Adipurush update: గ్లోబల్ సెన్సేషన్ కు ప్రభాస్ రెడీ.. 70 దేశాల్లో 'ఆదిపురుష్' ట్రైలర్ రిలీజ్..!
పాన్ వరల్డ్ స్టార్ ప్రభాస్ నటిస్తున్న 'ఆదిపురుష్' ట్రైలర్ అప్డేట్ వచ్చేసింది. గ్లోబల్ వైడ్ గా 70 దేశాల్లో ఈ మాగ్నమ్ ఓపస్ ట్రైలర్ ను లాంచ్ చేయబోతున్నారు.
యంగ్ రెబల్ స్టార్ ప్రభాస్ నటిస్తున్న పౌరాణిక చిత్రం ''ఆదిపురుష్''. రామాయణం ఇతిహాసం ఆధారంగా బాలీవుడ్ దర్శకుడు ఓం రౌత్ ఈ సినిమాని తెరకెక్కిస్తున్నారు. ఇప్పటికే పలుమార్లు వాయిదా పడుతూ వచ్చిన ఈ మూవీ.. ఎట్టకేలకు జూన్ లో రిలీజ్ కాబోతోంది. ఈ నేపథ్యంలో మేకర్స్ ప్రమోషన్స్ షురూ చేయటానికి రెడీ అయ్యారు. ఇందులో భాగంగా తాజాగా ట్రైలర్ అప్డేట్ అందించారు.
'ఆదిపురుష్' ట్రైలర్ ను మే 9న గ్రాండ్ గా రిలీజ్ చేయబోతున్నట్లు చిత్ర బృందం సోషల్ మీడియా వేదికగా ప్రకటించింది. ఈ సందర్భంగా ఆకాశంలోకి విల్లు ఎక్కు పెట్టిన ప్రభాస్ పోస్టర్ ను షేర్ చేశారు. ఇక్కడ ఆసక్తికరమైన విషయం ఏంటంటే, ఈ అద్భుతమైన ట్రెయిలర్ ను గ్లోబల్ వైడ్ గా లాంచ్ చేయబోతున్నారు. మన దేశంలోనే కాకుండా ప్రపంచ వ్యాప్తంగా 70 దేశాలలో అత్యధిక స్క్రీన్స్ లో ఈ ట్రైలర్ ను విడుదల చేయబోతున్నారు.
Jai Shri Ram
— UV Creations (@UV_Creations) May 6, 2023
జై శ్రీరాం
जय श्री राम
ஜெய் ஸ்ரீ ராம்
ಜೈಶ್ರೀರಾಂ
ജയ് ശ്രീറാം
Trailer releasing on 9th May 2023#Adipurush #Prabhas @omraut #SaifAliKhan @kritisanon @mesunnysingh #BhushanKumar #Pramod #Vamsi #KrishanKumar @vfxwaala @rajeshnair06 @DevdattaGNage @AjayAtulOnline pic.twitter.com/0eYSI0jnrg
భారతదేశంతో పాటు యూఎస్ఏ, యుకే, కెనడా, మిడిల్ ఈస్ట్, ఆస్ట్రేలియా, న్యూజిలాండ్, సింగపూర్, ఇండోనేషియా, థాయ్ లాండ్, మలేషియా, హాంకాంగ్, ఫిలిప్పీన్స్, మయన్మార్, శ్రీలంక, జపాన్, రష్యా సహా ఆసియా మరియు దక్షిణాసియాలోని పలు దేశాలలో 'ఆదిపురుష్' ట్రైలర్ ను 3డే లాంచ్ చేయనున్నట్లుగా తెలుస్తోంది. ఈ మెగా ట్రైలర్ లాంచ్ వరల్డ్ లోనే అతి పెద్ద గ్లోబల్ ఈవెంట్ గా అరుదైన ఫీట్ సాధించే అవకాశం ఉండటంతో, డార్లింగ్ ఫ్యాన్స్ ఫుల్ ఖుషి అవుతున్నారు.
