By: ABP Desam | Updated at : 01 May 2023 08:58 PM (IST)
Image Credit: AK Entertainments/Twitter
అక్కినేని యంగ్ హీరో అఖిల్ నటించిన లేటెస్ట్ మూవీ ఏజెంట్ బాక్సాఫీస్ దగ్గర పరాజయాన్ని చవి చుసిన సంగతి తెలిసిందే. ఎన్నో అంచనాలు నడుమ ఏప్రిల్ 28 న విడుదలైన ఈ సినిమా మొదటి ఆట నుంచే నెగటివ్ టాక్ ని సొంతం చేసుకుంది. స్టైలిష్ డైరెక్టర్ సురేందర్ రెడ్డి డైరెక్ట్ చేసిన ఈ మూవీ ఫ్యాన్స్ తో పాటు ఆడియన్స్ ని తీవ్రంగా నిరాశపరిచింది. ఏకె ఎంటర్టైన్మెంట్ బ్యానర్ పై అనిల్ సుంకర ఈ చిత్రాన్ని సుమారు రూ.80 కోట్ల బడ్జెట్ తో నిర్మించాడు. డైరెక్టర్ సురేందర్ రెడ్డి కూడా ఈ సినిమాకి సహా నిర్మాతగా వ్యవహరించారు. సినిమాలో అఖిల్ సరసన సాక్షి వైద్య హీరోయిన్ గా నటించగా,మలయాళ మెగాస్టార్ మమ్ముట్టి మరో కీలేక పాత్ర పోషించారు.
ఇక రిలీజైన మొదటి రోజు రూ.7 కోట్ల గ్రాస్ అందుకున్న ఈ సినిమా.. రెండవ రోజు కలెక్షన్స్ దారుణంగా పడిపోవడంతో బాక్సాఫీస్ దగ్గర ఏజెంట్ డిజాస్టర్ గా నిలిచించి. ఇక ఈ సినిమాపై ఆడియన్స్ నుండి ఎన్నో రకాల విమర్శలు వచ్చిన విషయం తెలిసిందే. అయితే తాజాగా ఏజెంట్ ఫలితంపై సినిమా నిర్మాత అనిల్ సుంకర స్వయంగా స్పందించారు. ఈ మేరకు ట్విట్టర్ వేదికగా అనిల్ సుంకర ట్వీట్ చేస్తూ.. "ఏజెంట్ ఫలితానికి పూర్తి భాద్యత మాదే. ఏజెంట్ లాంటి సినిమాని నిర్మించడం అసాధ్యమే అయినప్పటికీ మేము దాన్ని సుసాధ్యం చేయాలనుకుని ఫెయిల్ అయ్యాం. బౌండెడ్ స్క్రిప్ట్ లేకుండా ప్రాజెక్ట్ ని స్టార్ట్ చెయ్యడం మాకు పెద్ద మైనస్ గా మారింది. దానికి తోడు కోవిడ్ ప్రభావం సినిమాపై పడింది.
We have to take the entire blame for #Agent. Though we know its an uphill task, we thought of conquering but failed to do so as we did a blunder starting the project without a bound script & innumerable issues including covid followed. We don't want to give any excuses but learn…
— Anil Sunkara (@AnilSunkara1) May 1, 2023
దాంతో అనుకున్న స్థాయిలో సినిమాను తీయలేకపోయాం. ఇలాంటి తప్పును మళ్ళీ రిపీట్ చేయం.మాపై నమ్మకం పెట్టుకున్న వాళ్లందరికీ ఈ సందర్భంగా క్షమాపణలు కోరుతున్నాము. ఇక నుంచి మా ఫ్యూచర్ ప్రాజెక్ట్స్ కోసం ఎంతో హార్డ్ వర్క్, అలాగే డెడికేషన్ తో పని చేస్తాం" అంటూ పేర్కొన్నారు. ఏజెంట్ మూవీ రిజల్ట్ పై అనిల్ సుంకర చేసిన ఈ ట్వీట్స్ ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ గా మారుతున్నాయి. కాగా ఇటీవల అక్కినేని అమల కూడా ఏజెంట్ ట్రోలింగ్స్ పై రెస్పాండ్ అయిన సంగతి తెలిసిందే. ఏజెంట్ సినిమాని నేను పూర్తిగా ఆస్వాదించానని,సినిమాలో లోపాలు ఉన్నప్పటికీ మీర్ దాన్ని ఓపెన్ మైండ్ తో చుస్తే ఆశ్చర్యపోతారని..
