News
News
abp shortsABP షార్ట్స్వీడియోలు ఆటలు
X
ఎన్నికల ఫలితాలు 2023

Akhil Akkineni: అక్కినేని అభిమానులకు సారీ చెప్పిన నిర్మాత

అక్కినేని అభిమానులకు ఒక నిర్మాత సారీ చెప్పారు. ఎందుకు? ఏమిటి? అనే వివరాల్లోకి వెళితే... Akhil Akkineni Birthday Special

FOLLOW US: 
Share:

అక్కినేని అభిమానులకు నిర్మాత అనిల్ సుంకర సారీ చెప్పారు. ఎందుకు? అంటే... నేడు అఖిల్ అక్కినేని పుట్టినరోజు (Akhil Akkineni Birthday). ఈ సందర్భంగా 'ఏజెంట్' టీజర్ విడుదల చేయలేక పోతున్నందుకు! హీరో బర్త్ డే అంటే... సెట్స్ మీద ఉన్న సినిమా నుంచి ఏదో ఒక అప్‌డేట్‌ రావడం కామన్! అయితే... 'ఏజెంట్' టీమ్ నుంచి ఏదీ రావడం లేదు.

"ఈ రోజు 'ఏజెంట్' టీజర్ విడుదల చేయలేక పోతున్నందుకు అక్కినేని ఫ్యాన్స్ అందరికీ పెద్ద సారీ. మేం బెస్ట్ ఇవ్వాలని అనుకుంటున్నాం. మీ ఎదురు చూపులకు తగ్గట్టుగా ఉంటుంది. మేలో హయ్యస్ట్ క్వాలిటీ థియేట్రికల్ టీజర్ (Agent theatrical teaser in May) విడుదల చేస్తాం" అని అనిల్ సుంకర ట్వీట్ చేశారు. మరో ట్వీట్ లో అఖిల్ అక్కినేనికి పుట్టినరోజు శుభాకాంక్షలు చెప్పారు. అఖిల్ ఫ్రెండ్లీ నేచర్, డెడికేషన్ సినిమా ఇండస్ట్రీలో అతడిని ఎవరెస్టు అంత ఎత్తులో నిలబెడుతుందని ఆయన చెప్పారు.

స్పై థ్రిల్ల‌ర్‌గా తెరకెక్కుతోన్న 'ఏజెంట్' హీరోగా అఖిల్‌కు 5వ సినిమా. ఇందులో పాత్ర కోసం ఆయన సిక్స్ ప్యాక్ చేశారు. అఖిల్ సరసన సాక్షి వైద్య కథానాయికగా నటిస్తున్నారు. ఈ చిత్రానికి సురేందర్ రెడ్డి దర్శకత్వం వహిస్తున్నారు. 'సైరా నరసింహా రెడ్డి' తర్వాత ఆయన దర్శకత్వం వహిస్తున్న చిత్రమిది. వక్కంతం వంశీ కథ అందించారు. తమన్ సంగీతం అందిస్తున్నారు. ఆగస్టు 12న చిత్రాన్ని విడుదల చేయాలనుకుంటున్నట్టు గతంలో ప్రకటించారు. మరి, ఇప్పుడు ఆ తేదీకి వస్తారో? లేదో?

Also Read: చిరంజీవితో సినిమా చేయలేదని ఇప్పటికీ బాధపడుతున్నా - ఉపేంద్ర

అనిల్ సుంకరకు చెందిన ఏకే ఎంట‌ర్‌టైన్‌మెంట్స్‌, సురేందర్ రెడ్డికి చెందిన స‌రెండ‌ర్ 2 సినిమా ప‌తాకాల‌పై రామబ్రహ్మం సుంకర నిర్మిస్తున్నారు. ఈ చిత్రానికి సినిమాటోగ్ర‌ఫీ: రాగూల్ హెరియన్ ధారుమాన్, ఎడిటర్‌: నవీన్ నూలీ, ఆర్ట్ డైరెక్టర్‌: అవినాష్ కొల్లా, సహ నిర్మాతలు: అజ‌య్ సుంక‌ర‌, ప‌త్తి దీపారెడ్డి. 

