Pushpa 2 VS Kantara : 'పుష్ప 2' లుక్ మీద కొత్త రచ్చ - 'కాంతార'లా ఉందేంటి?
'పుష్ప 2' సినిమాలో అల్లు అర్జున్ లుక్ రిలీజ్ చేశారు. అది వచ్చాక సోషల్ మీడియాలో కొత్త రచ్చ మొదలైంది. 'కాంతార'లో రిషబ్ శెట్టి లుక్ లా ఉందని ట్వీట్స్ చేస్తున్నారు కొందరు.
ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ (Allu Arjun) కొత్త లుక్ చూశారా? అదేనండీ... 'పుష్ప 2' (Pushpa 2 First Look)లో ఆయన ఫస్ట్ లుక్! ఆల్రెడీ చూసే ఉంటారు కదా! ఈ లుక్ మీద సోషల్ మీడియాలో కొత్త రచ్చ మొదలైంది. ప్రయోగాలు చేయడానికి ఎప్పుడూ రెడీగా ఉండే అల్లు అర్జున్... ఈ విధంగా కనిపించి అందరికీ షాక్ ఇచ్చారు. ఓ స్టార్ హీరో ఈ విధంగా కనిపించడం చాలా మందిని ఆశ్చర్యపరిచింది. ఇప్పుడీ లుక్ ట్రెండింగ్ టాపిక్!
అల్లు అర్జున్ కొత్త ట్రెండ్ సెట్ చేశారని ఆయన ఫ్యాన్స్ చాలా గర్వంగా పోస్టులు చేస్తున్నారు. అయితే... ఈ లుక్ 'కాంతార'కి కాపీ అని, ఆ సినిమా స్ఫూర్తితో ఈ లుక్ క్రియేట్ చేశారని కన్నడ ప్రేక్షకులు, తెలుగు నాట కొందరు డిస్కషన్ స్టార్ట్ చేశారు.
'కాంతార' ఎందుకు వచ్చింది?
కన్నడ సినిమాగా విడుదలైన రిషబ్ శెట్టి 'కాంతార'... ఆ తర్వాత తెలుగు, హిందీ భాషల్లోనూ సంచలన విజయం సాధించింది. ఆ సినిమాలో ప్రారంభ, పతాక సన్నివేశాలు గుర్తు ఉన్నారా? కర్ణాటకలోని తుళునాడు, కేరళలోని కాసరగోడ్ ప్రాంతాల్లో పాటించే 'భూత కోల' / దైవ కోల ఆచారాన్ని చూపించారు. రిషబ్ శెట్టి వేషధారణ అందరినీ ఆకట్టుకుంది. అల్లు అర్జున్ 'పుష్ప 2' లుక్ కూడా అలా ఉందనేది కొందరి వాదన!
The first look of #Pushpa2 verifies that #Kantara effect is really Huge💥
— Karnataka Box Office | ಕರ್ನಾಟಕ ಬಾಕ್ಸ್ ಆಫೀಸ್ (@Kannada_BO) April 7, 2023
Mamulu Inspiration kadu bhAAi needi
— UrsTrulyMehru (@mdgouse13116) April 7, 2023
Kantara × KGf Mixing Lo #Pushpa2 https://t.co/GpHTFSRVeX
ఇది 'గంగమ్మ జాతర'...
'పుష్ప' పాటలో చెప్పారుగా!
అల్లు అర్జున్ లుక్ విషయానికి వస్తే... తిరుపతిలో గంగమ్మ జాతర జరుగుతుంది. ఆ జాతరలో పురుషులు అల్లు అర్జున్ ఫస్ట్ లుక్ తరహాలో రెడీ అవుతారు. చిత్తూరు, తిరుపతి నేపథ్యంలో ఎర్రచందనం స్మగ్లింగ్ నేపథ్యంలో 'పుష్ప' రూపొందుతోంది. అందుకని, అక్కడ సంప్రదాయాన్ని సుకుమార్ చూపిస్తున్నారు. గంగమ్మ జాతర గురించి 'పుష్ప'లోని 'దాక్కో దాక్కో మేక...' పాటలో కూడా చెప్పారు. ఇప్పుడు కొత్తగా 'కాంతార' విడుదలైన తర్వాత కాపీ కొట్టడం ఏమిటి? అని అల్లు అర్జున్ ఫ్యాన్స్ కౌంటర్స్ ఇస్తున్నారు.
