By: ABP Desam | Updated at : 11 Jun 2022 12:50 PM (IST)
యశ్, ప్రభాస్, ప్రశాంత్ నీల్, ఎన్టీఆర్
ఇప్పుడు మల్టీస్టారర్ సినిమాలకు సౌతిండియన్ హీరోలు 'సై' అంటున్నారు. అదీ యాక్షన్ ప్యాక్డ్ కథలకు ఇంట్రెస్ట్ చూపిస్తున్నారు. అందుకు, కమల్ హాసన్ 'విక్రమ్' ఒక ఉదాహరణ. ఆ సినిమా చివర్లో సూర్య కనిపించారు. సూర్య పోషించిన రోలెక్స్ పాత్రపై ఒక సినిమా ఉంటుంది. 'విక్రమ్ 2'లో కమల్, సూర్య, కార్తీ తదితర హీరోలు ఉంటారని టాక్. అది పక్కన పెడితే... అటువంటి భారీ మల్టీస్టారర్ సినిమాను ప్రశాంత్ నీల్ ప్లాన్ చేస్తున్నారని టాక్.
'కెజియఫ్', 'కెజియఫ్ 2'తో ప్రశాంత్ నీల్ పేరు మారుమ్రోగుతోంది. ఇప్పుడు ఆయన ప్రభాస్ హీరోగా 'సలార్' తీస్తున్నారు. అదీ రెండు భాగాలుగా విడుదల కానుంది. ఆ తర్వాత ఎన్టీఆర్‌తో ఒక సినిమా ప్లానింగ్‌లో ఉంది. ఆ సినిమా అయ్యాక... 'కెజియఫ్'లో రాకీ భాయ్, 'సలార్'లో ప్రభాస్, ఎన్టీఆర్‌తో చేయబోయే సినిమాలో హీరో పాత్రలు ఉండేలా ఒక స్క్రిప్ట్ అనుకుంటున్నారట. ముగ్గురు హీరోలతో ఒక మల్టీస్టారర్ ప్లాన్ చేస్తున్నారట.
ఆల్రెడీ 'కెజియఫ్ 2'లో నటి ఈశ్వరీ రావు కుమారుడిగా కనిపించిన అబ్బాయి పాత్ర పేరు సలార్. అతడు పెద్దయ్యాక ప్రభాస్ అవుతాడనే టాక్ నడుతోంది. ఆ పాత్రను ఆధారంగా చేసుకుని 'సలార్' సినిమా తీస్తున్నారని ఒక కథనం. సలార్ (ప్రభాస్) ఆర్మీ సాయంతో పార్లమెంట్ మీద రాఖీ భాయ్ ఎటాక్ చేశాడనేది కొంత మంది ఊహ. 'కెజియఫ్ 3'లో ప్రభాస్ కూడా ఉంటారని... అది యశ్, ప్రభాస్ మల్టీస్టారర్ అనే మాటలు వినబడుతున్నాయి (Prabhas Yash Mutli Starrer). ఇప్పుడు ఎన్టీఆర్ పేరు కూడా యాడ్ అయ్యింది.
ఆ మధ్య ఒక ఇంటర్వ్యూలో 'కెజియఫ్', 'సలార్' చిత్రాల నిర్మాత, హోంబలే ఫిలిమ్స్ అధినేత విజయ్ కిరగందూర్ మాట్లాడుతూ ''మేం 'కెజియఫ్ 3'ను (Prabhas In KGF 3) మార్వెల్ యూనివర్స్ తరహాలో డిజైన్ చేసుకున్నాం. వివిధ చిత్రాల్లో హీరోలు ఇందులో ఉంటారు. 'డాక్టర్ స్ట్రేంజ్', 'స్పైడర్ మ్యాన్' క్యారెక్టర్లు ఒక సినిమాలో కలిసినట్టు... ఈ సినిమాలోనూ వివిధ సినిమాల్లో హీరోలు కలుస్తారు'' అని చెప్పారు. ఇప్పుడు కన్నడ ఇండస్ట్రీ నుంచి వినబడుతున్న మాటలు వింటుంటే... అందులో ఎన్టీఆర్ ఉన్నా ఆశ్చర్యపోనవసరం లేదు (NTR In KGF 3 Movie).
Also Read: మహేష్ - ప్రభాస్ మల్టీస్టారర్‌కు 'నో' చెప్పిన ప్రొడ్యూసర్
అయితే... ఒక్క సందేహం మాత్రం ఇండస్ట్రీ ప్రముఖులకు కలుగుతోంది. మూడు పవర్‌ఫుల్ క్యారెక్టర్లతో స్క్రిప్ట్ రాయడం, ముగ్గురు హీరోలను ఒప్పించడం అంత సులభం కాదు. అయితే... 'కెజియఫ్', 'కెజియఫ్ 2'లో హీరో ఎలివేషన్లు చూశాక... ప్రశాంత్ నీల్ చేయగలడని చాలా మంది నమ్ముతున్నారు. ఏం జరుగుతుందో? వెయిట్ అండ్ సీ.
Also Read: ప్రభాస్ ఇంట్రెస్టింగ్‌గా ఉందన్నాడు - 'బాహుబలి' నిర్మాతల నుంచి ఓటీటీ సినిమా
Look Back 2023: భారీ సక్సెస్ కొట్టిన చిన్న సినిమాలు - ఈ ఏడాది టాలీవుడ్‌లో క్రేజీ సిక్సర్!
Namo Movie: నమో - నరేంద్ర మోడీ కాదండోయ్, సర్వైవల్ కామెడీ సినిమా!
Guntur Kaaram Song: మహేష్ బాబుకు శ్రీలీల ముద్దు - 'గుంటూరు కారం'లో రెండో పాట రెడీ!
‘మంగళవారం’ ఓటీటీ స్ట్రీమింగ్, ‘బ్రహ్మాస్త్ర 2’ అప్‌డేట్ - నేటి టాప్ సినీ విశేషాలివే!
Brahmanandam: ‘యానిమల్’లో కొడుకు పాత్రలో బ్రహ్మానందం, తండ్రి ఎవరో తెలుసా? ఈ వీడియో చూస్తే నవ్వు ఆపుకోలేరు
Bhatti Vikramarka: లక్షల కోట్ల అప్పుల్లో తెలంగాణ, ఛాలెంజ్ గా ఆర్థికశాఖ తీసుకున్నాను: భట్టి విక్రమార్క
2024 TVS Apache RTR 160 4V: సూపర్ డిజైన్, అదిరిపోయే లుక్‌తో వచ్చిన కొత్త అపాచీ - ధర ఎంతో తెలుసా?
Mahalaxmi Scheme: రాష్ట్రంలో ఉచిత బస్సు ప్రయాణం - ప్రభుత్వ నిర్ణయంపై మహిళల హర్షం
Telangana Ministers Portfolios: నాలుగు కేబినెట్‌లలో సభ్యుడిగా తుమ్మల రికార్డు- 11 మందికి కేటాయించిన శాఖల ప్రత్యేకతలు ఇవే
/body>