వాస్తవానికి 'ఆదిపురుష్' సినిమా గతేడాది వచ్చిన ప్రతీ ప్రమోషనల్ కంటెంట్ పై సోషల్ మీడియాలో పెద్ద ఎత్తున ట్రోలింగ్ జరిగింది. టీజర్ లో వీఎఫ్ఎక్స్ వర్క్స్ నాసిరకంగా ఉన్నాయని, గ్రాఫిక్స్ చూస్తుంటే ఒక కార్టూన్ మూవీ చూస్తున్నట్లు వుందని, ఇతిహాసాలను అపహాస్యం చేస్తున్నారని విమర్శించారు. దీంతో సంక్రాంతికి రిలీజ్ చేయాల్సిన చిత్రాన్ని వాయిదా వేసి మరీ రీ-వర్క్ చేశారు.
దీనికి తగ్గట్టుగానే ఇటీవల వదిలిన ఆది పురుష్ పోస్టర్స్ ఆడియెన్స్ నుంచి మంచి రెస్పాన్స్ తెచ్చుకుని, సినిమాపై పాజిటివ్ బజ్ క్రియేట్ చేశాయి. అంతేకాదు రాబోయే ట్రైలర్ ఓ రేంజ్ లో ఉంటుందో అని తెలుసుకోవాలనే ఆసక్తిని కలిగించాయి. ఇప్పటికే మధ్యప్రదేశ్ ముఖ్యమంత్రి శివరాజ్సింగ్ ఛౌహాన్ సహా పలువురు నేతలు ఈ ట్రైలర్ ను వీక్షించి, పాజిటివ్ గా స్పందించిన సంగతి తెలిసిందే.
'ఆది పురుష్' మూవీ రిలీజ్ కు ముందే సాధించింది. న్యూయార్క్ లోని ట్రిబెకా ఫెస్టివల్ లో అంతర్జాతీయ ప్రీమియర్ కు సెలెక్ట్ కావడం ద్వారా ప్రపంచవ్యాప్తంగా అందరి దృష్టిని ఆకర్షించింది. ఈ నేపథ్యంలో 3:22 నిమిషాల నిడివితో ఈ మాగ్నమ్ ఓపస్ ట్రైలర్ ను గ్లోబల్ వైడ్ లాంచ్ చేయడానికి ప్లాన్ చేస్తున్నట్లు టాక్ వినిపిస్తోంది.
కాగా, 'ఆదిపురుష్' సినిమాలో రాఘవగా ప్రభాస్ కనిపించనున్నారు. జానకిగా కృతి సనన్, లంకేశ్ గా సైఫ్ అలీ ఖాన్ మరియు లక్ష్మణుడిగా సన్నీ సింగ్ నటించారు. దేవదత్త నాగే, వత్సల్ సేన్, సోనాల్ చౌహాన్ ప్రధాన పాత్రలు పోషించారు. అజయ్ - అతుల్ సంగీతం సమకూరుస్తున్న ఈ మైథలాజికల్ డ్రామాకి కార్తీక్ పల్నాని సినిమాటోగ్రఫీ నిర్వహిస్తున్నారు. అపూర్వ మోతీవాలే సాహై, ఆశిష్ మాత్రే ఎడిటింగ్ చేస్తున్నారు.
టి సిరీస్ భూషణ్ కుమార్ సమర్పణలో క్రిష్ణకుమార్, ఓమ్ రౌత్, ప్రసాద్ సుతారియా, రెట్రోఫిల్స్ రాజేష్ నాయర్ భారీ బడ్జెట్ తో ప్రతిష్టాత్మకంగా ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు. తెలుగులో యూవీ క్రియేషన్స్ బ్యానర్ లో వంశీ, ప్రమోద్ లు రిలీజ్ చేస్తున్నారు. 2023 జూన్ 16న హిందీ, తెలుగు, తమిళం, మలయాళం, కన్నడ భాషల్లో IMAX & 3D ఫార్మాట్లలో 'ఆదిపురుష్' సినిమా విడుదల కాబోతోంది.