Virosh Wedding : విరోష్ వెడ్డింగ్ సెలబ్రేషన్స్ - స్వీట్ మూమెంట్స్ విత్ స్వీట్స్... వీడియో వైరల్
Vijay Deverakonda Rashmika : విజయ్ దేవరకొండ, రష్మికల పెళ్లి తర్వాత మీడియా ప్రతినిధులు, పిల్లలకు స్వీట్స్ పంచారు. ప్రస్తుతం ఈ వీడియో నెట్టింట వైరల్ అవుతోంది.

Vijay Deverakonda Rashmika Wedding Celebrations With Sweets : గురువారం ఉదయం హిందూ వివాహ సంప్రదాయం ప్రకారం విజయ్ దేవరకొండ, రష్మిక మందన్న కపుల్ ఒక్కటైన సంగతి తెలిసిందే. కుటుంబ సభ్యులు, అతి కొద్దిమంది అతిథుల సమక్షంలో వీరి వివాహం ఘనంగా జరిగింది. సోషల్ మీడియా వేదికగా ఫ్యాన్స్, పలువురు సెలబ్రిటీలు వీరికి విషెష్ చెబుతున్నారు. వెడ్డింగ్ తర్వాత స్వీట్ మూమెంట్‌ను స్వీట్స్‌తో పంచుకున్నారు విరోష్ కపుల్ ఫ్యామిలీస్.
పిల్లలు, మీడియా ప్రతినిధులకు స్వీట్స్
తెలుగు సంప్రదాయం ప్రకారం వివాహం జరిగిన తర్వాత విజయ్, రష్మిక టీంకు చెందిన ప్రతినిధులు స్వీట్ బాక్స్‌తో రిసార్ట్ బయటకు వచ్చారు. ఆ తర్వాత అక్కడే ఉన్న పాపరాజీస్, మీడియా ప్రతినిధులు, ఫోటోగ్రాఫర్లకు కాజు, బర్ఫీ బాక్సులను అందజేశారు. పిల్లలకు కూడా స్వీట్ బాక్సులు అందించారు. ప్రస్తుతం ఈ వీడియో వైరల్ అవుతోంది. ఈ సందర్భంగా ఓ మీడియా ప్రతినిధి స్వీట్స్ పంచే టీం మెంబర్‌తో పెళ్లి గురించి ఏమైనా స్పందిస్తారా? అని అడగ్గా అందుకు నిరాకరించారు.
View this post on Instagram
Also Read : విష్ణు విన్యాసం ఫస్ట్ రివ్యూ - శ్రీవిష్ణు కామెడీ ఎంటర్టైనర్ ఎలా ఉంటుందంటే?
ఉదయం 8 గంటల నుంచి 11:30 గంటల వరకూ సాగినట్లు తెలుగు సంప్రదాయ పెళ్లి తంతు జరిగినట్లు తెలుస్తోంది. దీనికి సంబంధించిన ఫోటోలు కానీ వీడియోలు కానీ విజయ్, రష్మిక షేర్ చేస్తే తప్ప బయటకు వచ్చే ఛాన్స్ లేదు. సాయంత్రం 4:30 గంటలకు కడువ సంప్రదాయం ప్రకారం మరోసారి వివాహం జరగనుంది.
మీడియా ప్రతినిధులను పెళ్లి వేదిక దరిదాపుల్లోకి కూడా రానివ్వడం లేదు. ప్రైవేట్ బౌన్సర్లతో పాటు పోలీసులు కూడా భారీగా బందోబస్తు నిర్వహిస్తున్నారు.
రాయల్ విందు
పెళ్లికి వచ్చిన అతిథులకు పసందైన తెలుగు వంటకాలతో పాటు వరల్డ్ ఫేమస్ స్వీట్స్ కూడా విందులో వడ్డించారు. ఆంధ్ర, తెలంగాణ స్పెషల్స్, కొడువ సంప్రదాయం ప్రకారం ఫోర్క్ (పంది మాంసం) వడ్డిస్తారు. ఇక తెలంగాణ స్టైల్ ధమ్ బిర్యానీ, కర్ణాటక స్పెషల్ బిసిబేళా బాత్, టాలీవుడ్ సెలబ్రిటీల కోసం లోకల్ వంటకాలతో పాటు ఇలా భారీ విందు వడ్డించారు. రష్మికకు ఇష్టమైన స్పెషల్ స్వీట్స్‌ను విందులో ఉండేలా ప్లాన్ చేశారట.
ఇక పెళ్లి వేదిక ముందు ఉన్న పాపరాజీస్, మీడియా ప్రతినిధులను అనుమతించక పోవడంతో వారు గత 2 రోజులుగా వేదిక ముందే ఉంటున్నారు. పెళ్లికి వెళ్లి వచ్చే వారిని కవర్ చేస్తున్నారు. వీరికి స్పెషల్ బఫే అరేంజ్ చేశారు విరోష్ కపుల్. దాదాపు 3 రోజుల పాటు ఓ హోటల్‌లో వీరికి ఆతిథ్యం ఏర్పాట్లు చేసినట్లు తెలుస్తోంది. మార్చి 4న హైదరాబాద్‌లోని తాజ్ హోటల్‌లో రిసెప్షన్ ఏర్పాటు చేయగా ఈవెంట్‌కు టాలీవుడ్ టాప్ సెలబ్రిటీలతో పాటు పొలిటికల్ లీడర్స్ హాజరు కానున్నారు.
























