Raja Saab Teaser Review - 'రాజా సాబ్' టీజర్ ఫస్ట్ రివ్యూ: టోటల్ ఇండియా షేక్ అవుతుందంతే... హైప్ పెంచిన 'హనుమాన్' డైరెక్టర్
Raja Saab Teaser Reactions: 'ది రాజా సాబ్' టీజర్ అఫీషియల్‌గా రిలీజ్ చేయడానికి ముందు కొంత మంది సెలబ్రిటీలకు చూపించారు. చూసిన వారిలో ప్రశాంత్ వర్మ, అశ్విన్ బాబు ఉన్నారు. వాళ్ళ రియాక్షన్స్ ఏమిటంటే?

ఇప్పుడు దేశమంతా 'ది రాజా సాబ్' టీజర్ రిలీజ్ మేనియా నెలకొంది. రెబల్ స్టార్ ప్రభాస్ సినిమా అంటే ఆ మాత్రం క్రేజ్ ఉండటం మినిమమ్ కదా! ఫ్యాన్స్, కామన్ ఆడియన్స్ కంటే కొన్ని గంటల ముందు టీజర్ చూసే అవకాశం కొంత మంది సెలబ్రిటీలకు వచ్చింది. పీపుల్ మీడియా ఫ్యాక్టరీ అధినేత, చిత్ర నిర్మాత టీజీ విశ్వప్రసాద్ కుమార్తె పుట్టినరోజు సందర్భంగా పార్టీ ఇచ్చారు. అందులో టీజర్ ప్లే చేశారు. అక్కడ టీజర్ చూసిన సెలబ్రిటీలలో 'హనుమాన్' దర్శకుడు ప్రశాంత్ వర్మ, యంగ్ హీరో అశ్విన్ బాబు ఉన్నారు. వాళ్లిద్దరూ ఇచ్చిన రివ్యూలు ఎలా ఉన్నాయో చూడండి.
హోల్ ఇండియా షేక్ అవుతుంది!
Raja Saab Teaser First Review: ''ఇప్పుడే 'ది రాజా సాబ్' టీజర్ ఎక్స్‌పీరియన్స్ చేశా (చూశా). నార్త్ ఏంటి? సౌత్ ఏంటి? డార్లింగ్స్... ఇండియా అంతా షేక్ అవుతుంది'' అని ప్రశాంత్ వర్మ ట్వీట్ చేశారు.
Also Read: రాజా సాబ్ టీజర్ రిలీజ్: ప్రభాస్ ఫ్యాన్స్‌కు పండగ, ఇవాళ్టి కంప్లీట్ ప్రోగ్రామ్స్ షెడ్యూల్ ఇదిగో
Just experienced!! 👻
— Prasanth Varma (@PrasanthVarma) June 15, 2025
నార్త్ ఏంటి సౌత్ ఏంటి డార్లింగ్స్... whole India shake tomorrow!! 🔥
వింటేజ్ ప్రభాస్ అన్నా ఈజ్ బ్యాక్!
'ది రాజా సాబ్'తో వింటేజ్ ప్రభాస్ ఈజ్ బ్యాక్ అని యంగ్ హీరో అశ్విన్ బాబు పేర్కొన్నారు. రాజా సాబ్ టీజర్ చూస్తే గూస్ బంప్స్ గ్యారంటీ అని, సంగీత దర్శకుడు తమన్ అందించిన నేపథ్య సంగీతం సూపర్బ్ అని ఆయన ట్వీట్ చేశారు. ఇండియా అంతా 'రాజా సాబ్' మ్యాడ్‌నెస్ చూస్తుందని తెలిపారు. వీళ్ళిద్దరూ టీజర్ మీద మరిన్ని అంచనాలు పెంచారు.
OUT OF THE PARK 💥💥💥💥💥💥💥💥💥🔥🔥🔥🔥🔥🔥🔥🔥🔥🔥 🔥 🔥 🔥 🔥 🔥
— Ashwin Babu (@imashwinbabu) June 15, 2025
ENTIRE INDIA GOING TO WITNESS THE MADNESSSS OF @rajasaabmovie FROM TOMORROW
" Our Vintage Darling Prabhas Anna Is Back "
Goosebumps Guaranteed.....
BGM 👌👌👌👌👌👌👌👌
Congratulations My Dearest… pic.twitter.com/xNIRr8SyIq
చితక్కొట్టేద్దాం... అభిమానులకు ఫీస్ట్!
''ఇప్పటి వరకు ఒక లెక్క... ఇప్పటి నుంచి మరో లెక్క. 'ది రాజా సాబ్' సినిమా అభిమానులు అందరూ సెలబ్రేట్ చేసుకునేలా ఉంటుంది. ప్రేక్షకులు అందరికీ ఒక విజువల్ ఫీస్ట్. అందరూ గర్వపడేలా చేస్తాం. చితక్కొట్టేద్దాం'' అని 'ది రాజా సాబ్' టీమ్ పేర్కొంది.
Ippati Varaku oka Lekka…
— The RajaSaab (@rajasaabmovie) June 15, 2025
Repati nundi oka lekka….#TheRajaSaab is a FAN CELEBRATION.
A True visual feast for the audience.
All these years, it’s been your love.
Now see ours tomorrow.
We’re all in to make you proud. ❤️
CHITHAKOTTEDDAM 💪🏼🔥#Prabhas #TheRajaSaabTeaser pic.twitter.com/Z9fzhwNGVK
ప్రభాస్ సరసన నిధి అగర్వాల్, మాళవికా మోహనన్, రిద్ధి కుమార్ హీరోయిన్లుగా నటించిన ఈ సినిమాకు మారుతి దర్శకత్వం వహించారు. పీపుల్ మీడియా ఫ్యాక్టరీ పతాకం మీద టీజీ విశ్వప్రసాద్ ప్రొడ్యూస్ చేశారు. తమన్ సంగీతం అందిస్తున్నారు.





