సుమారు 50% మంది ఆడియన్స్ తమ భర్తలు,కొడుకులతో పాటు తల్లులు ,అమ్మమ్మలు కూడా సినిమాని ఎంజాయ్ చేస్తున్నారని చెప్పుకొచ్చింది. అఖిల్ గత సినిమా మోస్ట్ ఎలిజిబుల్ బ్యాచిలర్ కమర్షియల్ గా సక్సెస్ కానప్పటికీ మూవీ మాత్రం హిట్ గా నిలిచింది. సినిమాలో పాటలు,అఖిల్ పూజ హెగ్డే స్క్రీన్ ప్రెజెన్స్ అలాగే బొమ్మరిల్లు భాస్కర్ డైరెక్షన్ ఆడియన్స్ ని ఆకట్టుకుంది. అయితే ఏజెంట్ తో భారీ కమర్షియల్ హిట్ కొట్టాలని ఏజెంట్ కోసం చాలా హార్డ్ వర్క్ చేశాడు. అయినా ఫలితం లేకపోయింది. ఏజెంట్ సినిమా కోసం అఖిల్ సుమారు రెండేళ్లు కష్టపడ్డాడు. సినిమాలో రా ఏజెంట్ గా కనిపించడం కోసం సిక్స్ ప్యాక్ బాడీ ని బిల్డ్ చేశాడు. ఎలాగైనా ఈ సినిమాతో మంచి కమర్షియల్ హిట్ కొట్టాలన్న అఖిల్ కల.. కలగానే మిగిలిపోయింది.
Also Read: నాకు మాట రాకున్నా అర్థం చేసుకున్నారు, నా డ్రైవర్ ఏడ్చేశాడు - సాయి ధరమ్ తేజ్ భావోద్వేగం
SSMB28 Mass Strike: 20 ఏళ్ల తర్వాత మళ్లీ కబడ్డీ ఆడుతున్న మహేష్!
Allu Sirish: సందీప్ కిషన్ కాదన్న కథతో అల్లు శిరీష్? - అఫీషియల్ అనౌన్స్‌మెంట్ రేపే!
PKSDT: దేవుడి షూ కాస్ట్ ఎంతో తెలిస్తే షాక్ అవుతారు 'బ్రో'..!
మామతో అల్లుడి పోజు, పవన్ మూవీ సెట్‌లో మంటలు, చెర్రీపై అక్కినేని ఫ్యాన్స్ అలక - మరిన్ని సినీ విశేషాలు మీ కోసం!
Prasanth Varma: 8 మంది సూపర్ హీరోస్ మూవీస్ తీస్తా, ‘ఆది పురుష్’ ప్రభావం ‘హనుమాన్’ మీద ఉండదు: ప్రశాంత్ వర్మ
CPI Narayana : సీఎం జగన్‌కు పదవిలో ఉండే అర్హత లేదు - రాజీనామా చేయాలన్న సీపీఐ నారాయణ !
Telangana News : పొంగులేటి, జూపల్లి బీజేపీలో చేరడం కష్టమే - ఈటల నిర్వేదం !
CSK Vs GT, Final: గత నాలుగు మ్యాచ్‌ల్లోనూ బ్యాటింగే - ఇప్పుడు బౌలింగ్ ఎందుకు - ధోని మాస్టర్ ప్లాన్ ఏంటి?
Partner Swapping Case: భార్యల మార్పిడి కేసులో సంచలనం, విషం తాగిన నిందితుడు - మృతి