అన్వేషించండి

Rambha: ఒక్క హగ్ కోసం రజినీకాంత్ అంత గలాటా చేశారు - రంభ షాకింగ్ కామెంట్స్

Rambha: సీనియర్ హీరోయిన్ రంభ.. తన కెరీర్ మొదట్లోనే రజినీకాంత్‌తో కలిసి ‘అరుణాచలం’ అనే సినిమాలో నటించారు. ఆ షూటింగ్ అనుభవాలను గుర్తుచేసుకుంటూ రజినీ గురించి పలు షాకింగ్ విషయాలు బయటపెట్టారు రంభ.

Rambha - Rajinikanth: ఒకప్పుడు హీరోయిన్ రంభ అంటే యూత్‌లో విపరీతమైన క్రేజ్ ఉండేది. అప్పట్లో తను చాలామందికి క్రష్ కూడా. చాలా చిన్న వయసులోనే ఇండస్ట్రీలోకి హీరోయిన్‌గా అడుగుపెట్టిన రంభ.. కొంతకాలంలోనే తెలుగు, హిందీ, తమిళ భాషల్లో బ్యాక్ టు బ్యాక్ సినిమాలతో బిజీ అయిపోయింది. తన కెరీర్ మంచి ఫార్మ్‌లో ఉన్న సమయంలోనే తనకు రజినీకాంత్‌తో కలిసి నటించే అవకాశం లభించింది. 1997లో విడుదలయిన ‘అరుణాచలం’లో రజినీతో కలిసి పనిచేసింది ఈ భామ. అయితే తాజాగా తన పాల్గొన్న ఒక ఇంటర్వ్యూలో రజినీ గురించి, తనతో పనిచేసిన అనుభవం పలు షాకింగ్ విషయాలు బయటపెట్టింది రంభ.

సుష్మితా సేన్ చేయాల్సిన పాత్ర..
ముందుగా తమిళంలో తన మొదటి సినిమా ‘ఉల్లై ఆల్లితా’ విడుదలయిన తర్వాత రజినీకాంత్ తనకు స్వయంగా ఫోన్ చేసి తన పర్ఫార్మెన్స్‌ను ప్రశంసించారని తెలిపింది రంభ.

ఆ తర్వాత ‘అరుణాచలం’లో రజినీతో కలిసి నటించే అవకాశం వచ్చిందని గుర్తుచేసుకుంది. ఇక ఆ షూటింగ్ అనుభవాలను రంభ బయటపెట్టింది. ‘‘హైదరాబాద్‌లో మొదటిరోజు షూటింగ్ కోసం నేను ఉదయం 7 గంటల వరకు రెడీగా ఉన్నాను. కానీ దర్శకుడు సుందర్ ఆరోజు నాకేం షూట్ లేదన్నారు. అలా 3 రోజులు నేను కేవలం రెస్ట్ మాత్రమే తీసుకున్నాను. నాకు కోపం వచ్చింది. 4వ రోజు నేను సినిమాలో ఉన్నానా లేదా అని సుందర్‌ను, రజినీకాంత్‌ను అడిగాను. దీంతో తరువాతి రోజు ఉదయం 7 గంటలకు నాకు షూట్ ఉందని సుందర్ చెప్పాడు. నేను అయిదు నిమిషాల ముందే లోకేషన్‌ కు వెళ్లాను. కానీ అప్పటికే రజినీకాంత్ మేకప్ వేసుకొని రెడీగా నాకోసం ఎదురుచూస్తున్నారు. వెళ్లి ఆయనను పలకరించినప్పుడు ఈ పాత్ర సుష్మితా సేన్ చేయాల్సింది నీకు వచ్చింది అన్నారు. అంత పెద్ద రోల్ నాకు వచ్చిందా అని సంతోషడ్డాను’’ అని షూటింగ్ మొదట్లో తనకు ఎదురైన అనుభవాలను చెప్పుకొచ్చింది రంభ.

