అన్వేషించండి

Prabhas: 'కన్నప్ప' సెట్‌లో ప్రభాస్ - విష్ణు సినిమా షూటింగ్ షురూ చేసిన రెబల్ స్టార్

Kannappa Movie Latest Update: విష్ణు మంచు ప్రధాన పాత్రలో రూపొందుతున్న 'కన్నప్ప'లో ఇండియా రెబల్ స్టార్ ప్రభాస్ నటిస్తున్న విషయం ప్రేక్షకులకు తెలుసు. లేటెస్ట్ అప్డేట్ ఏమిటంటే ఆయన షూట్ స్టార్ట్ చేశారు.

పాన్ ఇండియా రెబల్ స్టార్ ప్రభాస్ (Prabhas) కొంత విరామం తర్వాత షూటింగ్ స్టార్ట్ చేశారు. అయితే... అది ఆయన సినిమా కాదు. డేరింగ్ అండ్ డైనమిక్ స్టార్ విష్ణు మంచు (Vishnu Manchu) కథానాయకుడిగా రూపొందుతున్న 'కన్నప్ప'లో ఆయన ముఖ్యమైన అతిథి పాత్రలో కనిపించనున్న సంగతి తెలిసిందే. ఆ షూట్ అన్నమాట!

నా బ్రదర్ ప్రభాస్ వచ్చాడు!
'కన్నప్ప' (Kannappa) సినిమా చిత్రీకరణలో ప్రభాస్ జాయిన్ అయిన విషయాన్ని గురువారం సాయంత్రం విష్ణు మంచు సోషల్ మీడియా నెట్వర్కింగ్ సైట్ 'ఎక్స్'లో తెలిపారు. ''నా సోదరుడు ప్రభాస్ షూటింగులో జాయిన్ అయ్యాడు'' అని ట్వీట్ చేశారు.

శివుడి పాత్రలో ప్రభాస్...
ఆ కాలు వెనుక మర్మం ఏమిటి?
Prabhas Role In Kannappa Movie: ప్రభాస్ 'కన్నప్ప' షూటింగ్ చేస్తున్న విషయాన్ని చెప్పిన విష్ణు మంచు... ఓ పోస్టర్ విడుదల చేశారు. అందులో ఒక కాలు తప్ప ఏమీ లేదు. ఆ కాలికి పులి చారలు వంటి దుస్తులు ఉండటం, కాలి వెనుక జడలా జుట్టు కనిపించడంతో శివుడి పాత్రను ప్రభాస్ చేస్తున్నారని నెటిజనులు భావిస్తున్నారు. అయితే, విష్ణు మంచు ఏ విషయం చెప్పలేదు.

Also Read: రామ్ చరణ్ డెనిమ్ షర్టులో ఏమున్నాడ్రా బాబూ - గ్లోబల్ స్టార్ క్యాజువల్ లుక్ కిర్రాక్ అంతే!

'కన్నప్ప' చిత్రీకరణకు ప్రభాస్ ఎక్కువ రోజులు అవసరం లేదు. ఈ సినిమాలో తన క్యారెక్టర్ షూటింగ్ కంప్లీట్ చేసిన తర్వాత 'సలార్ 2'ను సెట్స్ మీదకు తీసుకు వెళ్లే ఆలోచనలో ఆయన ఉన్నారట.  

'కన్నప్ప' విషయానికి వస్తే... పీరియాడిక్ అండ్ మైథలాజికల్ డ్రామాగా గ్రాండ్ స్కేల్‌లో సినిమా రూపొందుతోంది. ది బ్రేవెస్ట్ వారియర్, ది అల్టిమేట్ డీవోటీ... అనేది మూవీ కాప్షన్. ఇండియన్ ఫిల్మ్ ఇండస్ట్రీలో వివిధ భాషలకు చెందిన నటీనటులు ఇందులో కీలకమైన క్యారెక్టర్లు చేస్తున్నారు. బాలీవుడ్ స్టార్ హీరో, 'ఖిలాడీ' అక్షయ్ కుమార్ ఇటీవల తన పాత్రకు సంబంధించిన చిత్రీకరణ పూర్తి చేశారు.

