Anil Sunkara: చిరంజీవి వల్ల ఆస్తులు అమ్ముకున్నారా? 'భోళా శంకర్' డిజాస్టర్, ప్రచారంపై అనిల్ సుంకర రియాక్షన్
Anil Sunkara On Chiranjeevi: చిరంజీవి హీరోగా మెహర్ రమేష్ దర్శకత్వం వహించిన సినిమా 'భోళా శంకర్'. అది డిజాస్టర్ కావడంతో నిర్మాత అనిల్ సుంకర ఆస్తులు అమ్ముకున్నారని జరిగిన ప్రచారంపై ఆయన స్పందించారు.

మెగాస్టార్ చిరంజీవి (Chiranjeevi) కథానాయకుడిగా ఆయన బంధువు, వరుసకు తమ్ముడు అయ్యేటటువంటి మెహర్ రమేష్ దర్శకత్వం వహించిన సినిమా 'భోళా శంకర్' (Bhola Shankar). తమిళ హిట్ అజిత్ 'వేదాళం'కు రీమేక్ ఇది. తెలుగులో డిజాస్టర్ రిజల్ట్ వచ్చింది. దాంతో నిర్మాత అనిల్ సుంకర (Anil Sunkara) ఆస్తులు అమ్ముకున్నారని ప్రచారం జరిగింది. తాజా ఇంటర్వ్యూలో దానిపై ఆయన స్పందించారు.
నన్ను బలి పశువును చేశారు - అనిల్ సుంకర!
చిరంజీవి మద్దతు లేకుండా 'భోళా శంకర్' డిజాస్టర్ నుంచి తాను బయట పడేవాడిని కాదని నిర్మాత అనిల్ సుంకర తెలిపారు. ఆ మూవీ ఫ్లాప్ ఆ తరువాత జరిగిన ప్రచారం పట్ల తాజా ఇంటర్వ్యూలో... ''సినిమా విడుదల తర్వాత సోషల్ మీడియాలో దుష్ప్రచారం జరిగింది. తమ చేతిలో హ్యాండిల్స్ ఉన్నాయని చెప్పి ఇష్టం వచ్చినట్లు రాశారు. ఆ పుకార్లు ఎవరు సృష్టించారో తర్వాత నాకు తెలిసింది. ఆ వివాదంలో నేను బలి పశువు అయ్యాను'' అని వివరించారు.
చిరు నుంచి మొదటి ఫోన్ వచ్చింది... సపోర్ట్!?
సినిమా విడుదల తర్వాత చిరంజీవి తనకు ఫోన్ చేశారని అనిల్ సుంకర చెప్పారు. ఆయన మాట్లాడుతూ... ''కొంత మంది ప్రజల మనస్తత్వం ఎంత స్టుపిడిటీతో ఉంటుందంటే? నాకు హైదరాబాద్ - విజయవాడ హైవేలో రాజుగారి తోట ధాబా ఉంది. అది అమ్మేశానని వార్తలు రాశారు. చిరంజీవి గారికి డబ్బులు ఇవ్వడం కోసం అది అమ్మేశానని రాసుకొచ్చారు. సినిమా విడుదల తర్వాత నాకు మొదటి ఫోన్ చిరంజీవి గారి నుంచి వచ్చింది ఆయన జడ్జిమెంట్‌కు తిరుగు లేదు. ఆయనకు రిజల్ట్ అర్థమైంది. 'డబ్బుల గురించి, ఇతరత్రా అంశాల గురించి మర్చిపో. మనం మాట్లాడుకుందాం' అని చెప్పారు. ఆయన ఎంతో మద్దతు ఇచ్చారు. విచిత్రం ఏమిటంటే... అందులో నా పార్టనర్ ఒకరు ఉన్నారు. అతడి నుంచి నాకు ఫోన్ వచ్చింది. 'అమ్మేశావంట కదా' అని అడిగాడు. 'అరే నువ్వేం మాట్లాడుతున్నావో నీకు అర్థం అవుతుందా? ఒకవేళ నేను గనుక అమ్మేసి ఉంటే దాని మీద నువ్వే కదా కన్స్ట్రక్షన్ లోన్ తీసుకున్నావ్. డాక్యుమెంట్లు బ్యాంకులో ఉన్నాయి. అవి అక్కడ ఉండగా నేను ఎలా అమ్మేస్తాను?' అని అడిగా. బ్యాంకు వాడు ఎందుకు ఊరుకుంటాడు? బయట వాళ్ళు ఎవరో అడిగారంటే అర్థం చేసుకోవచ్చు. నా సొంత పార్టనర్ అడిగారు. నేను వివరించేసరికి అతనికి పరిస్థితి అర్థం అయింది. ఈ ప్రచారం వల్ల నా ఇతర వ్యాపారాలలో ఇబ్బందులు ఎదురయ్యాయి'' అని చెప్పారు. అది సంగతి. కొంత విరామం తర్వాత మళ్ళీ సినిమా నిర్మించడానికి అనిల్ సుంకర రెడీ అయ్యారు. సినిమా తీద్దామని సామాన్యులకు ఆయన పిలుపు ఇచ్చారు.
Also Read: పవన్ పాడిన జపనీస్ హైకూ అర్థం ఏమిటో తెలుసుకోండి... 'వాషి యో వాషి' లిరిక్స్ మీనింగ్ తెలుసా?





















