Prasanth Varma: ఆ కారణం వల్ల రాజమౌళిని ద్వేషించాను - ‘హనుమాన్’ డైరెక్టర్ ప్రశాంత్ వర్మ
Prasanth Varma: ‘హనుమాన్’తో తన టాలెంట్ ఏంటో నిరూపించుకున్నాడు యంగ్ డైరెక్టర్ ప్రశాంత్ వర్మ. అయితే ఈ డైరెక్టర్ ఒకప్పుడు రాజమౌళిని ద్వేషించానని చెప్తూ దానికి కారణాన్ని కూడా బయటపెట్టాడు.
Prasanth Varma about Rajamouli: ‘హనుమాన్’ మూవీతో ఒక్కసారి స్టార్ సెలబ్రిటీల దృష్టిలో పడ్డాడు దర్శకుడు ప్రశాంత్ వర్మ. సంక్రాంతి రేసులో అన్నింటికంటే ముందుగా బరిలోకి దిగిన ‘హనుమాన్’ మిగతా సినిమాలకంటే అత్యధిక వసూళ్లతో పాటు పాజిటివ్ ఫీడ్ బ్యాక్‌ను కూడా అందుకుంది. ఇప్పటికే చాలా ప్రాంతాల్లో ‘హనుమాన్’ హౌజ్‌ఫుల్ షోలతో రన్ అవుతోంది. అందుకే ఇప్పుడు ప్రశాంత్ వర్మ సినిమాటిక్ యూనివర్స్‌పై ప్రేక్షకుల్లో భారీగా అంచనాలు పెరిగిపోయాయి. ఇప్పటికే ‘హనుమాన్’ ప్రమోషన్స్‌లో బిజీగా ఉన్న ఈ దర్శకుడు.. దర్శక ధీరుడు రాజమౌళిపై ఆసక్తికర వ్యాఖ్యలు చేశాడు.
దర్శకుడిగా నమ్మలేదు..
‘హనుమాన్’లాంటి విజువల్ వండర్ సినిమాను అతి తక్కువ బడ్జెట్‌లో తెరకెక్కించినందుకు ప్రశాంత్ వర్మను స్టార్ దర్శకులు, నిర్మాతలు సైతం ప్రశంసిస్తున్నారు. కానీ ఒకప్పుడు తన విజన్‌ను ఎవరూ నమ్మలేదు. ఆఖరికి ‘హనుమాన్’ తెరకెక్కించిన తర్వాత కూడా ప్రశాంత్ విజన్‌ను, టాలెంట్‌ను ప్రేక్షకులు సైతం నమ్మలేదు. తన కాన్ఫిడెన్స్ చూసి ట్రోల్ చేశారు కూడా. అలా నమ్మని దర్శకుల్లో దర్శక ధీరుడు రాజమౌళి కూడా ఒకరట. ఒకసారి రాజమౌళి దగ్గర అసిస్టెంట్‌గా పనిచేయడానికి ప్రశాంత్ వర్మ ప్రయత్నించాడట. కానీ ప్రశాంత్ వర్మను అసిస్టెంట్‌లాగా తీసుకోవడానికి రాజమౌళి ఒప్పుకోలేదని తెలుస్తోంది. దీంతో జక్కన్నపై వర్మకు ద్వేషం ఏర్పడిందట. తాజాగా ప్రశాంత్ వర్మ పాల్గొన్న ఒక ఇంటర్వ్యూలో ఇదే విషయాన్ని బయటపెట్టాడు.
ఎన్నో మెయిల్స్, మెసేజ్‌లు పెట్టాను..
‘‘నేను ఇంజనీరింగ్ చదివే రోజుల్లో రాజమౌళిని అసిస్టెంట్ చేయాలనుకుంటున్నానని అప్రోచ్ అయ్యాను. ఇదే విషయం చెప్పడానికి ఆయనకు ఎన్నో మెయిల్స్ చేశాను. ట్విటర్‌లో మెసేజ్‌లు పెట్టాను. చాలారోజుల తర్వాత నాకు రిప్లై వచ్చింది. తన టీమ్ ఫుల్ అయిపోయిందని, మరికొంత మందిని తాను యాడ్ చేసుకోలేనని రాజమౌళి చెప్పారు. ఆ విషయం నన్ను బాధపెట్టింది. హార్డ్ వర్క్, టాలెంట్ ఉన్నా కూడా నన్నెందుకు అసిస్టెంట్‌లాగా తీసుకోవడం లేదు అనుకున్నాను’’ అంటూ అప్పటి విషయాలను గుర్తుచేసుకున్నాడు ప్రశాంత్ వర్మ. అంతే కాకుండా అడిగినా కూడా ఛాన్స్ ఇవ్వలేదని రాజమౌళి అంటే ద్వేషం ఉండేదని స్టేట్‌మెంట్ కూడా ఇచ్చాడు.
ఆయన సినిమాలే ఫిల్మ్ యూనివర్సిటీ..
రాజమౌళి తెరకెక్కించిన సినిమాలను తానొక ఫిల్మ్ యూనివర్సిటీలాగా భావిస్తానని ఒకానొక సందర్భంలో బయటపెట్టాడు ప్రశాంత్ వర్మ. ఫిల్మ్ మేకింగ్‌లో మెలకువలను ఆయన సినిమాలు చూసే తెలుసుకుంటానని చెప్పాడు. అంతే కాకుండా ‘హనుమాన్’ను తెరకెక్కిస్తున్న క్రమంలో ‘ఆర్ఆర్ఆర్’ నుండే ఎన్నో విషయాలను ఇన్‌స్పిరేషన్‌లాగా తీసుకున్నానని కూడా తెలిపాడు. ఇక ఇప్పుడు ప్రశాంత్ వర్మ తెరకెక్కించిన ‘హనుమాన్’ చూసి ఎందరో అప్‌కమింగ్ డైరెక్టర్లు కూడా ఇదే ఫీలవుతున్నారు. హనుమంతుడు లాంటి దేవుడిని సూపర్ హీరోగా చూపించి.. అలాంటి కథాంశంతో విజువల్ వండర్‌ను క్రియేట్ చేశాడు ఈ యంగ్ డైరెక్టర్. ఇక ప్రశాంత్ వర్మ సినిమాటిక్ యూనివర్స్ నుండి విడుదలయిన మొదటి సినిమాగా ‘హనుమాన్’ బ్లాక్‌బస్టర్ హిట్‌ను అందుకోవడంతో యూనివర్స్‌లోని తరువాతి సినిమాలపై ఫోకస్ పెట్టాడు ప్రశాంత్. జనవరి 22న ‘జై హనుమాన్’ అంటూ మరో మూవీని అనౌన్స్ చేశాడు.
Also Read: విజయ్ నా కళ్ల ముందు పెరిగాడు, అతడు నాకు పోటీ కాదు: రజనీకాంత్