అన్వేషించండి

Lokesh Kanagaraj: 'లియో' డైరెక్టర్‌కు ఊహించని షాక్ - లోకేష్ మానసిక స్థితిపై హైకోర్టులో పిటీషన్

Lokesh Kanagaraj : లియో డైరెక్టర్ లోకేష్ కనగరాజ్ పై మధురై హైకోర్టులో పిటిషన్ దాఖలైంది. మధురై కి చెందిన రాజు మురుగన్ అనే వ్యక్తి లోకేష్ పై ఈ పిటిషన్ వేశాడు.

Leo Director Lokesh Kanagaraj : సౌత్ పాన్ ఇండియా డైరెక్టర్స్ లో ఒకరిగా పేరు తెచ్చుకున్న లోకేష్ కనగరాజ్ రీసెంట్ గా 'లియో' మూవీతో మరో సక్సెస్ ని తన ఖాతాలో వేసుకున్న విషయం తెలిసిందే. అంతకంటే ముందు 'విక్రమ్' తో కోలీవుడ్లో ఇండస్ట్రీ హిట్ అందుకున్న ఈ యంగ్ డైరెక్టర్ 'లియో' తో పాన్ ఇండియా వైడ్ క్రేజ్ తెచ్చుకున్నాడు. దళపతి విజయ్ హీరోగా నటించిన ఈ సినిమా బాక్స్ ఆఫీస్ వద్ద భారీ వసూళ్లు రాబట్టింది. ఈ ఏడాది కోలీవుడ్లో హైయెస్ట్ ఓపెనింగ్స్ అందుకున్న ఈ సినిమా ఫుల్ రన్ లో రూ.550 కోట్లకు పైగా కొల్లగొట్టింది. మిక్స్డ్ టాక్ తోనే ఈ రేంజ్ లో సెన్సేషన్ క్రియేట్ చేసిన ఈ సినిమాకి ఇంకా వివాదాలు వెంటాడుతూనే ఉన్నాయి.

రిలీజ్ కు ముందు నుంచే సినిమాపై చాలా విమర్శలు వచ్చాయి. ముఖ్యంగా సినిమాలో హింసాత్మక సన్నివేశాలు, విపరీతమైన వైలెన్స్ ఉందని ఆరోపణలు వచ్చాయి. ఓవైపు విమర్శలు వచ్చినప్పటికీ సినిమా మాత్రం అన్నిచోట్ల మంచి కలెక్షన్స్ అందుకుంది. ఇదిలా ఉంటే తాజాగా లియో డైరెక్టర్ లోకేష్ కనగరాజ్ కి భారీ షాక్ తగిలింది. అతనిపై కోర్టులో పిటిషన్ దాఖలైంది. లోకేష్ పరిస్థితి బాగాలేదని, అతనికి మానసిక పరీక్షలు నిర్వహించాలని ఓ వ్యక్తి హైకోర్టులో పిటిషన్ వేశాడు. దాంతో ఒక్కసారిగా ఈ న్యూస్ హాట్ టాపిక్ గా మారింది. ఆ వ్యక్తి లోకేష్ పై పిటిషన్ వేయడానికి కారణం 'లియో' సినిమానే.

'లియో' సినిమాలో చాలా సన్నివేశాలు హింసాత్మకంగా ఉన్నాయని.. తుపాకులు, కత్తులు, ఆయుధాలు మన సంస్కృతిని హింసాత్మకంగా చూపిస్తున్నాయని.. వివాదాస్పద అభిప్రాయాలను ప్రదర్శించడానికి మతపరమైన చిహ్నాలను ఉపయోగించే దృశ్యాలు కూడా ఉన్నాయని.  సినిమాని వెంటనే బ్యాన్ చేయాలని మధురై కి చెందిన రాజు మురుగన్ తన పిటీషన్ లో పేర్కొన్నాడు. ఈ క్రమంలోనే లోకేష్ మానసిక పరిస్థితి బాగాలేదని, అతడికి వెంటనే సైకలాజికల్ పరీక్షలు నిర్వహించాలంటూ రాజమురుగన్ హైకోర్టును కోరాడు. ఈ పిటీషన్ పై జస్టిస్ కృష్ణ కుమార్, జస్టిస్ విజయ్ కుమార్ తో కూడిన ధర్మాసనం విచారణ చేపట్టింది.

లోకేష్ తరపు న్యాయవాదులు హాజరు కాకపోవడంతో విచారణ వాయిదా వేసింది. ఇక 'లియో' విషయానికొస్తే.. లోకేష్ సినిమాటిక్ యూనివర్స్ లో భాగంగా తెరకెక్కిన ఈ సినిమాలో విజయ్ సరసన త్రిష హీరోయిన్ గా నటించింది. బాలీవుడ్ సీనియర్ యాక్టర్ సంజయ్ దత్, అర్జున్ సర్జ, ప్రియ ఆనంద్, గౌతమ్ మీనన్, మన్సూర్ అలీ ఖాన్, మాథ్యూ థామస్ కీలక పాత్రలు పోషించారు. కంప్లీట్ యాక్షన్ డ్రామాగా తెరకెక్కిన ఈ చిత్రాన్ని సెవెన్ స్క్రీన్ స్టూడియోస్ దానిపై ఎస్. ఎస్ లలిత్ కుమార్ నిర్మించగా అనిరుద్ రవిచంద్రన్ సంగీతం అందించారు. ఇక ‘లియో’ తర్వాత లోకేష్ తన తదుపరి చిత్రాన్ని సూపర్ స్టార్ రజినీకాంత్ తో చేయబోతున్నాడు. ప్రస్తుతం ఈ ప్రాజెక్టుకు సంబంధించి స్క్రిప్ట్ ని రెడీ చేసి పనిలో ఉన్నాడు ఈ కోలీవుడ్ యంగ్ డైరెక్టర్.