Also Readచిత్రం చూడర మూవీ రివ్యూ: ETV Winలో వరుణ్ సందేశ్ సినిమా - బావుందా? లేదా?

Vishnu Manchu's Kannappa Movie Cast: ప్రభాస్, అక్షయ్ కుమార్ కాకుండా 'కన్నప్ప'లో లేడీ సూపర్ స్టార్ నయనతార, మలయాళ మెగాస్టార్ మోహన్ లాల్, కన్నడ సూపర్ స్టార్ శివరాజ్ కుమార్, లెజెండరీ నటుడు - కలెక్షన్ కింగ్ మోహన్ బాబు, తెలుగు ప్రేక్షకులకు సుపరిచితుడైన శరత్ కుమార్, మధుబాల ఇతర ప్రధాన తారాగణం. 

'కన్నప్ప' చిత్రాన్ని అవా ఎంటర్టైన్మెంట్, 24 ఫ్రేమ్స్ ఫ్యాక్టరీ పతాకంపై మోహన్ బాబు (Mohan Babu) ప్రొడ్యూస్ చేస్తున్నారు. హిందీలో మహాభారత సిరీస్ తీసిన ముఖేష్ కుమార్ సింగ్ దర్శకుడు. సుమారు 150 కోట్లకు పైగా నిర్మాణ వ్యయంతో తెరకెక్కుతున్న చిత్రమిది. పరుచూరి గోపాల కృష్ణ, బుర్రా సాయి మాధవ్, తోట ప్రసాద్ రచనలో రూపొందుతున్న ఈ చిత్రానికి మణిశర్మ, స్టీఫెన్ దేవాసి సంగీత దర్శకులు.

ఇంకా చదవండి
Sponsored Links by Taboola

టాప్ హెడ్ లైన్స్

Andhra intermediate exams: ఏపీలో ఇంటర్ పరీక్షల షెడ్యూల్‌లో మార్పుచేర్పులు - కొత్త షెడ్యూల్ ఫుల్ డీటైల్స్ ఇక్కడ
ఏపీలో ఇంటర్ పరీక్షల షెడ్యూల్‌లో మార్పుచేర్పులు - కొత్త షెడ్యూల్ ఫుల్ డీటైల్స్ ఇక్కడ
Pawan Kalyan: జనసేన ఎమ్మెల్యేలతో పవన్ కల్యాణ్ వన్ టు వన్ భేటీ - పనితీరుపై సమీక్ష - గట్టి వార్నింగ్ ఇస్తున్నారా?
జనసేన ఎమ్మెల్యేలతో పవన్ కల్యాణ్ వన్ టు వన్ భేటీ - పనితీరుపై సమీక్ష - గట్టి వార్నింగ్ ఇస్తున్నారా?
యువరాజ్ సింగ్,సోనూ సూద్ సహా పలువురి సెలబ్రిటీలకు షాక్, ఆస్తులు జప్తు చేసిన ఈడీ
యువరాజ్ సింగ్,సోనూ సూద్ సహా పలువురి సెలబ్రిటీలకు షాక్, ఆస్తులు జప్తు చేసిన ఈడీ
Bhartha Mahasayulaku Wignyapthi Teaser : 'భర్త మహాశయులకు విజ్ఞప్తి' టీజర్ వచ్చేసింది - మాస్ మహారాజ రవితేజ ఏం చేశారంటే?
'భర్త మహాశయులకు విజ్ఞప్తి' టీజర్ వచ్చేసింది - మాస్ మహారాజ రవితేజ ఏం చేశారంటే?

