Mahesh Babu: హిందీ సినిమా ఎందుకు? బాలీవుడ్ జనాలకు దిమ్మ తిరిగేలా ఆన్సర్ ఇచ్చిన మహేష్!
మహేష్ బాబు హిందీ సినిమా ఎప్పుడు చేస్తారు? బాలీవుడ్ ఎప్పుడు వెళతారు? ఆయన ఇచ్చిన ఆన్సర్ వింటే బాలీవుడ్ జనాలకు మైండ్ బ్లాక్ అవ్వడం ఖాయం!
Mahesh Babu On Hindi Movie Debut: ఎప్పుడు? ఇంకెప్పుడు? సూపర్ స్టార్ మహేష్ బాబు హిందీ సినిమా చేసేది ఎప్పుడు? ఆయన బాలీవుడ్ ఎంట్రీ ఎప్పుడు? చాలా రోజుల నుంచి ఎంతో మంది ఈ ప్రశ్నలకు సమాధానం కోసం ఎదురు చూస్తున్నారు. తెలుగు సినిమాలతో హిందీలోనూ అభిమానుల్ని సొంతం చేసుకున్న ఘనత మహేష్ బాబు సొంతం. అయితే... ఇప్పటి వరకూ మహేష్ బాబు హిందీ సినిమా చేయలేదు. బాలీవుడ్ డెబ్యూ గురించి ఎప్పుడు ప్రశ్నించినా... ''తెలుగు సినిమాలతో హ్యాపీగా ఉన్నాను'' అని మహేష్ బాబు చెప్పేవారు. మరోసారి ఆయనకు అదే ప్రశ్న ఎదురైంది. అప్పుడు ఆయన చెప్పిన సమాధానం వింటే బాలీవుడ్ జనాలకు మైండ్ బ్లాక్ అవ్వడం ఖాయం.
హైదరాబాద్‌లో జరిగిన ఒక యాప్ ఆవిష్కరణ కార్యక్రమంలో మహేష్ బాబుకు మరోసారి హిందీ సినిమా ఎంట్రీ గురించి ప్రశ్న ఎదురైంది. ఆ ప్రశ్న అడిగినది ముంబై మీడియాకు చెందిన వ్యక్తి. "మీరు ముంబై నుంచి వచ్చారు కాబట్టి చెబుతున్నాను. ఇప్పుడు హిందీ చేయాల్సిన అవసరం లేదు. నేను హ్యాపీగా తెలుగు సినిమా చేసి... ప్రపంచమంతటా విడుదల చేయవచ్చు. ఇప్పుడే అదే జరుగుతోంది. నా వరకూ వస్తే... తెలుగు సినిమాలు చేస్తూ హ్యాపీగా ఉన్నాను" అని మహేష్ బాబు ఆన్సర్ ఇచ్చారు.
నిజం చెప్పాలంటే... మహేష్ బాబు మాటలు అక్షర సత్యమే. రీసెంట్ బ్లాక్ బస్టర్ 'ఆర్ఆర్ఆర్' కావచ్చు, త్వరలో విడుదల కాబోయే 'బీస్ట్', 'కె.జి.యఫ్ 2' సినిమాలు కావచ్చు, ఆ తర్వాత విడుదల కానున్న 'పుష్ప 2', సౌత్ ఇండియా ఫిల్మ్ మేకర్స్ తీస్తున్న పాన్ ఇండియా సినిమాలు కావచ్చు... హిందీ సినిమాలు కాదు. హిందీలోనూ విడుదల చేయాలని తీస్తున్న సినిమాలే. పాన్ ఇండియా మార్కెట్ మీద అందరూ దృష్టి పెట్టడానికి కారణమైన 'బాహుబలి' కూడా హిందీ సినిమా కాదు. ఇప్పుడు తెలుగు సినిమా తీసి హిందీలో విడుదల చేయవచ్చు.
Also Read: రామ్ గోపాల్ వర్మ 'మా ఇష్టం' విడుదల చేయడానికి వీల్లేదు - కోర్టు స్టే ఆర్డర్
ప్రస్తుతం మహేష్ బాబు 'సర్కారు వారి పాట' సినిమా చేస్తున్నారు. దీని తర్వాత త్రివిక్రమ్ శ్రీనివాస్ దర్శకత్వంలో ఆయన ఒక సినిమా చేయనున్నారు. దానిని పాన్ ఇండియా రిలీజ్ చేసేలా తెరకెక్కించనున్నారని సమాచారం. ఒకవేళ త్రివిక్రమ్ సినిమా హిందీలో విడుదల కాకపోయినా... ఆ తర్వాత సినిమాతో మహేష్ బాబు హిందీ ప్రేక్షకుల ముందుకు వెళ్లడం పక్కా. ఇప్పుడు రాజమౌళి సినిమా అంటే పాన్ ఇండియా కాదు, పాన్ వరల్డ్ సినిమా అని చెప్పాలి.
Also Read: ఎన్టీఆర్‌ను డామినేట్ చేశాడా? రామ్ చరణ్ ఆన్సర్ ఏంటి?