అన్వేషించండి

ఎన్నికల ఫలితాలు 2024

(Source:  Poll of Polls)

Ravi Teja Sharwanand Movie : 'మిరపకాయ్' తర్వాత మళ్ళీ రవితేజ - మరి శర్వానంద్? 

రవితేజ, శర్వానంద్ హీరోలుగా సందీప్ రాజ్ ఓ మల్టీస్టారర్ సినిమా ప్లాన్ చేసిన సంగతి తెలిసిందే. అందులో హీరోల రోల్స్ ఏంటంటే?

మాస్ మహారాజా రవితేజ (Ravi Teja), యువ హీరో శర్వానంద్ (Sharwanand) కలిసి ఓ మల్టీస్టారర్ సినిమా చేయనున్నారు. వాళ్ళిద్దరినీ 'కలర్ ఫోటో' ఫేమ్ సందీప్ రాజ్ (Sandeep Raj) డైరెక్ట్  చేయనున్నారు. ఇటీవల హీరోలు ఇద్దరినీ దర్శకుడు తన కథతో మెప్పించాడని, సినిమాను సెట్స్ మీదకు తీసుకు వెళ్ళడానికి ఒక్కో అడుగు పడుతోందని ఏబీపీ దేశం పాఠకులకు చెప్పిన సంగతి తెలిసిందే. అయితే, ఈ సినిమాలో హీరోల క్యారెక్టర్స్ ఏంటి? అంటే... 

లెక్చరర్ రవితేజ...
స్టూడెంట్ శర్వానంద్?
Ravi Teja Role In Sandeep Raj Movie : ఈ సినిమాలో లెక్చరర్ పాత్రలో రవితేజ కనిపించనున్నట్లు తెలుస్తోంది. హరీష్ శంకర్ దర్శకత్వం వహించిన 'మిరపకాయ్' సినిమాలో కొన్ని సన్నివేశాల్లో రవితేజ పాఠాలు చెబుతూ కనిపించారు. అందులో ఆయనది పోలీస్ రోల్. అయితే, ఓ మిషన్ మీద కాలేజీకి వెళ్లి లెక్చరర్ గా పాఠాలు చెప్పారు. 'మిరపకాయ్' తర్వాత రవితేజ లెక్చరర్ రోల్ చేయడం ఇదే. ఈసారి ఆయన ఫుల్ లెంగ్త్ రోల్ చేస్తున్నారు. 

రవితేజకు శిష్యుడిగా స్టూడెంట్ పాత్రలో శర్వానంద్ కనిపిస్తారని సమాచారం. గురు శిష్యుల మధ్య బంధం కథలో కీలకమైన అంశం అట. వాళ్ళ రిలేషన్, ఎమోషన్, మనస్పర్థలు వంటివి హైలైట్ చేస్తూ సందీప్ రాజ్ కథ రాశారట. అదీ సంగతి!

Also Read : ‘కన్నై నంబాతే’ మూవీ రివ్యూ: రెప్పపాటులో ఇన్ని ట్విస్టులా?

'కలర్ ఫోటో' అవార్డులు, రివార్డులు అందుకోవడమే కాదు... దర్శకుడిగా సందీప్ రాజ్ (Sandeep Raj)కు మంచి పేరు తీసుకొచ్చింది. ఆ సినిమా తర్వాత ఆయన దర్శకత్వం వహించబోయే సినిమా రవితేజ, శర్వాదే. మధ్యలో 'హెడ్స్ అండ్ టేల్స్', 'ముఖ చిత్రం' సినిమాలకు సందీప్ రాజ్ స్క్రిప్ట్స్ అందించారు.