'కాంతారను కాపీ చేశాడని అంటున్నారు. అసలు కాంతారలో ఇటవంటి లుక్ ఎక్కడ వచ్చిందిరా?' అని అల్లు అర్జున్ ఫ్యాన్ ఒకరు ట్వీట్ చేశారు.
Kantara ni copy chesadu antunnaru....assalu kantara ilanti look ekkada vundhi ra 🙄🙄#Pushpa2TheRule #HappyBirthdayAlluArjun
— 😎 (@ChethanAAHCF) April 7, 2023
This movie poster looks moreover like a crossover between #Kantara and #Pushpa anyways waiting to experience the stunning star @alluarjun in #Pushpa2
— Sarada Prasad Das 🇮🇳 (@AmSaradaPrasad) April 7, 2023
I hope this release soon. pic.twitter.com/8jGCdUHSIT
చిరంజీవి ఎప్పుడో చేశారుగా!
'కాంతార' కంటే దశాబ్దాల క్రితమే చిరంజీవి హీరోగా నటించిన 'మృగరాజు', 'అంజి' సినిమాలు బావుంటాయని ఇంకొకరు పోస్ట్ చేశారు.
Many are assuming Kantara effect &all
— 😎 (@TOI_Movies_) April 7, 2023
.
That kantara itself a crap, decades old chiru's mrugaraju & anji are far better than that
Why would a star like allu arjun will do something like that to woo RW folks
.
Expecting a mega mass INTERVAL fight in that avatar💥🔥 #Pushpa2TheRule
మళ్ళీ 'కెజియఫ్'తో ముడి పెడుతూ...
'పుష్ప 2' ఫస్ట్ లుక్ విడుదలైన తర్వాత... మళ్ళీ 'కెజియఫ్' తెర మీదకు వచ్చింది. యశ్ హీరోగా ప్రశాంత్ నీల్ తీసిన ఆ సినిమా చూసి 'పుష్ప' తీశారని చాలా మంది అప్పట్లో ట్రోల్ చేశారు. ఇప్పుడు 'కెజియఫ్ 2' & 'కాంతార' మిక్స్ చేసి 'పుష్ప 2' తీస్తున్నారని ట్రోల్ చేయడం స్టార్ట్ చేశారు. ఒక్క లుక్ మీద ఇన్ని ట్రోల్స్ రావడం బహుశా ఇదే తొలిసారి అనుకుంట!
Also Read : రవితేజ - వరుణ్ ధావన్ - రానా - ఓ బాలీవుడ్ మల్టీస్టారర్!
Pushpa part 1 was "inspired" by KGF Chapter 1.
— Mad Preacher (@AbishekG6) April 7, 2023
Pushpa part 2 looks like a mix of KGF Chapter 2 & Kantara.#PushpaTheRule #Pushpa2 #Pushpa #KGFChapter2 #Kantara
#KGF ni chusi #Pushpa vachindi #Kantara ni chusi #PushpaTheRule raskunaru emo 🙏🙏 #Pushpa2
— LogOut (@nani_ymc) April 7, 2023
First part gave kgf feela
— Hyderabad Poragadu (@HydPoragadu) April 7, 2023
This poster gives Kantara feels #Pushpa2TheRule https://t.co/UKxeWuVJPz
Pushpa 2 Goes The Kantara Way! Allu Arjun Dons Saree in FIRST Look #Pushpa2 #Pushpa2TheRule #Pushpa #pu pic.twitter.com/wtsclyCgQk
— DONTHU RAMESH (@DonthuRamesh) April 7, 2023