ఏం చేయాలో తెలియక ఏడ్చేశాను..
‘‘నేను అరుణాచలంకు షూటింగ్ చేస్తున్న సమయంలోనే హిందీలో సల్మాన్ ఖాన్‌తో 'బంధన్' సినిమాను కూడా చేస్తున్నాను. నేను హైదరాబాద్‌లో రజినీకాంత్‌తో షూట్ చేస్తుండడంతో 'బంధన్' టీమ్ కూడా ఇక్కడే షూటింగ్ పెట్టుకుంది. ఒకరోజు సల్మాన్ ఖాన్, జాకీ ష్రాఫ్.. అరుణాచలం సెట్స్‌కు వచ్చారు. వాళ్లని చూడగానే నేను వెళ్లి హగ్ చేసుకున్నారు. ఎందుకంటే వాళ్లది బొంబాయ్ కల్చర్ కాబట్టి. రజినీకాంత్ ఇది గమనించారు. వాళ్లు వెళ్లిపోయిన తర్వాత రజినీకాంత్ చాలా కోపంలో ఉన్న విషయాన్ని నేను గమనించాను. సుందర్.. ఆయనను బ్రతిమిలాడుతూ మధ్యమధ్యలో నన్ను చూస్తున్నారు. నాకేం అర్థం కాలేదు. అప్పుడే కెమెరామ్యాన్ యూకే సెంథిల్ కుమార్ నా దగ్గరకు వచ్చి ఏం చేశావని అడిగారు. సుందర్‌కు ఆటపట్టించడం చాలా ఇష్టం. ఇది కూడా అలాంటిదే అనుకున్నాను. కానీ అక్కడ ఉన్న స్టాఫ్ అంతా రజినీకాంత్‌కు నీతో నటించడం ఇష్టం లేదు అనడం మొదలుపెట్టారు. నేనేం తప్పు చేశానో తెలియక ఏడ్చేశాను. అప్పుడు రజినీకాంత్ వచ్చి ఎందుకు అమ్మాయిని ఏడిపిస్తున్నారు అని ఓదార్చారు’’ అని తన చేదు అనుభవాన్ని గుర్తుచేసుకుంది రంభ. ఆ తర్వాత అసలు ఏం జరిగిందో రజినీని అడిగి క్లారిటీ తీసుకున్నానని చెప్పుకొచ్చింది.

గలాటా చేశారు..
‘‘అసలు ఏమైంది అని అడిగినప్పుడు రజినీకాంత్ సెట్‌లో ఉన్న అందరినీ పిలిచారు. ‘సల్మాన్ ఖాన్ వచ్చినప్పుడు రంభ ఎలా హగ్ చేసుకుందో చూశారు కదా. కానీ మన సెట్‌లోకి వచ్చినప్పుడు మాత్రం గుడ్ మార్నింగ్ సార్ అని చెప్పి వెళ్లి కూర్చుంటుంది. మనం సౌత్ కాబట్టి చిన్నచూపా? రేపటి నుండి లైట్ బాయ్స్‌తో సహా అందరూ లైన్‌లో నిలబడాలి. రంభ అందరినీ హగ్ చేసుకోవాలి. అప్పుడే షూటింగ్ ఉంటుంది లేకపోతే లేదు’ అని కోపంగా చెప్పారు. పెద్ద గలాటా చేశారు. అసలు ఈయన ఇలా ఎలా ఆలోచించగలుగుతారు అనుకున్నాను. అప్పుడే పెద్దగా నవ్వేశారు. ఆయన మంచి నటుడు. నాతో, సౌందర్యతో చాలా సరదాగా ఉండేవారు. సౌందర్య స్మార్ట్ అయినా అమాయకురాలు అని చెప్పేవారు. నన్ను చూపించి అమాయకంగా కనిపించే స్మార్ట్ అని అనేవారు’’ అంటూ అప్పటి రోజులను గుర్తుచేసుకుంది రంభ. 

Also Read: ‘సలార్ 2’ షూటింగ్‌పై ప్రభాస్ కీలక అప్డేట్, మూవీ రిలీజ్ డేట్‌ను కన్ఫర్మ్ చేసిన నిర్మాత

మరిన్ని చూడండి
Advertisement

టాప్ హెడ్ లైన్స్

AP News: ఏపీలో ఎన్టీపీసీ భారీ పెట్టుబడులు - 1.06 లక్షల మందికి ఉద్యోగావకాశాలు, సీఎం చంద్రబాబు సమక్షంలో ఒప్పందం
ఏపీలో ఎన్టీపీసీ భారీ పెట్టుబడులు - 1.06 లక్షల మందికి ఉద్యోగావకాశాలు, సీఎం చంద్రబాబు సమక్షంలో ఒప్పందం
Rains: ఏపీకి మరోసారి అల్పపీడనం - ఆ 2 రోజులు భారీ వర్షాలు, తెలంగాణలో పెరిగిన చలి తీవ్రత
ఏపీకి మరోసారి అల్పపీడనం - ఆ 2 రోజులు భారీ వర్షాలు, తెలంగాణలో పెరిగిన చలి తీవ్రత
BRS Vs BJP: అదానీ అంశాన్ని బీజేపీతో ముడిపెట్టి బీఆర్ఎస్ విమర్శలు - గట్టి కౌంటర్ ఇచ్చిన విష్ణువర్ధన్ రెడ్డి
అదానీ అంశాన్ని బీజేపీతో ముడిపెట్టి బీఆర్ఎస్ విమర్శలు - గట్టి కౌంటర్ ఇచ్చిన విష్ణువర్ధన్ రెడ్డి
Kalvakuntla Kavitha: అదానీకో న్యాయం..ఆడబిడ్డకో న్యాయమా - మోదీపై కల్వకుంట్ల కవిత సంచలన వ్యాఖ్యలు
అదానీకో న్యాయం..ఆడబిడ్డకో న్యాయమా - మోదీపై కల్వకుంట్ల కవిత సంచలన వ్యాఖ్యలు
Advertisement
Advertisement
Advertisement
ABP Premium