Also Read: హిందీ సినిమా ఎందుకు? బాలీవుడ్ జనాలకు దిమ్మ తిరిగేలా ఆన్సర్ ఇచ్చిన మహేష్!

Published at : 08 Apr 2022 06:42 AM (IST) Tags: Akhil Akkineni Anil Sunkara Agent Movie Surendar reddy Akhil Akkineni Birthday Akhil Birthday Telugu Movie Agent

ఇవి కూడా చూడండి

Meenakshi Chaudhary: మీనాక్షీ చౌదరి, ఊర్వశి రౌటేలా - బాలకృష్ణతో గ్లామర్ గాళ్స్ ఇద్దరూ...    

Meenakshi Chaudhary: మీనాక్షీ చౌదరి, ఊర్వశి రౌటేలా - బాలకృష్ణతో గ్లామర్ గాళ్స్ ఇద్దరూ...    

Venu Swamy: వరుణ్ తేజ్, లావణ్య కలిసుండే అవకాశాల్లేవ్ - వాళ్ళిద్దరి జాతకాలపై వేణు స్వామి సంచనల వ్యాఖ్యలు

Venu Swamy: వరుణ్ తేజ్, లావణ్య కలిసుండే అవకాశాల్లేవ్ - వాళ్ళిద్దరి జాతకాలపై వేణు స్వామి సంచనల వ్యాఖ్యలు

Sandeep Reddy Vanga: వర్మ ‘యానిమల్’ రివ్యూపై స్పందించిన సందీప్ - కొన్ని విషయాలు పక్కన పెట్టాల్సిందే!

Sandeep Reddy Vanga: వర్మ ‘యానిమల్’ రివ్యూపై స్పందించిన సందీప్ - కొన్ని విషయాలు పక్కన పెట్టాల్సిందే!

Rajashekar : జీవిత, జీవితం రెండు ఒక్కటే అనేది డైలాగ్ మాత్రమే - బయట వేరేవిధంగా ఉంటుంది: రాజశేఖర్

Rajashekar : జీవిత, జీవితం రెండు ఒక్కటే అనేది డైలాగ్ మాత్రమే - బయట వేరేవిధంగా ఉంటుంది: రాజశేఖర్

Animal: ఆ స్టార్ హీరో ఇంట్లో ‘యానిమల్’ మూవీ షూటింగ్ - డీకోడ్ చేసిన నెటిజన్లు!

Animal: ఆ స్టార్ హీరో ఇంట్లో ‘యానిమల్’ మూవీ షూటింగ్ - డీకోడ్ చేసిన నెటిజన్లు!

టాప్ స్టోరీస్

Michaung Cyclone Effect In AP: మిగ్‌జాం తుపాను ధాటికి ఏపీ కకావికలం- బోరుమంటున్న రైతులు

Michaung Cyclone Effect In AP: మిగ్‌జాం తుపాను ధాటికి ఏపీ కకావికలం- బోరుమంటున్న రైతులు

Telangana CM Revanth Reddy: సీఎం అయ్యాక రేవంత్ రెడ్డి తొలి ట్వీట్ చూశారా! వారందరికీ ప్రత్యేక ధన్యవాదాలు

Telangana CM Revanth Reddy: సీఎం అయ్యాక రేవంత్ రెడ్డి తొలి ట్వీట్ చూశారా! వారందరికీ ప్రత్యేక ధన్యవాదాలు

Telangana New Cabinet: 18 మంత్రి పదువుల కోసం 30 మంది నేతల పోటీ - జట్టు కూర్పుపై రేవంత్ కసరత్తు

Telangana New Cabinet: 18 మంత్రి పదువుల కోసం 30 మంది నేతల పోటీ - జట్టు కూర్పుపై రేవంత్ కసరత్తు

నేను అమ్ముడుపోయానా..? రేవంత్ రెడ్డి ఎమోషనల్...!

నేను అమ్ముడుపోయానా..? రేవంత్ రెడ్డి ఎమోషనల్...!
×