ పై మైత్రీ మేకర్స్ ఫైర్
PVR Stops Manjummel Boys Movie: ఇక్కడ డిస్ట్రీబ్యూటర్స్, నిర్మాతలకు మంచి లాభాలు తెచ్చిపెట్టే దిశగా దూసుకుపోతున్న 'మంజుమ్మెల్ బాయ్స్' తెలుగు వెర్షన్‌ను ఐనాక్స్ మల్టీప్లెక్స్ అర్ధాంతరంగా నిలిపివేశాయి. మలయాళ నిర్మాతతో వివాదం కారణంగానే మూవీని నిలిపివేసినట్టు స్వయంగా పీవీఆయర్ యాజమాన్యం చెప్పింది. దీంతో పీవీఆర్ మల్టీప్లెక్స్ యాజమాన్యం తీరుపై మైత్రీ మూవీ మేకర్స్ సంస్థ అధినేత శశిధర్ రెడ్డి ఆగ్రహం వ్యక్తం చేశారు. మలయాళ నిర్మాతతో వివాదం అయితే తెలుగు వెర్షన్ నిలిపివేయడం ఏంటని ఆయన ప్రశ్నించారు. ఏదైన గొడవలు ఉంటే మీరు నేరుగా వారితో తేల్చుకోవాలని, వెంటనే మూవీ ప్రదర్శించాలని కోరిన పీవీఆర్ యాజమాన్యం వినిపించుకోలేదట. దీంతో ఆయన ఈ విషయమై తెలుగు ఫిలిం ఛాంబర్‌ను ఆశ్రయించారు. పీవీఆర్ మల్టిప్లెక్స్ వ్యవహారంపై ఆయన ఫిలిం ఛాంబర్‌లో ఫిర్యాదు చేశారు. దీంతో స్పందించిన ఫిలిం ఛాంబర్ నేడు(గురువారం) సాయంత్రం పీవీఆర్ యాజమాన్యంతో అత్యవసర సమావేశానికి పిలుపినిచ్చింది.
ప్రభుదేవ పాటకు రాజమౌళి స్టెప్పులు - భార్యతో కలిసి జక్కన్న రొమాంటిక్ డ్యాన్స్, వీడియో చూశారా?