Anya's Tutorial Teaser: ప్రభాస్ ఇంట్రెస్టింగ్‌గా ఉందన్నాడు - 'బాహుబలి' నిర్మాతల నుంచి ఓటీటీ సినిమా
'బాహుబలి' నిర్మాతలు ఓటీటీ సినిమా 'అన్యాస్ ట్యుటోరియల్' నిర్మించారు. టీజర్ విడుదల చేసిన ప్రభాస్, ఇంట్రెస్టింగ్‌గా ఉందన్నారు. అది మీరు చూశారా?

Regina Cassandra In Anya's Tutorial Movie: రెజీనా కాసాండ్రా, నివేదితా సతీష్ ప్రధాన పాత్రల్లో నటించిన సినిమా 'అన్యాస్ ట్యుటోరియల్'. బాహుబలి నిర్మాతలు తీసిన చిత్రమిది. జూలై 1 నుంచి ఆహా ఓటీటీ వేదికలో స్ట్రీమింగ్ కానుంది. ఆహాతో కలిసి ఆర్కా మీడియా వర్క్స్ తెరకెక్కించింది. ఈ సినిమా టీజర్‌ను యంగ్ రెబల్ స్టార్ ప్రభాస్ విడుదల చేశారు.
''అన్యాస్ ట్యుటోరియల్ టీజర్ ఇంట్రెస్టింగ్‌గా ఉంది. దీనిని విడుదల చేయడం చాలా సంతోషంగా ఉంది. టీమ్ అందరికీ ఆల్ ది బెస్ట్'' అని చెప్పారు. టీజర్ విషయానికి వస్తే... ఒక అపార్ట్‌మెంట్‌లో ఒక్క అమ్మాయి మాత్రమే ఉంటుంది. అక్కడ దెయ్యాలు ఉంటాయి. ఆ తర్వాత ఏం జరిగిందనేది కథ.
'రాకెట్ బాయ్స్' వెబ్ సిరీ స్‌తో రెజీనా ఓటీటీలో అడుగు పెట్టారు. ఆమెకు రెండో ఓటీటీ ప్రాజెక్ట్ ఇది. ఆమె నటించిన 'శాకినీ డాకినీ' కూడా ఓటీటీ విడుదల కానుందని టాక్. ఈ ఏడాది విడుదలైన 'ఆచార్య'లో ఆమె స్పెషల్ సాంగ్ చేసిన సంగతి తెలిసిందే.
Also Read: మహేష్ - ప్రభాస్ మల్టీస్టారర్‌కు 'నో' చెప్పిన ప్రొడ్యూసర్
రెజీనా, నివేదితా పాత్రలు ఆసక్తికరంగా ఉన్నాయి. థ్రిల్లర్ సినిమాలకు ఓటీటీలో మంచి ఆదరణ ఉంటుంది. జూలై 1న విడుదలయ్యే ఈ సినిమాకూ మంచి ఆదరణ లభిస్తుందని ఆశించవచ్చు. ''డ్రీమ్ బిగ్ అంటారు. అసలు, దాని కాస్ట్ ఏంటో తెలుసా? కొన్నిసార్లు వెనక్కి తిరిగి చూసుకోకపోవడమే మంచిది. జూలై 1 నుంచి భయపడడానికి రెడీగా ఉండండి'' అని 'ఆహా' ఓటీటీ వేదిక పేర్కొంది.
Also Read: తిరుమలలో చెప్పులతో - క్షమాపణలు కోరిన నయన్ భర్త విఘ్నేష్, వివాదానికి ఫుల్ స్టాప్ పడుతుందా?
View this post on Instagram
Before You Go
Bigg Boss Agnipariksha Uppal Balu | అగ్నిపరీక్షపై ఉప్పల్ బాలు సంచలన వ్యాఖ్యలు
టాప్ హెడ్ లైన్స్
ట్రెండింగ్ వార్తలు





















