News
News
వీడియోలు ఆటలు
X

Pooja Hegde : పాపం పూజా హెగ్డే - ఫ్లాపుల్లో డబుల్ హ్యాట్రిక్

బ్యాక్ టు బ్యాక్ హిట్స్ అందుకుని క్రేజీ కథానాయికగా ఓ వెలుగు వెలిగిన పూజా హెగ్డే, ఇప్పుడు విజయాలు లేక వెలవెలబోతోంది.

FOLLOW US: 
Share:

హిందీ సినిమా 'కిసీ కా భాయ్ కిసీ కీ జాన్' సినిమా (Kisi Ka Bhai Kisi Ki Jaan Movie) చూసిన ప్రేక్షకులు 'పాపం పూజా హెగ్డే!' అని సానుభూతి చూపిస్తున్నారు. బాలీవుడ్ స్టార్ సల్మాన్ ఖాన్ (Salman Khan) సరసన నటించే అవకాశం వచ్చినా సరే... సరైన హిట్ అందలేదని, అసలు ఆమె అదృష్టం కొన్ని రోజుల నుంచి బాలేదని జాలి పడుతున్నారు. 

'కిసీ కా భాయ్ కిసీ కీ జాన్'కు బాలీవుడ్ మీడియాలో బీభత్సమైన నెగిటివ్ రివ్యూలు వచ్చాయి. ఒకరిద్దరు మినహా ఆల్మోస్ట్ అందరూ సినిమాను ఏకిపారేశారు. ఫ్లాప్ అని తేల్చేశారు. ఈ పరాజయంతో పూజా హెగ్డే (Pooja Hegde) ఖాతాలో డబుల్ హ్యాట్రిక్ చేరినట్టు అయ్యిందని కామెంట్ చేశారు. డబుల్ హ్యాట్రిక్ అంటే హిట్స్ కాదు... ఫ్లాప్స్!

తెలుగులో బ్యాక్ టు బ్యాక్ హిట్స్...
బాలీవుడ్ నుంచి మొదలైన ఫ్లాప్స్!
తెలుగు ఇండస్ట్రీ పూజా హెగ్డేకు బ్యాక్ టు బ్యాక్ హిట్స్ అందించింది. విజయాల్లో డబుల్ హ్యాట్రిక్ అందించింది. మధ్యలో 'సాక్ష్యం'ను పక్కన పెడితే... 'దువ్వాడ జగన్నాథం' నుంచి 'అల వైకుంఠపురములో' సినిమా వరకు, పూజా హెగ్డే చేసిన ప్రతి సినిమా హిట్టే. ఆఖరికి 'జిల్ జిల్ జిల్ జిగేలు రాణి' అంటూ స్పెషల్ సాంగ్ చేసిన 'రంగస్థలం' కూడా హిట్టే. 

పూజా హెగ్డేను గోల్డెన్ లెగ్ అని తెలుగులో అందరూ ప్రశంసలు కురిపించారు. 'అల వైకుంఠపురములో' సినిమా విడుదల తర్వాత నుంచి పూజా హెగ్డే పరిస్థితి అసలు బాలేదు. అఖిల్ అక్కినేని 'మోస్ట్ ఎలిజిబుల్ బ్యాచ్‌లర్' ఆడియన్స్ నుంచి మంచి రెస్పాన్స్ అందుకుంది. కలెక్షన్స్ రాబట్టింది. కానీ, ఆశించిన విజయాన్ని ఇవ్వలేదు.

Also Read : జైశ్రీరాం, నీపై నమ్మకమే మా బలం - ప్రభాస్ ఫ్యాన్స్‌కు 'ఆదిపురుష్' సర్‌ప్రైజ్

తెలుగులో పూజా హెగ్డే విజయాలు చూసి బాలీవుడ్ దర్శక నిర్మాతలు అవకాశాలు ఇవ్వడం మొదలు పెట్టారు. అవకాశాలు అయితే ఇచ్చారు గానీ... విజయాలు మాత్రం ఇవ్వడం లేదు. హిందీలో ఆమెకు వరుస ఫ్లాప్స్ వస్తున్నాయి. మధ్యలో చేసిన తెలుగు సినిమాలు కూడా ఫ్లాప్ అయ్యాయి.

Pooja Hegde Flop Movies : ప్రభాస్ 'రాధే శ్యామ్' నుంచి లేటెస్ట్ సల్మాన్ ఖాన్ 'కిసీ కా భాయ్ కిసీ కీ జాన్' వరకు అన్నీ ఫ్లాపులే. తమిళంలో స్టార్ హీరో విజయ్ జోడిగా నటించిన 'బీస్ట్', తెలుగులో రామ్ చరణ్ జోడిగా కనిపించిన 'ఆచార్య', హిందీలో రణ్ వీర్ సింగ్ హీరోగా రోహిత్ శెట్టి దర్శకత్వం వహించిన 'సర్కస్'... ప్రతి సినిమా బాక్సాఫీస్ దగ్గర బోల్తా కొట్టింది. క్రిటిక్స్ నుంచి విమర్శలు ఎదుర్కొంది. 'రాధే శ్యామ్', 'బీస్ట్' సినిమాల్లో పూజా హెగ్డే యాక్టింగ్ ట్రోలింగ్ మెటీరియల్ అయ్యింది. 

