Prabhas - Hanu Movie Fauji Concept Poster: పద్మవ్యూహాన్ని చేధించిన పార్ధు... రెబల్ ఫ్యాన్స్‌కు కిర్రాక్ 'ఫౌజీ' అప్డేట్ ఇచ్చిన హను!
Prabhas Fauji Teaser: దీపావళి సందర్భంగా రెబల్ స్టార్ ప్రభాస్ హీరోగా హను రాఘవపూడి దర్శకత్వం వహిస్తున్న సినిమా కాన్సెప్ట్ పోస్టర్ విడుదల చేశారు. ప్రభాస్ బర్త్ డే కానుకగా ఫస్ట్ లుక్ విడుదల చేయనున్నారు.

బ్యాక్ టు బ్యాక్ రెండు పాన్ ఇండియా బ్లాక్ బస్టర్ ఫిలిమ్స్ 'సలార్', 'కల్కి 2898 ఏడీ'తో రెబల్ స్టార్ ప్రభాస్ (Prabhas) మంచి జోరు మీద ఉన్నారు. ప్రస్తుతం ఆయన చేతిలో క్రేజీ పాన్ ఇండియా ప్రాజెక్ట్స్ ఉన్నాయ్. అందులో క్రియేటివ్ డైరెక్టర్ హను రాఘవపూడి తెరకెక్కిస్తున్న ప్రాజెక్ట్ ఒకటి. ఆ చిత్రానికి 'ఫౌజీ' టైటిల్ ఖరారు చేశారు కానీ ఇంకా అధికారికంగా ప్రకటించలేదు. ఇప్పుడు అది అనౌన్స్ చేసే టైం వచ్చిందని చెప్పాలి.
దీపావళికి కాన్సెప్ట్ పోస్టర్ రిలీజ్!
ప్రభాస్ హీరోగా హను రాఘవపూడి దర్శకత్వంలో టాలీవుడ్ టాప్ ప్రొడక్షన్ హౌస్ మైత్రీ మూవీ మేకర్స్ పతాకంపై నవీన్ యెర్నేని, రవిశంకర్ యలమంచిలి ప్రొడ్యూస్ చేస్తున్న సినిమా 'ఫౌజీ'. టీ సిరీస్ భూషణ్ కుమార్, గుల్షన్ కుమార్ సమర్పిస్తున్నారు. దీపావళి పండగ సందర్భంగా కాన్సెప్ట్ పోస్టర్ విడుదల చేశారు.
ప్రభాస్ - హను సినిమా కాన్సెప్ట్ పోస్టర్ చూస్తే... హీరో లుక్ రివీల్ చేయలేదు. హైడ్ చేశారు. అయితే తుపాకీల మీద హీరో నీడ కనిపిస్తుంది. ఈ సినిమాలో సైనికుడిగా ప్రభాస్ కనిపించనున్న సంగతి తెలిసిందే. అందుకే యుద్ధ వాతావరణం ప్రతిబింబించేలా ఆ పోస్టర్ డిజైన్ చేశారు. అలాగే, సంస్కృత పదాలు సైతం ఉన్నాయి. అవి డీకోడ్ చేస్తే... ''పద్మవ్యూహాన్ని చేధించిన పార్థు'' అని రాసి ఉంది. 'కల్కి 2898 ఏడీ'లో కర్ణుడిగా కనిపించిన ప్రభాస్... ఇప్పుడీ సినిమాలో అర్జునుడి రోల్ అని చెప్పలేం. కానీ, అటువంటి లక్షణాలు ఉన్న క్యారెక్టర్ చేస్తున్నారని చెప్పవచ్చు.
ప్రభాస్ పుట్టినరోజు గిఫ్ట్ రెడీ!
Prabhas Birthday: అక్టోబర్ 23న ప్రభాస్ పుట్టినరోజు. బర్త్ డే కంటే ఒక్క రోజు ముందు ప్రభాస్ హను సినిమా టైటిల్ రివీల్ చేయడంతో పాటు ఆ రోజు ఫస్ట్ లుక్ రిలీజ్ చేయనున్నారు. అలాగే, టీజర్ విడుదల చేసే ఛాన్స్ ఉంది.
View this post on Instagram
ప్రభాస్ జంటగా ఇమాన్వి...ఇంకా?
'ఫౌజీ' సినిమాలో ప్రభాస్ సరసన ఇమాన్వి కథానాయికగా నటిస్తున్నారు. తెలుగులో, ఆ మాటకు వస్తే కథానాయికగా ఆమెకు తొలి చిత్రమిది. ఇంకా ఈ మూవీలో అనుపమ్ ఖేర్, మిథున్ చక్రవర్తి, జయప్రద, భాను చందర్ తదితరులు ఇతర కీలక పాత్రల్లో నటించారు. ఈ చిత్రానికి సుదీప్ ఛటర్జీ సినిమాటోగ్రాఫర్. విశాల్ చంద్రశేఖర్ సంగీత దర్శకుడు. కృష్ణకాంత్ పాటలు రాశారు.
Also Read: 'మాస్ జాతర'లో సూపర్ డూపర్ హిట్టు సాంగ్... ప్రోమో వచ్చేసింది, ఫుల్ సాంగ్ రిలీజ్ ఎప్పుడంటే?






















