Salaar 2: ‘సలార్ 2’ షూటింగ్‌పై ప్రభాస్ కీలక అప్డేట్, మూవీ రిలీజ్ డేట్‌ను కన్ఫర్మ్ చేసిన నిర్మాత
Salaar Part 2 Update: ‘సలార్’ పార్ట్ 1 థియేటర్లలో సందడి చేస్తుండగా.. పార్ట్ 2 గురించి హీరో ప్రభాస్, నిర్మాత విజయ్.. కీలక అప్డేట్స్‌ను ఇచ్చారు. అంతే కాకుండా విడుదల ఎప్పుడో కూడా నిర్మాత బయటపెట్టారు.
Prabhas about Salaar 2: పాన్ ఇండియా స్టార్ ప్రభాస్.. ఎంతోకాలంగా ఎదురుచూస్తున్న హిట్‌ను తనకు అందించింది ‘సలార్’. ప్రశాంత్ నీల్ కాంబినేషన్‌లో తెరకెక్కిన ఈ మూవీ.. ఇప్పటికీ సక్సెస్‌ఫుల్‌గా థియేటర్లలో రన్ అవుతోంది. కలెక్షన్స్ విషయంలో కూడా ఎన్నో రికార్డులను బ్రేక్ చేసుకుంటూ ‘సలార్’ దూసుకుపోతోంది. ప్రభాస్‌తో పాటు పృథ్విరాజ్ సుకుమారన్ కూడా ఈ మూవీలో కీలక పాత్రలో కనిపించాడు. అయితే ఇప్పటికే ‘సలార్’కు రెండు భాగాలు ఉంటాయని దర్శకుడు ప్రశాంత్ నీల్ రివీల్ చేయగా.. రెండో భాగం గురించి ఒక కీలకమైన అప్డేట్‌ను బయటపెట్టాడు ప్రభాస్. అంతే కాకుండా 2024 రెజల్యూషన్ ఏంటో కూడా తెలిపాడు.
నా ఫ్యాన్స్ ఎదురుచూస్తున్నారు..
‘‘కథ ఇప్పటికే సిద్ధంగా ఉంది. దానిని మేము త్వరలోనే ప్రారంభిస్తాం. వీలైనంత త్వరగా ప్రేక్షకుల ముందుకు వచ్చేలా చేస్తాం. దాని విడుదల కోసం నా ఫ్యాన్స్ చాలామంది ఎదురుచూస్తున్నారని నాకు తెలుసు. సలార్ పార్ట్ 2 గురించి మరిన్ని వివరాలు త్వరలోనే బయటపెడతాం’’ అని ప్రభాస్ తెలిపాడు.
ఇప్పటికే ‘సీజ్‌ఫైర్’ పేరుతో రిలీజ్ అయిన పార్ట్ 1కు మంచి ఆదరణ లభిస్తుండగా.. దానిని బట్టి పార్ట్ 2 స్క్రిప్ట్‌లో మార్పులు చేర్పులు చేయనున్నాడట ప్రశాంత్ నీల్. అంతే కాకుండా పార్ట్ 1 కలెక్షన్స్‌ను బట్టి పార్ట్ 2ను ఎంత భారీ స్థాయిలో తెరకెక్కించాలని నిర్ణయించుకోనున్నారట మేకర్స్. ఇక ‘సలార్’ పార్ట్ 2 గురించి చెప్పిన ప్రభాస్.. 2024లో తన రెజల్యూషన్ ఏంటో కూడా బయటపెట్టాడు.
ఆడియన్స్‌ను ఎంటర్‌టైన్ చేయాలి..
‘‘నాకు ప్రత్యేకంగా మంత్రా అంటూ ఏమీ లేవు. ప్రపంచవ్యాప్తంగా వీలైనంత మందిని నా పనితో ఎంటర్‌టైన్ చేయాలి. నేను ఎంచుకునే సినిమాలకు కూడా అదే కారణం. నా తరువాతి సినిమా భవిష్యత్తుకు సంబంధించి ఉంటుంది. సలార్.. ఒక మాస్ సినిమా, ఆ తరువాతి ప్రాజెక్ట్ ఒక హారర్ సినిమా. నేను వేర్వేరు జోనర్లలో ప్రయోగాలు చేస్తూ.. ఆడియన్స్‌ను ఎంటర్‌టైన్ చేయాలనుకుంటున్నాను. సలార్‌కు ఆదరించినట్టుగానే నా తరువాతి సినిమాలను కూడా ప్రేక్షకులు ఆదరిస్తారని కోరుకుంటున్నాను’’ అంటూ తన తరువాతి ప్రాజెక్ట్స్‌పై క్లారిటీ ఇచ్చాడు ప్రభాస్. ఇక ప్రభాస్ మాత్రమే కాకుండా ‘సలార్’ నిర్మాత విజయ్ కిరగండూర్ కూడా ‘సలార్ 2’ గురించి పలు ఆసక్తికర విషయాలను బయటపెట్టారు.
‘గేమ్ ఆఫ్ థ్రోన్స్’ రేంజ్‌లో..
‘‘సలార్ 2 స్క్రిప్ట్ సిద్ధంగా ఉంది కాబట్టి దాని షూటింగ్ ఎప్పుడైనా ప్రారంభించే అవకాశం ఉంది. ప్రభాస్, ప్రశాంత్ కూడా వీలైనంత త్వరగా దీనిని సెట్స్‌పైకి తీసుకెళ్లాలని అనుకుంటున్నారు. వచ్చే 15 నెలల్లో సలార్ 2ను పూర్తి చేయాలని చర్చలు జరుగుతున్నాయి. 2025లో ఎట్టి పరిస్థితుల్లో సలార్ 2ను విడుదల చేస్తాం. సలార్‌కు వస్తున్న ఫీడ్‌బ్యాక్ నాకు నచ్చింది.
ప్రపంచవ్యాప్తంగా సలార్ అనేది ప్రభాస్ ఫ్యాన్స్‌కు సెలబ్రేషన్‌లాంటిది. 20 ఏళ్లలో ఒక యాంగ్రీ యంగ్ మ్యాన్‌లాగా ప్రభాస్‌ను ప్రేక్షకులు మొదటిసారి చూస్తున్నారు. సలార్ 1 అనేది పార్ట్ 2కు కేవలం గ్లింప్స్ మాత్రమే. యాక్షన్ విషయంలో, తెరకెక్కించే విషయంలో పార్ట్ 2 మరింత భారీస్థాయిలో ఉంటుంది. డ్రామా, రాజకీయాలు, యాక్షన్ అన్నీ కలిపి సలార్ 2 ఒక గేమ్ ఆఫ్ థ్రోన్స్‌లాగా ఉంటుంది’’ అని నిర్మాత విజయ్ స్టేట్‌మెంట్ ఇచ్చారు. ఇది విన్న ప్రభాస్ ఫ్యాన్స్ ఫుల్ ఖుషీ అవుతున్నారు.
Also Read: నవంబర్‌లో పెళ్లి, జనవరిలో ప్రెగ్నెన్సీ - తల్లి కాబోతున్న 'నాయక్' హీరోయిన్