వీడియోలు

టీమిండియా, సౌతాఫ్రికా మధ్య నేడు ఆఖరి పోరు
సంజూ.. చుక్కలు చూపించాల!
కోహ్లీ రికార్డ్‌ బద్దలు కొట్టడానికి అడుగు దూరంలో అభిషేక్ శర్మ
టీమిండియా కోచ్ గౌతం గంభీర్‌పై షాకింగ్ కామెంట్స్ చేసిన కపిల్ దేవ్
G RAM G Bill | లోక్‌సభలో ఆమోదం పొందిన జీరామ్‌జీ బిల్లుని ప్రతిపక్షాలు ఎందుకు వ్యతిరేకిస్తున్నాయి? | ABP Desam

ఫోటో గ్యాలరీ

ABP Premium

వ్యక్తిగత కార్నర్

అగ్ర కథనాలు
టాప్ రీల్స్
Andhra intermediate exams: ఏపీలో ఇంటర్ పరీక్షల షెడ్యూల్‌లో మార్పుచేర్పులు - కొత్త షెడ్యూల్ ఫుల్ డీటైల్స్ ఇక్కడ
ఏపీలో ఇంటర్ పరీక్షల షెడ్యూల్‌లో మార్పుచేర్పులు - కొత్త షెడ్యూల్ ఫుల్ డీటైల్స్ ఇక్కడ
Pawan Kalyan: జనసేన ఎమ్మెల్యేలతో పవన్ కల్యాణ్ వన్ టు వన్ భేటీ - పనితీరుపై సమీక్ష - గట్టి వార్నింగ్ ఇస్తున్నారా?
జనసేన ఎమ్మెల్యేలతో పవన్ కల్యాణ్ వన్ టు వన్ భేటీ - పనితీరుపై సమీక్ష - గట్టి వార్నింగ్ ఇస్తున్నారా?
యువరాజ్ సింగ్,సోనూ సూద్ సహా పలువురి సెలబ్రిటీలకు షాక్, ఆస్తులు జప్తు చేసిన ఈడీ
యువరాజ్ సింగ్,సోనూ సూద్ సహా పలువురి సెలబ్రిటీలకు షాక్, ఆస్తులు జప్తు చేసిన ఈడీ
Bhartha Mahasayulaku Wignyapthi Teaser : 'భర్త మహాశయులకు విజ్ఞప్తి' టీజర్ వచ్చేసింది - మాస్ మహారాజ రవితేజ ఏం చేశారంటే?
'భర్త మహాశయులకు విజ్ఞప్తి' టీజర్ వచ్చేసింది - మాస్ మహారాజ రవితేజ ఏం చేశారంటే?
Nara Lokesh: నారా కుటుంబంలో అందరికీ అవార్డులు లోకేష్‌కు తప్ప - కష్టమేనని నిట్టూర్చిన యువనేత
నారా కుటుంబంలో అందరికీ అవార్డులు లోకేష్‌కు తప్ప - కష్టమేనని నిట్టూర్చిన యువనేత
Trump: గ్రీన్ కార్డ్ లాటరీని రద్దు చేసిన ట్రంప్ సర్కార్ - ఇక అమెరికా పౌరసత్వం కల్లేనా? ఇవిగో డీటైల్స్
గ్రీన్ కార్డ్ లాటరీని రద్దు చేసిన ట్రంప్ సర్కార్ - ఇక అమెరికా పౌరసత్వం కల్లేనా? ఇవిగో డీటైల్స్
Bangladesh Protest:బంగ్లాదేశ్‌లో ఘర్షణలతో భారత్‌ అలర్ట్‌! సరిహద్దుల్లో భద్రత కట్టుదిట్టం
బంగ్లాదేశ్‌లో ఘర్షణలతో భారత్‌ అలర్ట్‌! సరిహద్దుల్లో భద్రత కట్టుదిట్టం
Avatar Fire And Ash Box Office Day 1: ఇండియాలో రికార్డుల దిశగా 'అవతార్ 3' కలెక్షన్లు... మొదటి రోజు ఎన్ని కోట్లు వచ్చే అవకాశం ఉందంటే?
ఇండియాలో రికార్డుల దిశగా 'అవతార్ 3' కలెక్షన్లు... మొదటి రోజు ఎన్ని కోట్లు వచ్చే అవకాశం ఉందంటే?
Embed widget