Prashanth Neel Birthday : ప్రశాంత్ నీల్ పుట్టినరోజు - విషెస్ చెప్పిన ప్రభాస్, 'సలార్' మేకింగ్ వీడియో విడుదల
‘సలార్’ దర్శకుడు ప్రశాంత్ నీల్ కు సలార్ టీమ్ శుభాకాంక్షలు తెలిపింది. అంతే కాదు ఆయన బర్త్ డే సందర్భంగా ప్రశాంత్ నీల్ పై ఓ స్పెషల్ వీడియోను విడుదల చేశారు.
Prashanth Neel: ప్రస్తుతం సౌత్ ఇండియా సినీ పరిశ్రమ నుంచి భారీ పాన్ ఇండియా సినిమాలు తెరకెక్కుతున్నాయి. అలాంటి వాటిలో టాలీవుడ్ స్టార్ హీరో ప్రభాస్ నటిస్తోన్న ‘సలార్’ మూవీ కూడా ఒకటి. ఈ సినిమాకు ‘కేజీఎఫ్’ ఫేమ్ దర్శకుడు ప్రశాంత్ నీల్ దర్శకత్వం వహిస్తున్నారు. ‘కేజీఎఫ్’ మూవీతో దేశవ్యాప్తంగా గుర్తింపు తెచ్చుకున్నాడు ప్రశాంత్. దీంతో ఆయన ఇప్పుడు ప్రభాస్ లాంటి పాన్ ఇండియా స్టార్ తో కలసి సినిమా తీస్తుండటంతో ఈ మూవీ పై అంచనాలు భారీగా పెరిగిపోయాయి. ఇప్పటికే ఈ సినిమా షూటింగ్ శరవేగంగా జరుగుతోంది. అయితే జూన్ 4 న దర్శకుడు ప్రశాంత్ నీల్ పుట్టనరోజు. ఈ సందర్భంగా ‘సలార్’ మూవీ టీమ్ ఆయనకు ప్రత్యేకంగా పుట్టిన రోజు శుభాకాంక్షలు తెలిపింది.
స్పెషల్ వీడియోతో బర్త్ డే విసెష్..
‘సలార్’ దర్శకుడు ప్రశాంత్ నీల్ కు సలార్ టీమ్ శుభాకాంక్షలు తెలిపింది. అంతే కాదు ఆయన బర్త్ డే సందర్భంగా ప్రశాంత్ నీల్ పై ఓ స్పెషల్ వీడియోను విడుదల చేశారు. ఈ వీడియోలో ‘సలార్’ షూటింగ్ స్పాట్ లో ప్రశాంత్ నీల్ ఎలా ఉంటాడో చూపించే విధంగా ఈ వీడియోను రూపొందించారు మేకర్స్. సాధారణంగా బయటకు వచ్చినపుడు ప్రశాంత్ చాలా ప్రశాంతంగా నవ్వుతూ కనిపిస్తుంటాడు. కానీ షూటింగ్ స్పాట్ లో మాత్రం చాలా సీరియస్ గా ఉంటాడని ఈ వీడియో చూస్తే అర్థమైపోతుంది. అలాగే షూటింగ్ కు కాస్త విరామం దొరికితే ప్రశాంత్ ఎలా ఉంటాడు అనేది కూడా వీడియోలో కనిపిస్తోంది. ఈ వీడియో చూస్తూ చాలు ప్రశాంత్ నీల్ సెట్ లో ఏ విధంగా ఉంటాడో తెలిసిపోతుంది. ప్రస్తుతం ఈ వీడియో నెట్టింట వైరల్ అవుతోంది. అంతకు ముందు ప్రశాంత్ నీల్ పుట్టిన రోజు వేడుకలను మూవీ టీమ్ సెట్స్ లో సెలబ్రేట్ చేసింది. ఈ బర్త్ డే వేడుకలో హీరో ప్రభాస్ కూడా పాల్గొన్నాడు. కేక్ తినిపించి ప్రశాంత్ నీల్ కు పుట్టిన రోజు శుభాకాంక్షలు తెలిపాడు. ఇందుకు సంబంధించిన ఫోటోలు నెట్టింట వైరల్ అవుతున్నాయి.
ఈ ఏడాదిలోనే ‘సలార్’ మూవీ..
ప్రస్తుతం సలార్ షూటింగ్ పనులు శర వేగంగా జరుగుతున్నాయి. ఇప్పటికే ఈ సినిమా అనౌన్స్ చేసి చాలా రోజులు అవుతోంది. అయితే మధ్య మధ్యలో కొన్ని ఆటంకాలు రావడం వలన మూవీ షూటింగ్ కాస్త లేట్ అవుతూ వచ్చింది. ఇప్పుడు మళ్లీ వేగంగా షూటింగ్ జరుగుతోంది. ఎట్టిపరిస్థితుల్లోనూ మూవీను వీలైనంత త్వరగా పూర్తి చేసి సెప్టెంబర్ 28 కు రిలీజ్ చేయాలనే యోచనలో ఉంది మూవీ టీమ్. అలాగే ఈ మూవీలో పృథ్వీరాజ్ సుకుమారన్, శ్రుతి హాసన్, జగపతి బాబు, మీనాక్షి చౌదరి తదితరులు ప్రధాన పాత్రలు పోషిస్తున్నారు. భారీ బడ్జెట్ తో హొంబలే ప్రొడక్షన్స్ బ్యానర్ లో ఈ మూవీను నిర్మిస్తున్నారు. రవి బస్రూర్ ఈ సినిమాకు సంగీతం అందిస్తున్నారు. మరి ఈ సినిమాతో దర్శకుడు ప్రశాంత్ నీల్ ఎలాంటి విజయాన్ని అందుకుంటారో చూడాలి.
Also Read : మహేష్ బాబు - దీపికా పదుకోన్ - 'ఫిదా' చేసి ఉంటేనా? ఎందుకు 'నో' చెప్పారంటే?
View this post on Instagram