సల్మాన్ సినిమాలో పూజా హెగ్డే బావున్నా...
'కిసీ కా భాయ్ కిసీ కా జాన్' సినిమాలో పూజా హెగ్డే స్క్రీన్ ప్రజెన్స్ బావుందని చాలా మంది కాంప్లిమెంట్స్ ఇచ్చారు. 'బతుకమ్మ...' పాటలో ఆమె డ్రసింగ్ స్టైల్, డ్యాన్స్ సౌత్ ఇండియన్ ప్రేక్షకులను సైతం ఆకట్టుకున్నాయి. సల్మాన్, పూజా హెగ్డే మధ్య కెమిస్ట్రీ కూడా బావుందని ఫ్యాన్స్ అంటున్నారు. కానీ, సినిమా ఫ్లాప్ కావడం పూజా హెగ్డే బ్యాడ్ లక్ అని కామెంట్ చేస్తున్నారు.
  
'కిసీ కా భాయ్ కిసీ కా జాన్' విడుదల సందర్భంగా ఇచ్చిన ఇంటర్వ్యూల్లో ఆ సినిమా కంటే ముందు వచ్చిన ఫ్లాపులపై పూజా హెగ్డే స్పందించారు. సినిమాలు మాత్రమే ఫ్లాప్ అయ్యాయని, తాను కాలేదని ఆమె పేర్కొన్నారు. బహుశా... ఈ సినిమా ఫ్లాప్ మీద కూడా ఆ విధంగా స్పందిస్తారు ఏమో!? 'అరవింద సమేత వీర రాఘవ', 'అల వైకుంఠపురములో'... తనకు రెండు విజయాలు ఇచ్చిన త్రివిక్రమ్ దర్శకత్వంలో మహేష్ బాబుకు జోడీగా పూజా హెగ్డే ఇప్పుడు సినిమా చేస్తున్నారు. దాంతో గురూజీ కాంబినేషన్ లో హ్యాట్రిక్ కొడతారని ఆశిద్దాం! 

Also Read  'మిరపకాయ్' తర్వాత మళ్ళీ రవితేజ - మరి శర్వానంద్?

Published at : 22 Apr 2023 09:50 AM (IST) Tags: Kisi Ka Bhai Kisi Ki Jaan Movie Pooja Hegde Flops Pooja Hegde Double Hattrick Pooja Hegde Bad Luck

సంబంధిత కథనాలు

Ugram OTT Release: ఓటీటీలోకి అల్లరి నరేష్ ‘ఉగ్రం’ - స్ట్రీమింగ్ డేట్ ఇదే!

Ugram OTT Release: ఓటీటీలోకి అల్లరి నరేష్ ‘ఉగ్రం’ - స్ట్రీమింగ్ డేట్ ఇదే!

Mahesh Babu: మహేష్ బాబు, త్రివిక్రమ్ మూవీ టైటిల్ వచ్చేసింది - మాస్ స్ట్రైక్‌ వీడియోతో సూపర్ స్టార్ రచ్చ!

Mahesh Babu: మహేష్ బాబు, త్రివిక్రమ్ మూవీ టైటిల్ వచ్చేసింది - మాస్ స్ట్రైక్‌ వీడియోతో సూపర్ స్టార్ రచ్చ!

మాస్‌ లుక్‌లో మహేష్, ప్రభాస్‌‌తో కమల్ ఢీ? - నేటి టాప్ 5 సినీ విశేషాలివే!

మాస్‌ లుక్‌లో మహేష్, ప్రభాస్‌‌తో కమల్ ఢీ? - నేటి టాప్ 5 సినీ విశేషాలివే!

అనాథ పిల్లల కోసం ఇంటర్నేషనల్ స్కూల్ - మరో మంచి పనికి సోనూసూద్ శ్రీకారం

అనాథ పిల్లల కోసం ఇంటర్నేషనల్ స్కూల్ - మరో మంచి పనికి సోనూసూద్ శ్రీకారం

ఓ ఇంటివాడు కాబోతున్న ‘దసరా’ దర్శకుడు శ్రీకాంత్ ఓదెల

ఓ ఇంటివాడు కాబోతున్న ‘దసరా’ దర్శకుడు శ్రీకాంత్ ఓదెల

టాప్ స్టోరీస్

Gorantla Butchaiah Chowdary: సీఎం జగన్ ఢిల్లీ వెళ్లినప్పుడల్లా అవినాష్ కేసుకు బ్రేకులు: గోరంట్ల బుచ్చయ్య సెటైర్లు

Gorantla Butchaiah Chowdary: సీఎం జగన్ ఢిల్లీ వెళ్లినప్పుడల్లా అవినాష్ కేసుకు బ్రేకులు: గోరంట్ల బుచ్చయ్య సెటైర్లు

Margadarsi Case: మార్గదర్శి కేసు: సీఐడీ లుక్‌అవుట్ నోటీసులపై హైకోర్టుకు శైలజా కిరణ్

Margadarsi Case: మార్గదర్శి కేసు: సీఐడీ లుక్‌అవుట్ నోటీసులపై హైకోర్టుకు శైలజా కిరణ్

Khairatabad Ganesh : ఖైరతాబాద్ గణేష్ విగ్రహం అంకురార్పణ - ఈ ఏడాది ఎన్ని అడుగులంటే ?

Khairatabad Ganesh : ఖైరతాబాద్ గణేష్ విగ్రహం అంకురార్పణ - ఈ ఏడాది ఎన్ని అడుగులంటే ?

Kishan Reddy : కేంద్రం తరపున తెలంగాణ ఆవిర్భావ వేడుకలు - ఇతర రాష్ట్రాల్లోనూ చేస్తున్నామన్న కిషన్ రెడ్డి !

Kishan Reddy : కేంద్రం తరపున తెలంగాణ ఆవిర్భావ వేడుకలు - ఇతర రాష్ట్రాల్లోనూ చేస్తున్నామన్న కిషన్ రెడ్డి !