(Source: ECI/ABP News/ABP Majha)
దక్షిణాదిలో మరింత వినోదం - రూ.450 కోట్ల పెట్టుబడితో 150 స్ర్కీన్ లను తెరవనున్న పీవీఆర్ ఐనాక్స్
దేశ వ్యాప్తంగా పలు కీలక నగరాల్లో థియేటర్లను నెలకొల్పి.. వినోదాన్ని అందిస్తోన్న పీవీఆర్ ఐనాక్స్.. ఇప్పుడు మరో కీలక అడుగు వేయనుంది. వచ్చే ఏడాదిలో మరో 150స్ర్కీన్ లను అందుబాటులోకి తీసుకురావాలని చూస్తోందట
PVR Inox : పీవీఆర్ (PVR) ఐనాక్స్ వచ్చే ఏడాదిలో దేశ వ్యాప్తంగా 150 స్క్రీన్‌లను ప్రారంభించాలని యోచిస్తోంది. సినిమాలను ఎక్కువ ఆధరించే సౌత్ ఇండియాపైనే ఎక్కువ దృష్టి పెట్టాలని చూస్తోంది. అందుకు భారీ గానే పెట్టుబడి పెట్టనున్నట్టు తెలుస్తోంది. జూలై 20న బెంగళూరులో 12 స్క్రీన్ సూపర్‌ప్లెక్స్‌ను ప్రారంభించిన ఈ కంపెనీ.. తాజాగా మరిన్ని స్క్రీన్ లను అందుబాటులోకి తెచ్చేందుకు ప్రణాళికలు చేస్తోంది.
సూపర్‌ప్లెక్స్ అనేది 10 లేదా అంతకంటే ఎక్కువ స్క్రీన్‌లను కలిగి ఉంటుంది. అంటే ఒకే దగ్గర అనేక రకాల ఫార్మాట్‌లు, అనుభవాలను అందిస్తుంది. బెంగళూరులో ఉన్న LUXE, 4DX, P[XL], ICEతో సహా కొన్ని సినిమా ఫార్మాట్‌లు అందుబాటులో ఉన్నాయి. ప్రెస్టీజ్ గ్రూప్ భాగస్వామ్యంతో బెంగళూరులో రీసెంట్ గా ప్రారంభమైన ఈ కొత్త థియేటర్ కోసం కంపెనీ రూ. 72 కోట్లు పెట్టుబడి పెట్టిందని పీవీఆర్ ఐనాక్స్ ఎగ్జిక్యూటివ్ డైరెక్టర్ సంజీవ్ బిజిలీ స్పష్టం చేశారు. పీవీఆర్‌లో నాలుగు నుంచి ఐదు సూపర్‌ప్లెక్స్‌లు ఉన్నాయని, ఐనాక్స్‌లో మూడు నుంచి నాలుగు వరకు ఉన్నాయని ఆయన తెలిపారు. "సూపర్‌ప్లెక్స్‌ల తయారీ అనేది మాల్ సైజు, లొకేషన్‌పై ఆధారపడి ఉంటుంది. బెంగళూరులోని కొత్త సినిమాల్లో అన్ని భాషల సినిమాలు ప్లే అవుతున్నాయి. బెంగళూరులో మరో 15 స్క్రీన్‌లు, పూణేలో మరో 14 స్క్రీన్‌లను తెరుస్తున్నాం. అందులో భాగంగానే ఈ ఏడాది మరో రెండు సూపర్‌ప్లెక్స్‌లు రానున్నాయి. సినిమా వినియోగం ఎక్కువగా ఉండే మెట్రోల్లో ఈ తరహా మెగాప్లెక్స్‌లు నిర్మించే అవకాశం ఉందని ఆయన ఈ సందర్భంగా స్పష్టం చేశారు.
స్క్రీన్ కౌంట్ పరంగా సౌత్ ఇండియాలో అత్యధికంగా తమకు 32 శాతం షేర్ ఉందని సంజీవ్ బిజిలీ తెలిపారు. "థియేటర్ చైన్ ప్రస్తుతం బెంగళూరులో 25 థియేటర్లలో 158 స్క్రీన్‌లు, కర్ణాటకలో 35 థియేటర్లలో 201 స్క్రీన్‌లను కలిగి ఉంది. దక్షిణ భారతదేశంలోని కంపెనీ 96 ప్రాంతాల్లో మొత్తం 542 స్క్రీన్‌లను కలిగి ఉంది. మొత్తంగా, మల్టీప్లెక్స్ చైన్‌లో 1,702 స్క్రీన్‌లు ఉన్నాయన్నారు. దేశంలోని ఇతర ప్రాంతాలతో పోలిస్తే ఇక్కడ సినిమాల వినియోగం ఎక్కువగా ఉన్నందున మేము దక్షిణ భారతదేశంపై ఎక్కువ దృష్టి పెట్టాలనుకుంటున్నాం. వచ్చే సంవత్సరం వరకు 150 స్క్రీన్స్ ను ఫిల్ చేయడమే మా లక్ష్యంగా పెట్టుకున్నాం" అని బిజిలీ చెప్పారు.
కరోనా తర్వాత ఇటీవలి కాలంలో ప్రజలు మళ్లీ సినిమాలకు వస్తున్నారు. మళ్లీ లైనప్ బలంగా కనిపిస్తోంది. అందుకే వచ్చే త్రైమాసికంలో వ్యాపారాన్ని స్థిరీకరించాలని మేము చూస్తున్నాం. అందులో భాగంగానే పరీవాహక ప్రాంతాల్లో స్క్రీన్‌లను విడుదల చేయాలని యోచిస్తున్నాం" అని ఎగ్జిక్యూటివ్ డైరెక్టర్ చెప్పారు.
ప్రమోషన్ ఆఫర్
పీవీఆర్ ఇటీవలే ఓ ప్రమోషన్ ఆఫర్ ను కూడా ప్రకటించింది. అన్ లిమిటెడ్ పాప్ కార్న్, పెప్సీ ఫ్రీ రీఫిల్స్ ను వీకెండ్ ఆఫర్ గా అందించనున్నామని తెలిపింది. వీక్ డేస్ లో సోమవారం నుంచి గురువారం వరకు ఉదయం 9నుంచి సాయంత్రం 6వరకు బర్గర్, సమోసా, శాండ్ విచ్, పెప్సీ వంటి ఐటెమ్స్ ను పీవీఆర్ కేవలం రూ.99కే ఆఫర్ చేస్తుందని వెల్లడించింది.
Read Also : Project K: నాకు నేను చిన్నగా కనిపించేవాడిని, చాలా బోర్ కొట్టింది: ‘ప్రాజెక్ట్ కె’పై ప్రభాస్ కామెంట్స్
ముఖ్యమైన, మరిన్ని ఆసక్తికర కథనాల కోసం ‘టెలిగ్రామ్’లో ‘ఏబీపీ దేశం’లో జాయిన్ అవ్వండి.
Join Us on Telegram: https://t.me/abpdesamofficial