జీ స్టూడియోస్ నిర్మాణంలో... 
రవితేజ, శర్వానంద్, సందీప్ రాజ్ కలయికలో సినిమాను జీ స్టూడియోస్ సంస్థ నిర్మించనున్నట్లు తెలిసింది. తొలుత రెండు మూడు నిర్మాణ సంస్థలు ఈ క్రేజీ మల్టీస్టారర్ ప్రొడ్యూస్ చేయడానికి ఆసక్తి చూపించాయట. పాన్ ఇండియా స్థాయిలో విడుదల చేసేలా, భారీ ఎత్తున ఖర్చుకు రాజీ పడకుండా నిర్మించేలా జీ స్టూడియోస్ ముందుకు వచ్చింది. ఆ సంస్థతో పాటు మరొక ప్రొడక్షన్ హౌస్ చేరే అవకాశం ఉంది. ఆల్రెడీ ప్రీ ప్రొడక్షన్ & స్క్రిప్ట్ వర్క్ మొత్తం కంప్లీట్ అయ్యిందని టాక్. త్వరలో సినిమా వివరాలను అధికారికంగా వెల్లడించే అవకాశం ఉంది. 

Ravi Teja Upcoming Movies : ఇప్పుడు 'టైగర్ నాగేశ్వరరావు', కార్తీక్ ఘట్టమనేని దర్శకత్వంలో 'ఈగల్' సినిమాలు చేస్తున్నారు రవితేజ. శ్రీరామ్ ఆదిత్య దర్శకత్వంలో శర్వానంద్ ఓ సినిమా చేస్తున్నారు. ప్రస్తుతం ఇద్దరి హీరోల చేతిలో ఉన్న సినిమాలు కంప్లీట్ అయ్యాక సందీప్ రాజ్ సినిమా సెట్స్ మీదకు వెళ్ళవచ్చు. 

ప్రవీణ్ సత్తారు దర్శకత్వంలో తమిళ హిట్ 'మానాడు'ను రీమేక్ చేయడానికి కూడా రవితేజ అంగీకరించారని తెలిసింది. అందులో బాలీవుడ్ యంగ్ స్టార్ వరుణ్ ధావన్ మరో హీరో. ఆ సినిమాను తెలుగులో కూడా విడుదల చేసే అవకాశాలు ఉన్నాయని టాక్. ఇప్పుడు ఆ సినిమాను కూడా అధికారికంగా ప్రకటించలేదు.   

Also Read 'విరూపాక్ష' రివ్యూ : సాయి ధరమ్ తేజ్ భయపెట్టారా? లేదా?

మరిన్ని చూడండి
Advertisement

టాప్ హెడ్ లైన్స్

Maharashtra Exit Poll 2024: మహారాష్ట్రలో అధికారం వారిదే - ఎగ్జిట్ పోల్స్‌లో ఆ కూటమిదే హవా, ఎవరికి ఎన్ని సీట్లు రానున్నాయి!
మహారాష్ట్రలో అధికారం వారిదే - ఎగ్జిట్ పోల్స్‌లో ఆ కూటమిదే హవా, ఎవరికి ఎన్ని సీట్లు రానున్నాయి!
Jharkhand Exit Poll 2024: జార్ఖండ్ ఎన్నికల్లో గెలుపెవరిది? ఎన్డీయేకు కాంగ్రెస్ కూటమి షాకిస్తుందా? ఎగ్జిట్ పోల్ రిజల్ట్
జార్ఖండ్ ఎన్నికల్లో గెలుపెవరిది? ఎన్డీయేకు కాంగ్రెస్ కూటమి షాకిస్తుందా? ఎగ్జిట్ పోల్ రిజల్ట్
Jagan On Balakrishna: షర్మిలపై బాలకృష్ణ తప్పుడు ప్రచారం చేయించారు - జగన్ సంచలన ఆరోపణలు
షర్మిలపై బాలకృష్ణ తప్పుడు ప్రచారం చేయించారు - జగన్ సంచలన ఆరోపణలు
Telangana News: రాజన్న సిరిసిల్లలో పలు అభివృద్ధి పనులకు రేవంత్ రెడ్డి శ్రీకారం, వేటికి ఎంత ఖర్చు చేస్తున్నారంటే!
రాజన్న సిరిసిల్లలో పలు అభివృద్ధి పనులకు రేవంత్ రెడ్డి శ్రీకారం, వేటికి ఎంత ఖర్చు చేస్తున్నారంటే!
Advertisement
Advertisement
Advertisement
ABP Premium

