అన్వేషించండి

OG Pre Release Event: ఓజీ ప్రీ రిలీజ్ ఈవెంట్... ఎల్బీ స్టేడియంలో ఏం ప్లాన్ చేశారు? గెస్టులు ఎవరు? ఫుల్ డీటెయిల్స్ తెలుసుకోండి

OG Pre Release Event - LB Stadium: హైదరాబాద్‌లోని ఎల్బీ స్టేడియంలో 'ఓజీ' ప్రీ రిలీజ్ ఈవెంట్ నిర్వహిస్తున్నారు. ఎంత అభిమానులు లోపలికి వెళ్లే ఛాన్స్ ఉంది? గెస్టులు ఎవరు? వంటి ఫుల్ డీటెయిల్స్ తెలుసుకోండి

OG Movie Pre Release Event Full Details: 'ఓజీ' ప్రీ రిలీజ్ ఈవెంట్ జరిగేది ఈ రోజే (అంటే సెప్టెంబర్ 21వ తేదీ సాయంత్రం). 'ఓజీ కాన్సర్ట్' పేరుతో జరిగే ఈ వేడుక కోసం పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ (Pawan Kalyan) ఫ్యాన్స్ ఎంతగానో వెయిట్ చేస్తున్నారు. ఈ వేడుకకు ముఖ్య అతిథి ఎవరు? వెన్యూ నుంచి ఈవెంట్ ప్లాన్, గెస్ట్స్ వరకు ఫుల్ డీటెయిల్స్ తెలుసుకోండి.

'ఓజీ' ప్రీ రిలీజ్ ఈవెంట్ ఎప్పుడు? ఎక్కడ?
OG Concert - LB Stadium: హైదరాబాద్ సిటీలోని ఎల్బీ స్టేడియంలో 'ఓజీ' ప్రీ రిలీజ్ ఈవెంట్ నిర్వహిస్తున్నారు. ఈ రోజు (సెప్టెంబర్ 21వ తేదీ) సాయంత్రం ఐదు గంటలకు ఈవెంట్ మొదలు అవుతుందని పేర్కొన్నారు. కానీ, ప్రారంభం అయ్యే సరికి ఆరు గంటలు అవుతుంది. 'హరి హర వీరమల్లు' ప్రీ రిలీజ్ శిల్పకళా వేదికలో చేశారు. ఆ ఆడిటోరియం కెపాసిటీ తక్కువ. ఎక్కువ మంది అభిమానులకు పవన్ కళ్యాణ్‌ను చూసే అవకాశం దక్కలేదు. అందుకని ఈసారి ఎల్బీ స్టేడియంలో 'ఓజీ కాన్సర్ట్' నిర్వహిస్తున్నారు. ఎల్బీ స్టేడియం కెపాసిటీ 30 వేలు. ఆల్రెడీ పవన్ అభిమానులకు ఈవెంట్ పాస్ డిస్ట్రిబ్యూషన్ జరుగుతోంది. పాతిక వేల మందికి పైగా హాజరు అయ్యే అవకాశాలు ఉన్నాయి. శ్రేయాస్ మీడియా ఈవెంట్ ఆర్గనైజ్ చేస్తోంది.

తమన్ 'ఓజీ' లైవ్ పెర్ఫార్మన్స్ స్పెషల్ ఎట్రాక్షన్!
'ఓజీ కాన్సర్ట్'లో స్పెషల్ ఎట్రాక్షన్ అంటే... సంగీత దర్శకుడు తమన్ ఇచ్చే లైవ్ పెర్ఫార్మన్స్. ఇప్పటి వరకు 'ఓజీ' నుంచి వచ్చిన ఒక్కో పాట ఒక్కో స్టైల్‌లో ఉంది. చార్ట్ బస్టర్ అయ్యింది. ఆ పాటలను స్టేజి మీద తన బృందంతో తమన్ పెర్ఫార్మ్ చేయనున్నారు. ఇటీవల థియేటర్లలో కొత్త సినిమాలు చూడటానికి వెళ్ళారా? బ్రేక్ టైంలో 'ఫైర్ స్ట్రోమ్' ప్లే చేశారు. స్క్రీన్ మీద ఆ సాంగ్ రాగానే థియేటర్లు దద్దరిల్లాయి. ఇప్పుడు ఎల్బీ స్టేడియం అంతా దద్దరిల్లుతుందని చెప్పడంలో ఎటువంటి సందేహం అవసరం లేదు. 'ఓజీ' ట్రైలర్‌ (OG Trailer Release Date)ను కూడా ఈవెంట్‌లో రిలీజ్ చేయనున్నారు.