Also Read : ఒక్క హగ్ కోసం రజినీకాంత్ అంత గలాటా చేశారు - రంభ షాకింగ్ కామెంట్స్

ఇంకా చదవండి
Sponsored Links by Taboola

టాప్ హెడ్ లైన్స్

Pradeep Ranganathan: టాలీవుడ్ దర్శకుడితో 'డ్యూడ్'... ప్రదీప్ రంగనాథన్‌తో ఆ కాంబినేషన్ సెట్ 'ఐతే'నా?
టాలీవుడ్ దర్శకుడితో 'డ్యూడ్'... ప్రదీప్ రంగనాథన్‌తో ఆ కాంబినేషన్ సెట్ 'ఐతే'నా?
Gopichand New Movie: ఫైట్ మాస్టర్‌కు గోపీచంద్ డైరెక్షన్ ఛాన్స్... సంకల్ప్ రెడ్డి తర్వాత సినిమాపై క్లారిటీ
ఫైట్ మాస్టర్‌కు గోపీచంద్ డైరెక్షన్ ఛాన్స్... సంకల్ప్ రెడ్డి తర్వాత సినిమాపై క్లారిటీ
Inka Em Anukoledhu: ఇంకా ఏం అనుకోలేదు... ఈటీవీ విన్‌తో వంశీ నందిపాటి కొత్త సినిమా - రిలీజ్ ఎప్పుడంటే?
ఇంకా ఏం అనుకోలేదు... ఈటీవీ విన్‌తో వంశీ నందిపాటి కొత్త సినిమా - రిలీజ్ ఎప్పుడంటే?
Trisha Vs Parthiban: తప్పు... తప్పుడు పని... త్రిషకు సారీ చెబుతూ సెటైర్ వేసిన పార్తీబన్
తప్పు... తప్పుడు పని... త్రిషకు సారీ చెబుతూ సెటైర్ వేసిన పార్తీబన్

వీడియోలు

Gambhir Dedicates T20WC Win to Dravid & Laxman | ట్రోఫీ గెలిచాక గంభీర్ సంచలన నిర్ణయం
Ishan Kishan Family Tragedy T20WC | ఇషాన్ కిషన్ కన్నీటి గాథ
Abhishek Records with Dube's Bat | అభిషేక్ విధ్వంసం వెనుక అసలు రహస్యం ఇదే
Siraj Water Boy Comments T20 World Cup | సిరాజ్ ఫన్నీ కామెంట్స్ వైరల్
Santosh Nagar Steel Bridge | హైదరాబాద్ లో వివాదాస్పద స్టీల్ బ్రిడ్జి వద్ద పనులు ఎందుకు నిలిచిపోయాయి?

ఫోటో గ్యాలరీ

ABP Premium

వ్యక్తిగత కార్నర్

అగ్ర కథనాలు
టాప్ రీల్స్
Israel-Iran War: గ్యాస్ కొరతపై కేంద్రం కీలక నిర్ణయం! సప్లై కోసం ప్రయార్టీ జాబితా సిద్ధం!
గ్యాస్ కొరతపై కేంద్రం కీలక నిర్ణయం! సప్లై కోసం ప్రయార్టీ జాబితా సిద్ధం!
Andhra Pradesh Liquor Scam: లిక్కర్ స్కామ్‌పై సైలెంట్ - దూకుడుగా ఈడీ - వైఎస్ఆర్‌సీపీ భయపడుతోందా?
లిక్కర్ స్కామ్‌పై సైలెంట్ - దూకుడుగా ఈడీ - వైఎస్ఆర్‌సీపీ భయపడుతోందా?
US Israel Iran War:
"ప్రధాని మోదీ ఒక ఫోన్ కాల్ చేస్తే యుఎస్-ఇరాన్ యుద్ధం ఆగిపోతుంది" యుఎఇపై మాజీ రాయబారి కామెంట్స్ 
Kavitha Arrest: ఖమ్మం జిల్లా వెలుగుమట్లలో హైడ్రామా! నిరవధిక దీక్ష చేస్తున్న కవిత అరెస్టు! 
ఖమ్మం జిల్లా వెలుగుమట్లలో హైడ్రామా! నిరవధిక దీక్ష చేస్తున్న కవిత అరెస్టు! 
Siraj Water Boy Comments T20 World Cup | సిరాజ్ ఫన్నీ కామెంట్స్ వైరల్
Siraj Water Boy Comments T20 World Cup | సిరాజ్ ఫన్నీ కామెంట్స్ వైరల్
Sai Pallavi: సాయి పల్లవి మిర్రర్ సెల్ఫీలు... డ్రస్‌ల గురించి ఏం చెప్పిందంటే?
సాయి పల్లవి మిర్రర్ సెల్ఫీలు... డ్రస్‌ల గురించి ఏం చెప్పిందంటే?
బుల్ బార్‌లపై కేంద్రం నిషేధం - మీ కారుకు ఉంటే వెంటనే తీసేయండి, లేదంటే ఫైన్ తప్పదు
మీ కారుకు బంపర్ గార్డ్ ఉందా? జాగ్రత్త, రూ.5,000 వరకు జరిమానా పడొచ్చు!
Kadiri: కదిరి లక్ష్మీ నరసింహ స్వామి బ్రహ్మోత్సవాల్లో రాజకీయాలు - బీజేపీ నేతలకు అవమానం - ఎమ్మెల్యే పనే ?
కదిరి లక్ష్మీ నరసింహ స్వామి బ్రహ్మోత్సవాల్లో రాజకీయాలు - బీజేపీ నేతలకు అవమానం - ఎమ్మెల్యే పనే ?
Embed widget