వీడియోలు

బోర్డర్ గవాస్కర్ ట్రోఫీకి సిద్ధమైన టీమ్ ఇండియాఅమెరికాలో అదానీపై అవినీతి కేసు సంచలనంసోషల్ మీడియాలో అల్లు అర్జున్ రామ్ చరణ్ ఫ్యాన్ వార్ధనుష్‌పై మరో సంచలన పోస్ట్ పెట్టిన నయనతార

ఫోటో గ్యాలరీ

వ్యక్తిగత కార్నర్

అగ్ర కథనాలు
టాప్ రీల్స్
AP News: ఏపీలో ఎన్టీపీసీ భారీ పెట్టుబడులు - 1.06 లక్షల మందికి ఉద్యోగావకాశాలు, సీఎం చంద్రబాబు సమక్షంలో ఒప్పందం
ఏపీలో ఎన్టీపీసీ భారీ పెట్టుబడులు - 1.06 లక్షల మందికి ఉద్యోగావకాశాలు, సీఎం చంద్రబాబు సమక్షంలో ఒప్పందం
Rains: ఏపీకి మరోసారి అల్పపీడనం - ఆ 2 రోజులు భారీ వర్షాలు, తెలంగాణలో పెరిగిన చలి తీవ్రత
ఏపీకి మరోసారి అల్పపీడనం - ఆ 2 రోజులు భారీ వర్షాలు, తెలంగాణలో పెరిగిన చలి తీవ్రత
BRS Vs BJP: అదానీ అంశాన్ని బీజేపీతో ముడిపెట్టి బీఆర్ఎస్ విమర్శలు - గట్టి కౌంటర్ ఇచ్చిన విష్ణువర్ధన్ రెడ్డి
అదానీ అంశాన్ని బీజేపీతో ముడిపెట్టి బీఆర్ఎస్ విమర్శలు - గట్టి కౌంటర్ ఇచ్చిన విష్ణువర్ధన్ రెడ్డి
Kalvakuntla Kavitha: అదానీకో న్యాయం..ఆడబిడ్డకో న్యాయమా - మోదీపై కల్వకుంట్ల కవిత సంచలన వ్యాఖ్యలు
అదానీకో న్యాయం..ఆడబిడ్డకో న్యాయమా - మోదీపై కల్వకుంట్ల కవిత సంచలన వ్యాఖ్యలు
AP News: పెన్షన్ దారులకు ఏపీ ప్రభుత్వం గుడ్ న్యూస్ - కీలక మార్గదర్శకాలు జారీ
పెన్షన్ దారులకు ఏపీ ప్రభుత్వం గుడ్ న్యూస్ - కీలక మార్గదర్శకాలు జారీ
Adani Group Statement:  అమెరికా కోర్టులో కేసు ఆరోపణలన్నీ అవాస్తవం, తిరస్కరిస్తున్నాం - అదానీ గ్రూప్ ప్రకటన
అమెరికా కోర్టులో కేసు ఆరోపణలన్నీ అవాస్తవం, తిరస్కరిస్తున్నాం - అదానీ గ్రూప్ ప్రకటన
Diksha Divas: తెలంగాణవ్యాప్తంగా ఈ నెల 29న 'దీక్షా దివస్' - పార్టీ శ్రేణులకు కేటీఆర్ పిలుపు
తెలంగాణవ్యాప్తంగా ఈ నెల 29న 'దీక్షా దివస్' - పార్టీ శ్రేణులకు కేటీఆర్ పిలుపు
Nara Lokesh : ఏపీలో బిచ్చగాళ్ల మాఫియా - బెగ్గింగ్ ముఠాల్లో పిల్లలే సమిధలు - నారా లోకేష్ ఆదేశాలతో గుట్టు రట్టు
ఏపీలో బిచ్చగాళ్ల మాఫియా - బెగ్గింగ్ ముఠాల్లో పిల్లలే సమిధలు - నారా లోకేష్ ఆదేశాలతో గుట్టు రట్టు
Embed widget