పవన్ కళ్యాణ్ ఉండగా మరొక గెస్ట్‌ ఎందుకు?
OG Concert Chief Guest: సాధారణంగా పవన్ కళ్యాణ్ సినిమా వేడుకలకు ముఖ్య అతిథులు అంటూ ఎవరూ ఉండరు. అతి తక్కువ వేడుకలకు మాత్రమే మెగాస్టార్ చిరంజీవి హాజరు అయ్యారు. 'ఓజీ' ప్రీ రిలీజ్‌ ఈవెంట్‌కు ఆయన వస్తారని ప్రచారం జరిగింది. అయితే... చిరు వచ్చే అవకాశాలు చాలా తక్కువ అని సమాచారం.

Also Readపవన్ పాడిన జపనీస్ హైకూ అర్థం ఏమిటో తెలుసుకోండి... 'వాషి యో వాషి' లిరిక్స్ మీనింగ్ తెలుసా?

ఇప్పటి వరకు 'ఓజీ' కాన్సర్ట్ నిర్వాహకులకు ముఖ్య అతిథిగా ఫలానా వ్యక్తి వస్తారని ఎటువంటి సమాచారం ఇవ్వలేదు. పవన్ కళ్యాణ్ ఒక్కరే ఈవెంట్ మెయిన్ ఎట్రాక్షన్ అని తెలిసింది. ఏపీ సినిమాటోగ్రఫీ మంత్రి కందుల దుర్గేష్ సహా కొంత మంది జనసేన పార్టీ నాయకులు హాజరు అయ్యే అవకాశాలు ఉన్నాయి. 

'ఓజీ' దర్శక నిర్మాతలు సుజీత్, డీవీవీ దానయ్య, కళ్యాణ్ దాసరితో పాటు హీరో హీరోయిన్లు, కీలక పాత్రల్లో నటించిన కొందరు ఆర్టిస్టులు, సాంకేతిక నిపుణులు వేడుకకు హాజరు అవుతారు.

Also Readదక్ష రివ్యూ: సన్నాఫ్ ఇండియా దర్శకుడి కథతో... మోహన్ బాబు - లక్ష్మీ మంచు సినిమా... మర్డర్ మిస్టరీ థ్రిల్లర్ ఎలా ఉందంటే?

ఇంకా చదవండి
Sponsored Links by Taboola
Advertisement

టాప్ హెడ్ లైన్స్

Putin in India: ఢిల్లీలో రష్యా అధ్యక్షుడు పుతిన్ - ప్రోటోకాల్ పక్కన పెట్టి స్వాగతం పలికిన ప్రధాని మోదీ
ఢిల్లీలో రష్యా అధ్యక్షుడు పుతిన్ - ప్రోటోకాల్ పక్కన పెట్టి స్వాగతం పలికిన ప్రధాని మోదీ
Andhra Investments :  ఏపీలో  మరో రూ. 20,444 కోట్ల పెట్టుబడులకు ఆమోదం - 45 రోజుల్లోగా మెజార్టీ ఎంఓయూలు గ్రౌండింగ్
ఏపీలో మరో రూ. 20,444 కోట్ల పెట్టుబడులకు ఆమోదం - 45 రోజుల్లోగా మెజార్టీ ఎంఓయూలు గ్రౌండింగ్
Deputy CM Pawan Kalyan: వ్యవస్థల్లో మార్పులు తీసుకురాకపోతే మనకు ఎన్ని పదవులు ఉన్నా వేస్ట్ - చిత్తూరులో పవన్ కల్యాణ్ కీలక వ్యాఖ్యలు
వ్యవస్థల్లో మార్పులు తీసుకురాకపోతే మనకు ఎన్ని పదవులు ఉన్నా వేస్ట్ - చిత్తూరులో పవన్ కల్యాణ్ కీలక వ్యాఖ్యలు
Loan Apps Ban: 87 లోన్ యాప్స్‌ను బ్యాన్ చేసిన కేంద్రం - ఇప్పుడు అప్పు తీసుకున్న వాళ్లందరూ ఎగ్గొట్టవచ్చా?
87 లోన్ యాప్స్‌ను బ్యాన్ చేసిన కేంద్రం - ఇప్పుడు అప్పు తీసుకున్న వాళ్లందరూ ఎగ్గొట్టవచ్చా?
Advertisement

