Raja Saab Teaser: రాజా సాబ్ టీజర్ రిలీజ్ టైమ్ లాక్ చేశారోచ్... ప్రభాస్ లుక్ చూశారా? కిర్రాక్ అంతే
Prabhas New Look: ప్రభాస్ నయా లుక్ చూశారా? 'ది రాజా సాబ్' సెట్స్‌లో తీసుకున్న ఫోటోను మారుతి ట్వీట్ చేశారు. అందులో రెబల్ స్టార్ చాలా హ్యాండ్సమ్ గా ఉన్నారు.

హ్యాండ్సమ్ డార్లింగ్ ఈజ్ బ్యాక్ అంటూ రెబల్ స్టార్ ప్రభాస్ (Prabhas) అభిమానులు తమ సంతోషాన్ని వ్యక్తం చేస్తున్నారు. అందుకు కారణం దర్శకుడు మారుతి. ఆయనతో ప్రభాస్ చేస్తున్న సినిమా 'ది రాజా సాబ్'. దీని షూటింగ్‌కు సంగీత దర్శకుడు తమన్ వెళ్లారు. వాళ్లందరితో ప్రభాస్ సరదాగా ముచ్చటించిన సమయంలో దిగిన ఫోటోను మారుతి తాజాగా సోషల్ మీడియాలో షేర్ చేశారు. అందులో ప్రభాస్ హ్యాండ్సమ్ లుక్, స్మైల్ గురించి ఆడియన్స్ అందరూ డిస్కస్ చేస్తున్నారు. అంత అందంగా ఉన్నారు మరి. అన్నట్టు మరో విషయం... సినిమా టీజర్ రిలీజ్ టైం లాక్ చేశారు.
జూన్ 16వ తేదీన ఉదయం 10.52 గంటలకు!
జూన్ 16వ తేదీన 'ది రాజా సాబ్' టీజర్ విడుదల చేయనున్నట్లు గతంలో అనౌన్స్ చేశారు. అయితే... ఇప్పుడు ఆ టీజర్ రిలీజ్ టైం చెప్పారు మారుతి. సోమవారం ఉదయం 10.52 గంటలకు యూట్యూబ్, సోషల్ మీడియా అకౌంట్లలో రిలీజ్ చేయనున్నారు.
All smiles now… 😍
— Director Maruthi (@DirectorMaruthi) June 13, 2025
but what’s coming will send shivers down your spine 🔥
Here’s a working still from #TheRajaSaab sets ❤️#TheRajaSaabTeaser on June 16th at 10:52AM 💥#TheRajaSaabOnDec5th pic.twitter.com/WtHvEBV83Z
'ది రాజా సాబ్' సినిమా మీద చాలా అంచనాలు ఉన్నాయి. ప్రభాస్ తొలిసారి ఒక హారర్ జానర్ సినిమా చేస్తుండడం ఒక కారణం అయితే... 'ప్రేమ కథ చిత్రం' వంటి హారర్ కామెడీతో పాటు 'భలే భలే మగాడివోయ్', 'మహానుభావుడు', 'ప్రతి రోజు పండగే' వంటి ఫ్యామిలీ ఎంటర్టైనర్స్ తీసిన మారుతి, ఇప్పుడు రెబల్ స్టార్‌ను ఎలా చూపించబోతున్నారో అని ఆసక్తి అందరిలో ఉండడం మరొక కారణం. ఆల్రెడీ విడుదల చేసిన ప్రభాస్ స్టిల్స్ అందరికీ నచ్చాయి. టీజర్ ఎలా ఉంటుందో చూడాలి మరి.
ప్రభాస్ సరసన ముగ్గురు అందాల భామలు!
ప్రభాస్ హీరోగా మారుతి దర్శకత్వం వహిస్తున్న 'ది రాజా సాబ్' సినిమాలో ముగ్గురు అందాల భామలు నటించారు. నిధి అగర్వాల్, మాళవిక మోహనన్, రిద్ధి కుమార్ సినిమాలో ఉన్నారు. ముగ్గురిలో మాళవిక యాక్షన్ సీన్లు కూడా చేసినట్లు తెలిసింది. ఈ సినిమాను పీపుల్ మీడియా ఫ్యాక్టరీ పతాకం మీద టీజీ విశ్వ ప్రసాద్ ప్రొడ్యూస్ చేస్తున్నారు. డిసెంబర్ 5వ తేదీన థియేటర్లలో తెలుగుతో పాటు తమిళ, హిందీ, కన్నడ, మలయాళ భాషలలో భారీ ఎత్తున విడుదల కానుంది.





















