Prabhas Birthday: బాక్సాఫీస్ బాహుబలి... ఇప్పుడు ప్రభాస్‌కు, మిగతా హీరోలకు డిఫరెన్స్ ఏంటి?
Happy Birthday Prabhas: ప్రభాస్ పుట్టినరోజు వచ్చింది. పాన్ ఇండియా స్థాయిలో ఫ్యాన్స్ సెలబ్రేషన్స్ చేస్తున్నారు. ఇప్పుడు అతనికి, మిగతా హీరోలకు డిఫరెన్స్ ఏంటి? ప్రభాస్ ఎందుకు అంత స్పెషల్?
Rebel Star Prabhas Birthday Special: ప్రభాస్ కెరీర్ గురించి చెప్పాలంటే... దర్శక ధీరుడు ఎస్ఎస్ రాజమౌళి తీసిన 'బాహుబలి'కి ముందు, తర్వాత అని సినిమా ట్రేడ్ పండితులు, సగటు ప్రేక్షకులు చెబుతారు. బాహుబలితో భారతీయ బాక్స్ ఆఫీస్ బాహుబలి అనిపించుకున్నారు ప్రభాస్. కానీ, ఇప్పుడు ఆయన కేవలం బాహుబలి కాదు... ఇండియన్ బాక్స్ ఆఫీస్ డార్లింగ్, ఇంకా చెప్పాలంటే కలెక్షన్స్ మెషీన్. ఇప్పుడు మిగతా హీరోలకు, ఆయనకు డిఫరెన్స్ ఏంటి?
హిట్టూ ఫ్లాపులతో సంబంధం లేదండోయ్!
'బాహుబలి' తర్వాత ప్రభాస్ హీరోగా నటించిన 'సాహో'కు సూపర్ హిట్ వంటి పాజిటివ్ టాక్ రాలేదు. కానీ, ఆ సినిమా గ్లోబల్ బాక్స్ ఆఫీస్ దగ్గర నాలుగు వందల కోట్లకు పైగా కలెక్ట్ చేసింది. 'ఆదిపురుష్' సంగతి చెప్పాల్సిన అవసరం లేదు. ఆ సినిమా మీద వచ్చినన్ని ట్రోల్స్ ఇటీవల కాలంలో మరొక సినిమా మీద రాలేదని చెప్పొచ్చు. ఏ సినిమాలో గ్రాఫిక్స్ బాలేకపోయినా దర్శకుడు ఓం రౌత్ మీద సోషల్ మీడియాలో ఒక సెక్షన్ ఆఫ్ పీపుల్ విమర్శలు చేయడం, కంపేరిజన్స్ చేయడం కామన్. అయితే, 'ఆదిపురుష్'కు బంపర్ ఓపెనింగ్ లభించింది. ఫ్లాప్ టాక్ వచ్చినా ఫస్ట్ వీకెండ్ మంచి నంబర్స్ నమోదు చేసింది.
'బాహుబలి' తర్వాత నార్త్ ఇండియన్ ఆడియన్స్‌లో ప్రభాస్ క్రేజ్ పెరిగింది. జస్ట్ ఓ సౌత్ హీరో అని ఆయన్ను చూడటం లేదు. ప్రభాస్ మీద ఉత్తరాది ప్రేక్షకులు సైతం ప్రేమ చూపించడం మొదలు పెట్టారు. అందుకే, ఫ్లాప్ సినిమాలకు సైతం ఆ కలెక్షన్లు.
ఇప్పుడు ప్రభాస్, మిగతా హీరోల మధ్య డిఫరెన్స్ ఏంటి?
టాలీవుడ్ యంగ్ స్టార్ హీరోలు ఆల్మోస్ట్ అందరూ పాన్ ఇండియా బాక్స్ ఆఫీస్ మీద గురి పెట్టారు. అయితే... వాళ్ళు చేసే సినిమాలు, ప్రభాస్ సినిమాల మధ్య ఒక డిఫరెన్స్ ఉంది. మిగతా హీరోలకు, ప్రభాస్‌కు మధ్య డిఫరెన్స్ ఉంది. ఒక నార్మల్ కమర్షియల్ సినిమాతో కూడా వందల కోట్లు కొల్లగొట్టగల సత్తా బాహుబలికి ఉంది.
'సలార్' సినిమాలో ఏముంది? ప్రభాస్ హీరోయిజం! కథ లేదని కాదు, ఆ కథ కంటే ప్రభాస్ ఫైట్స్ చూడటం కోసం అభిమానులు మళ్ళీ మళ్ళీ థియేటర్లకు వెళ్లారు. ఆ ట్రెండ్ తెలుగు రాష్ట్రాల్లో మాత్రమే కాదు... ఇండియా వైడ్ కనిపించింది. అందుకే అన్ని కోట్ల కలెక్షన్స్. నిర్మాత సూర్యదేవర నాగవంశీ చెప్పినట్టు ప్రభాస్ సినిమాలో ఫైట్స్ ఉండాలని ఫ్యాన్స్, ఆడియన్స్ కోరుకుంటున్నారేమో!? 'కల్కి 2898 ఏడీ' తరహాలో కథ కూడా ఉంటే బాక్స్ ఆఫీస్ బరిలో వెయ్యి కోట్లు కన్ఫర్మ్. ఇప్పుడు ఒక ఏవరేజ్ సినిమాతో ఐదు వందల కోట్లు రాబట్టగల కెపాసిటీ ప్రభాస్ సొంతం. ఫ్లాప్ అయినా సరే మినిమమ్ మూడు వందల కోట్లు ఎటూ పోవు.
'ది రాజా సాబ్'కు ముందు దర్శకుడు మారుతి యంగ్ స్టార్ హీరోలతో సినిమాలు చేయలేదు. పాన్ ఇండియా ఫిల్మ్ తీసిన అనుభవం లేదు. ఆ సినిమాలో హీరోయిన్లు స్టార్లు కాదు. కానీ, నార్త్ ఆడియన్స్‌లో క్రేజ్ మాత్రం ఒక రేంజ్ లో ఉంది. అందుకు రీజన్ ప్రభాస్. అందుకే, ఆయన అంటే పాన్ ఇండియా లెవల్ లో అంత క్రేజ్, స్పెషల్. సందీప్ రెడ్డి వంగా దర్శకత్వంలో చేయబోయే 'స్పిరిట్', 'సలార్ 2','కల్కి 2898 ఏడీ పార్ట్ 2'... ప్రభాస్ లైనప్ క్రేజీగా, భారీగా కనబడుతోంది. మిగతా హీరోలకు బెంచ్ మార్క్ సెట్ చేస్తోంది.