Salaar 2 Teaser Update: ప్రభాస్ ఫ్యాన్స్ వెయిట్ చేస్తున్న న్యూస్... 'సలార్ 2' టీజర్ అప్డేట్... రిలీజ్ ఉంటుందా?
Salaar 2 Teaser Telugu: రెబల్ స్టార్ ప్రభాస్ అభిమానులకు 'బాహుబలి' తర్వాత బాగా కిక్ ఇచ్చిన సినిమా 'సలార్'. అందులో యాక్షన్ సీక్వెన్సులకు గూస్ బంప్స్ వచ్చాయి. ఇప్పుడు ఆ సినిమా సీక్వెల్ అప్డేట్ తెలుసా?

పాన్ ఇండియా రెబల్ స్టార్ ప్రభాస్ (Prabhas) హీరోగా నటించిన తాజా సినిమా 'ది రాజా సాబ్'. బాక్సాఫీస్ వద్ద ఫ్లాప్ అయ్యింది. 'ది రాజా సాబ్' ఫ్లాప్ తర్వాత అభిమానులు అతని తదుపరి చిత్రం కోసం ఎదురు చూస్తున్నారు. ప్రస్తుతం ప్రభాస్ చేతిలో నాలుగైదు సినిమాలు ఉన్నాయి. కానీ, ఫ్యాన్స్ మాత్రం బాక్సాఫీస్ వద్ద అనేక రికార్డులు బద్దలు కొట్టిన 'సలార్' సీక్వెల్ కోసం ఎదురు చూస్తున్నారు. అందుకు కారణం... ప్రభాస్ అభిమానులకు 'బాహుబలి' తర్వాత బాగా కిక్ ఇచ్చిన సినిమా 'సలార్'. అందులో యాక్షన్ సీక్వెన్సులకు గూస్ బంప్స్ వచ్చాయి.
అందుకని, ఇప్పుడు 'సలార్ పార్ట్ 2' (Salaar Part 2 Shouryanga Parvam) కోసం ఎదురు చూస్తున్నారు. 'సలార్ పార్ట్ 2' గురించి ఒక అప్‌డేట్ వచ్చింది. రిపబ్లిక్ డే కానుకగా ఆ సినిమా టీజర్ జనవరి 25, 2026న విడుదలయ్యే అవకాశం ఉందని సోషల్ మీడియాలో చక్కర్లు కొడుతున్న న్యూస్. అది వైరల్ అవుతోంది. అయితే మేకర్స్ నుండి ఇంకా ఎటువంటి నిర్ధారణ రాలేదు.
టీజర్ విడుదల ఉంటుందా? నో క్లారిటీ!
'సలార్ 2' అనౌన్స్‌మెంట్ టీజర్ జనవరి 25, 2026 న విడుదల అవుతుందని ఒక పుకారు. ఆ వార్త అభిమానులను ఖచ్చితంగా ఉత్తేజపరిచింది. అసలు విషయం ఏమిటంటే... అందులో క్లారిటీ లేదు. సోషల్ మీడియాలో అంతటా 'సలార్ 2' గురించే చర్చ జరుగుతోంది. కానీ, ప్రస్తుతం దర్శకుడు ప్రశాంత్ నీల్ (Prashanth Neel) వేరే సినిమా పని మీద ఉన్నారు. మ్యాన్ ఆఫ్ మాసెస్ ఎన్టీఆర్ హీరోగా తెరకెక్కిస్తున్న 'డ్రాగన్' పనుల్లో బిజీగా ఉన్నారు. సో.... ఇప్పట్లో సలార్ 2 ఉండే అవకాశం లేదు. అందుకని, ఇంత త్వరగా టీజర్ విడుదల చేసే ప్లాన్ కూడా లేదు.
'సలార్ పార్ట్ 2' లో ప్రత్యేకత ఏంటి
ప్రశాంత్ నీల్ దర్శకత్వం వహించిన 'సలార్ పార్ట్ 1' సీజ్‌ఫైర్ డిసెంబర్ 22న థియేటర్లలో విడుదలైంది. విమర్శకులు, అభిమానులు ఆ సినిమాపై ప్రశంసలు కురిపించారు. 'సలార్' ఎండింగ్ క్రెడిట్స్‌లో సీక్వెల్ వెల్లడించారు. దర్శకుడు ప్రశాంత్ నీల్ ప్రీ-రిలీజ్ ఇంటర్వ్యూలో రెండవ భాగం ఇంకా చిత్రీకరించాల్సి ఉందని, తరువాత నిర్మాణం ప్రారంభమవుతుందని స్పష్టం చేశారు. పార్ట్ 1లో ఎండింగ్ క్రెడిట్ సన్నివేశం లేనప్పటికీ... సీక్వెల్ టైటిల్ 'సలార్: పార్ట్ 2 - శౌర్యంగా పర్వం' అని చెప్పారు. ప్రభాస్ పోషించిన పాత్ర శౌర్యంగ అని స్పష్టం చేశారు. రెండో పార్టులో పృథ్వీరాజ్ సుకుమారన్, ప్రభాస్ ఎలా శత్రువులు అయ్యారనేది చెబుతారు. ప్రస్తుతం ప్రభాస్ చేస్తున్న సినిమాలు అయ్యాక 'సలార్ 2' సెట్స్ మీదకు వెళుతుంది.





