వీడియోలు

PM Modi Protocol Break at Putin Welcome | రష్యా అధ్యక్షుడికి ఆత్మీయ ఆలింగనంతో మోదీ స్వాగతం | ABP Desam
Akhanda 2 Premieres Cancelled | భారత్ లో నిలిచిన బాలకృష్ణ అఖండ 2 ప్రీమియర్స్ | ABP Desam
Indigo Airlines Issue | ప్రయాణికులకు చుక్కలు చూపిస్తున్న ఇండియో ఎయిర్‌లైన్స్ | ABP Desam
Rupee Record Fall | ఘోరంగా పతనమవుతున్న రూపాయి విలువ | ABP Desam
సారీ రోహిత్, కోహ్లీ 2027 వరల్డ్ కప్ పోయినట్లే!
Advertisement

ఫోటో గ్యాలరీ

Advertisement
ABP Premium

వ్యక్తిగత కార్నర్

అగ్ర కథనాలు
టాప్ రీల్స్
Putin in India: ఢిల్లీలో రష్యా అధ్యక్షుడు పుతిన్ - ప్రోటోకాల్ పక్కన పెట్టి స్వాగతం పలికిన ప్రధాని మోదీ
ఢిల్లీలో రష్యా అధ్యక్షుడు పుతిన్ - ప్రోటోకాల్ పక్కన పెట్టి స్వాగతం పలికిన ప్రధాని మోదీ
Andhra Investments :  ఏపీలో  మరో రూ. 20,444 కోట్ల పెట్టుబడులకు ఆమోదం - 45 రోజుల్లోగా మెజార్టీ ఎంఓయూలు గ్రౌండింగ్
ఏపీలో మరో రూ. 20,444 కోట్ల పెట్టుబడులకు ఆమోదం - 45 రోజుల్లోగా మెజార్టీ ఎంఓయూలు గ్రౌండింగ్
Deputy CM Pawan Kalyan: వ్యవస్థల్లో మార్పులు తీసుకురాకపోతే మనకు ఎన్ని పదవులు ఉన్నా వేస్ట్ - చిత్తూరులో పవన్ కల్యాణ్ కీలక వ్యాఖ్యలు
వ్యవస్థల్లో మార్పులు తీసుకురాకపోతే మనకు ఎన్ని పదవులు ఉన్నా వేస్ట్ - చిత్తూరులో పవన్ కల్యాణ్ కీలక వ్యాఖ్యలు
Loan Apps Ban: 87 లోన్ యాప్స్‌ను బ్యాన్ చేసిన కేంద్రం - ఇప్పుడు అప్పు తీసుకున్న వాళ్లందరూ ఎగ్గొట్టవచ్చా?
87 లోన్ యాప్స్‌ను బ్యాన్ చేసిన కేంద్రం - ఇప్పుడు అప్పు తీసుకున్న వాళ్లందరూ ఎగ్గొట్టవచ్చా?
Rupee Falling News: వంట నుంచి వాహనం నడపడం వరకు; రూపాయి పతనంతో జరిగే పరిణామాలు తెలుసుకోండి?
వంట నుంచి వాహనం నడపడం వరకు; రూపాయి పతనంతో జరిగే పరిణామాలు తెలుసుకోండి?
Akhanda 2 Nizam Bookings: అప్పుడు వీరమల్లు... ఇప్పుడు అఖండ 2... టికెట్ రేట్స్ కోసం భారీ రిస్క్!
అప్పుడు వీరమల్లు... ఇప్పుడు అఖండ 2... టికెట్ రేట్స్ కోసం భారీ రిస్క్!
US warning to Pakistan:  ఇమ్రాన్ ను వదిలి పెట్టాలని మునీర్‌పై అమెరికా ఒత్తిడి - ఆంక్షలకు సిద్దమవ్వాలని హెచ్చరిక
ఇమ్రాన్ ను వదిలి పెట్టాలని మునీర్‌పై అమెరికా ఒత్తిడి - ఆంక్షలకు సిద్దమవ్వాలని హెచ్చరిక
Putin Religion: లౌకిక దేశమైన రష్యా అధ్యక్షుడు పుతిన్ ఏ మతాన్ని పాటిస్తారు? దేవుడిపై నమ్మకం ఉందా?
లౌకిక దేశమైన రష్యా అధ్యక్షుడు పుతిన్ ఏ మతాన్ని పాటిస్తారు? దేవుడిపై నమ్మకం ఉందా?
Embed widget