(Source: Poll of Polls)
Peddi First Song : 'పెద్ది'పై రామ్ చరణ్ క్వశ్చన్ - AR రెహమాన్ క్యూట్ రిప్లై... సేమ్ 'SSMB29' టీంలానే అప్డేట్
Ram Charan : మెగా ఫ్యాన్స్ ఎప్పుడెప్పుడా అని ఎదురు చూస్తున్న 'పెద్ది' ఫస్ట్ సింగిల్ రెడీ అవుతోంది. సోషల్ మీడియా వేదికగా ఏఆర్ రెహమాన్ పాటపై బిగ్ అప్డేట్ ఇచ్చారు.

AR Rahman About Peddi First Single : గ్లోబల్ స్టార్ రామ్ చరణ్, నయా అతిలోక సుందరి జాన్వీ కపూర్ జంటగా నటిస్తోన్న అవెయిటెడ్ విలేజ్ స్పోర్ట్స్ డ్రామా 'పెద్ది'. 'ఉప్పెన' ఫేం బుచ్చిబాబు దర్శకత్వం వహిస్తోన్న ఈ మూవీ నుంచి ఫస్ట్ సింగిల్ కోసం అటు మెగా ఫ్యాన్స్‌తో పాటు ఇటు మూవీ లవర్స్ ఎంతగానో ఎదురుచూస్తున్నారు. తాజాగా మొదటి పాటపై ఆస్కార్ విన్నర్, లెజండరీ మ్యూజిక్ డైరెక్టర్ ఏఆర్ రెహమాన్ అప్డేట్ ఇచ్చారు.
చరణ్ క్వశ్చన్?
రామ్ చరణ్ సోషల్ మీడియా వేదికగా 'పెద్ది' అప్డేట్‌పై క్వశ్చన్ వేశారు. రెహమాన్, బుచ్చిబాబు, మోహిత్ చౌహాన్ ఉన్న ఫోటో షేర్ చేస్తూ... 'ఏం ప్లాన్ చేస్తున్నారు?' అంటూ అడిగారు. దీనికి ఏ ఆర్ రెహమాన్ రియాక్ట్ అవుతూ... 'చికిరి చికిరి... చరణ్ గారు' అంటూ సమాధానం ఇచ్చారు. ఫస్ట్ సింగిల్ కోసం వర్క్ జరుగుతున్నట్లు తెలుస్తుండగా... సాంగ్ ఎప్పుడు రిలీజ్ చేసేది మాత్రం అనౌన్స్ చేయలేదు. ప్రస్తుతం ఈ చాట్ వైరల్ అవుతోంది.
2 రోజుల క్రితం ఇదే సోషల్ మీడియాలో 'SSMB29' టీం సేమ్ ఇలానే అప్డేట్స్‌పై చర్చించుకున్నారు. మహేష్, ప్రియాంక చోప్రా, పృథ్వీరాజ్ సుకుమారన్ అప్డేట్ ఎప్పుడంటూ... దర్శక ధీరుడు రాజమౌళిని సరదాగా ప్రశ్నించారు. దీంతో ఒక్కసారిగా నెట్టింట ఇదే ట్రెండింగ్ టాపిక్ అయ్యింది. సేమ్ అలానే ఇప్పుడు 'పెద్ది' టీం కూడా సోషల్ మీడియాలో సందడి చేసింది.
What's cooking, guys?🤔🤗@BuchiBabuSana @arrahman sir @_MohitChauhan ji pic.twitter.com/HB9T5bnXkJ
— Ram Charan (@AlwaysRamCharan) November 3, 2025
'Chikiri Chikiri' Charan garu 😃 https://t.co/fmfwYSJFU8
— A.R.Rahman (@arrahman) November 3, 2025
Also Read : సినిమా గవర్నమెంట్ జాబ్ కాదు - వర్కింగ్ అవర్స్ కాంట్రవర్శీపై 'ది గర్ల్ ఫ్రెండ్' ప్రొడ్యూసర్ రియాక్షన్
లవ్ రొమాంటిక్ సాంగ్ ఎప్పుడు?
ప్రస్తుతం 'పెద్ది' షూటింగ్ శరవేగంగా సాగుతుండగా రీసెంట్‌గా శ్రీలంకలో షూటింగ్ కంప్లీట్ చేసుకున్నట్లు తెలుస్తోంది. చరణ్, జాన్వీలపై లవ్ రొమాంటిక్ సాంగ్ షూట్ చేసినట్లు టాక్ వినిపిస్తోంది. తాజా చాటింగ్‌లో సాంగ్ రిలీజ్ ఎప్పుడో చెప్పకపోయినప్పటికీ హైదరాబాద్‌లో జరగనున్న ఏఆర్ రెహమాన్ స్పెషల్ ఈవెంట్‌లో ఈ నెల 8న పాట రిలీజ్ చేయనున్నట్లు తెలుస్తోంది. గ్లింప్స్‌లోనే 'పెద్ది... పెద్ది... పెద్ది' అంటూ భారీ హైప్ క్రియేట్ చేశారు రెహమాన్. చరణ్ సిగ్నేచర్ షాట్ మరింత హైలెట్‌గా నిలిచింది. ఇక 'చికిరి చికిరి' అని చెప్పడం చూస్తుంటే ఇదే సాంగ్‌లో మెయిన్ పార్ట్ అని అర్థమవుతోంది. హింట్స్‌తో పాట ఎలా ఉంటుందోనని అందరిలోనూ ఆసక్తి నెలకొంది.
అచ్చియమ్మగా 'జాన్వీ'
ఈ మూవీలో 'జాన్వీ' రోల్‌ను రీసెంట్‌గానే ఇంట్రడ్యూస్ చేశారు. సినిమాలో ఆమె అచ్చియమ్మ పాత్రలో నటించనున్నట్లు తెలిపారు. ఆమెది మాంచి మాసీ రోల్ అని... ఇంతకు ముందు ఎప్పుడూ చూడని పాత్రలో చూస్తారని చెప్పారు. జానపద గాయని పాత్రలో ఆమె నటిస్తున్నట్లు లుక్‌ను బట్టి తెలుస్తోంది.
మూవీలో కరుణాడ చక్రవర్తి శివరాజ్ కుమార్, 'మీర్జాపూర్' ఫేం దివ్యేందు శర్మ, సీనియర్ నటుడు జగపతిబాబు కీలక పాత్రలు పోషిస్తున్నారు. మైత్రీ మూవీ మేకర్స్, సుకుమార్ రైటింగ్స్ సమర్పణలో వృద్ధి సినిమాస్ బ్యానర్‌పై సతీష్ వెంకట కిలారు నిర్మిస్తున్నారు. వచ్చే ఏడాది మార్చి 27న మూవీ ప్రేక్షకుల ముందుకు రానుంది.





