వీడియోలు

రామ్ చరణ్ దర్గా వివాదంపై స్ట్రాంగ్‌గా రియాక్ట్ అయిన ఉపాసనబాచుపల్లిలో కాలకూట విషంగా మారిన తాగు నీళ్లువాలంటీర్ జాబ్స్‌పై ఏపీ ప్రభుత్వం కీలక వ్యాఖ్యలుఅరటిపండు రాకెట్ కూలిపోయింది, ట్రంప్ ముందు పరువు పోయిందిగా

ఫోటో గ్యాలరీ

వ్యక్తిగత కార్నర్

అగ్ర కథనాలు
టాప్ రీల్స్
Maharashtra Exit Poll 2024: మహారాష్ట్రలో అధికారం వారిదే - ఎగ్జిట్ పోల్స్‌లో ఆ కూటమిదే హవా, ఎవరికి ఎన్ని సీట్లు రానున్నాయి!
మహారాష్ట్రలో అధికారం వారిదే - ఎగ్జిట్ పోల్స్‌లో ఆ కూటమిదే హవా, ఎవరికి ఎన్ని సీట్లు రానున్నాయి!
Jharkhand Exit Poll 2024: జార్ఖండ్ ఎన్నికల్లో గెలుపెవరిది? ఎన్డీయేకు కాంగ్రెస్ కూటమి షాకిస్తుందా? ఎగ్జిట్ పోల్ రిజల్ట్
జార్ఖండ్ ఎన్నికల్లో గెలుపెవరిది? ఎన్డీయేకు కాంగ్రెస్ కూటమి షాకిస్తుందా? ఎగ్జిట్ పోల్ రిజల్ట్
Jagan On Balakrishna: షర్మిలపై బాలకృష్ణ తప్పుడు ప్రచారం చేయించారు - జగన్ సంచలన ఆరోపణలు
షర్మిలపై బాలకృష్ణ తప్పుడు ప్రచారం చేయించారు - జగన్ సంచలన ఆరోపణలు
Telangana News: రాజన్న సిరిసిల్లలో పలు అభివృద్ధి పనులకు రేవంత్ రెడ్డి శ్రీకారం, వేటికి ఎంత ఖర్చు చేస్తున్నారంటే!
రాజన్న సిరిసిల్లలో పలు అభివృద్ధి పనులకు రేవంత్ రెడ్డి శ్రీకారం, వేటికి ఎంత ఖర్చు చేస్తున్నారంటే!
Pawan Kalyan In Assembly: ఐదేళ్లే కాదు మరో పదేళ్లు చంద్రబాబు సీఎం - అసెంబ్లీలో పవన్ కల్యాణ్ సంచలన వ్యాఖ్యలు
ఐదేళ్లే కాదు మరో పదేళ్లు చంద్రబాబు సీఎం - అసెంబ్లీలో పవన్ కల్యాణ్ సంచలన వ్యాఖ్యలు
Tirumala News: సీనియర్ సిటిజన్లకు టీటీడీ గుడ్ న్యూస్ - ఇలా చేస్తే సకల సౌకర్యాలతో శ్రీవారి దర్శనం
సీనియర్ సిటిజన్లకు టీటీడీ గుడ్ న్యూస్ - ఇలా చేస్తే సకల సౌకర్యాలతో శ్రీవారి దర్శనం
Ram Gopal Varma: దర్శకుడు ఆర్జీవీకి మరోసారి పోలీసుల నోటీసులు - ఈ నెల 25న విచారణకు రావాలని ఆదేశం
దర్శకుడు ఆర్జీవీకి మరోసారి పోలీసుల నోటీసులు - ఈ నెల 25న విచారణకు రావాలని ఆదేశం
Game Changer Pre Release Event: కాకినాడలో 'గేమ్‌ ఛేంజర్‌' ప్రీ రిలీజ్ ఈవెంట్‌ - ఇచ్చిన మాట నిలబెట్టుకుంటున్న రామ్‌ చరణ్‌
కాకినాడలో 'గేమ్‌ ఛేంజర్‌' ప్రీ రిలీజ్ ఈవెంట్‌ - ఇచ్చిన మాట నిలబెట్టుకుంటున్న రామ్‌ చరణ్‌
Embed widget